Hyderabad: 21 ఏళ్ల పిల్లి మృతి.. కన్నీటి పర్యంతమైన యజమానులు
ABN, Publish Date - Dec 03 , 2024 | 06:52 AM
ఇంట్లో 21 ఏళ్ల పాటు అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లి మృతి చెందడంతో దాని యజమానులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ సొంత కుటుంబసభ్యులను కోల్పోయినట్లు బాధ పడ్డారు. భారతదేశంలో సాధారణంగా పిల్లుల జీవితకాలం 14 నుంచి 16 ఏళ్ల పాటే ఉంటుంది.
- శోకసంద్రంతో అంత్యక్రియలు
హైదరాబాద్: ఇంట్లో 21 ఏళ్ల పాటు అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లి మృతి చెందడంతో దాని యజమానులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ సొంత కుటుంబసభ్యులను కోల్పోయినట్లు బాధ పడ్డారు. భారతదేశంలో సాధారణంగా పిల్లుల జీవితకాలం 14 నుంచి 16 ఏళ్ల పాటే ఉంటుంది. అయితే ఈ పిల్లి రికార్డు స్థాయిలో 21 ఏళ్ల పాటు జీవించింది. 2004 సెప్టెంబర్ 19న జన్మించిన ఈ పిల్లిని హైదరాబాద్(Hyderabad)లోని అంబర్‌పేటలో నివాసం ఉంటున్న జూలూరు శ్రీదేవీ(Juluru Sridevi) కుటుంబసభ్యులు ముద్దుగా పొట్టి అని పిలుచుకుంటూ అల్లారుముద్దుగా పెంచుకున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: 6న యాదాద్రి తొలి యూనిట్ ప్రారంభోత్సవం
2011లో ఓ అర్ధరాత్రి తాను ఛాతీ నొప్పితో అవస్థలు పడుతుంటే పక్కనే ఉన్న పొట్టి గట్టిగా ఆరుస్తూ కుటుంబసభ్యులను నిద్రలేపిందని, ఆసుపత్రికి తీసుకెళ్లగా గుండెపోటుగా వైద్యులు నిర్ధారించి స్టంట్ వేశారని దాని యజమాని శ్రీదేవి తెలిపారు. పొట్టి వల్లనే తాను ప్రాణాలతో బయటపడ్డాడని ఆమె చెప్పారు. ఇలా ప్రతి విషయంలో తమకు దగ్గరైన పొట్టి మృతి శ్రీదేవి కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. అంబర్‌పేట హిందూ శ్మశాన వాటికలో పొట్టి అంత్యక్రియలు నిర్వహించారు.
ఈవార్తను కూడా చదవండి: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సైతం ఆయిల్ పామ్ సాగు బాట పట్టారు..
ఈవార్తను కూడా చదవండి: నాలుగు నెలల క్రితమే అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థి.. చివరకు
ఈవార్తను కూడా చదవండి: తుపాకులతో పట్టుపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. చివరికి ఆరా తీస్తే..
ఈవార్తను కూడా చదవండి: ఎస్ఐ సూసైడ్ వ్యవహారంలో సంచలన విషయాలు
Read Latest Telangana News and National News
Updated Date - Dec 03 , 2024 | 06:52 AM