ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Surayapet: భార్యను హత్యచేసి... అనారోగ్యంగా ఏమార్చి

ABN, Publish Date - Aug 15 , 2024 | 03:38 AM

భార్యను హత్య చేసి... తన మీద అనుమానం రాకుండా ఉండేందుకు అంబులెన్సును పిలిపించి ఆసుపత్రికి తీసుకువెళ్లాడో ప్రబుద్ధుడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించగా, మెడపై ఉన్న గాట్లను గుర్తించి పోలీసులు ప్రశ్నించటంతో తానే హత్య చేసినట్లు అంగీకరించాడు.

  • విషయం దాచి అంబులెన్సులో ఆస్పత్రికి తరలింపు

  • అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించిన వైద్యులు

  • మెడపై గాట్లతో హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు

  • సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘటన

సూర్యాపేట క్రైం, ఆగస్టు 14: భార్యను హత్య చేసి... తన మీద అనుమానం రాకుండా ఉండేందుకు అంబులెన్సును పిలిపించి ఆసుపత్రికి తీసుకువెళ్లాడో ప్రబుద్ధుడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించగా, మెడపై ఉన్న గాట్లను గుర్తించి పోలీసులు ప్రశ్నించటంతో తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. బుధవారం సూర్యాపేట పట్టణంలో ఈ సంఘటన జరిగింది. సూర్యాపేట ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరు మండలానికి చెందిన దాసోజు బ్రహ్మాచారి 2014లో నకిరేకల్‌ మండలం కడపర్తి గ్రామానికి చెందిన సరిత(31)ను ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు.


వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుటుంబంతో కలిసి సూర్యాపేటలోని శ్రీరాంన గర్‌లో ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. బ్రహ్మచారి మద్యానికి అలవాటుపడటంతో భార్యాభర్తల మఽధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అయితే బుధవారం ఉదయం సరిత నిద్ర నుంచి లేవడంలేదని ఆమె బంధువులకు బ్రహ్మచారి సమాచారం ఇచ్చాడు. అంబులెన్సును పిలిపించి ప్రభుత్వాస్పత్రికి తరలించాడు.


అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సరిత మెడపై ఉన్న గాట్లను బట్టి పోలీసులు హత్య జరిగినట్లు గుర్తించారు. బ్రహ్మచారిని ప్రశ్నించగా... ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఇంట్లో ఉన్న జీఐ వైరుతో భార్య మెడకు ఉరి బిగించి హత్య చేసినట్లు అంగీకరించాడు. ఈ ఘటనపై సరిత తల్లి రాములమ్మ ఫిర్యాదు మేరకు బ్రహ్మచారిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

Updated Date - Aug 15 , 2024 | 03:38 AM

Advertising
Advertising
<