Hyderabad: 33శాతం పెరిగిన విద్యుత్ వినియోగం..
ABN, Publish Date - May 30 , 2024 | 10:20 AM
గ్రేటర్‌లో పరిధిలోని రంగారెడ్డి జోన్(Rangareddy Zone)లో ఈ యేడాది సమ్మర్‌లో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఏప్రిల్, మే నెలల్లో సరాసరి 33శాతం అధికంగా విద్యుత్ వినియోగం నమోదైంది.
- రంగారెడ్డి జోన్‌లో ఇది రికార్డు
- గతేడాదితో పోల్చితే ఏప్రిల్‌లో 35శాతం, మేలో 31 శాతం పెరిగిన డిమాండ్
హైదరాబాద్ సిటీ: గ్రేటర్‌లో పరిధిలోని రంగారెడ్డి జోన్(Rangareddy Zone)లో ఈ యేడాది సమ్మర్‌లో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఏప్రిల్, మే నెలల్లో సరాసరి 33శాతం అధికంగా విద్యుత్ వినియోగం నమోదైంది. గతేడాది కంటే ఈ యేడాది ఏప్రిల్‌లో 35శాతం, మేలో 31శాతం మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అధికంగా నమోదయింది. గత పదేళ్లలో ఈ స్థాయిలో విద్యుత్ వినియోగం జరగడం ఇదే మొదటిసారని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. శివారు ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో పెరుగుతున్న విద్యుత్ కనెక్షన్లతో విద్యుత్ డిమాండ్ అదే తరహాలో పెరుగుతున్నది. రంగారెడ్డి జోన్ పరిధిలోని సైబర్‌సిటీ, రాజేంద్రనగర్, సరూర్‌నగర్ సర్కిళ్లలో(Cybercity, Rajendranagar, Sarurnagar Circles) రికార్డుస్థాయిలో డిమాండ్ పెరుగుతుండటంతో దానికి అనుగుణంగా విద్యుత్‌శాఖ సబ్‌స్టేషన్లలో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం రెట్టింపు స్థాయిలో పెంచారు. సైబర్‌సిటీ సర్కిల్‌లో గతేడాది మే నెలలో 465 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదవగా ఈ యేడాది మే 28 వరకు 714 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదయింది. గతేడాది కంటే 53.55 శాతం అదనడం కావడం గమనార్హం. గతేడాది మే కంటే ఈ యేడాది మే నెలలో రాజేంద్రనగర్ సర్కిల్‌లో 12.04 శాతం, సరూర్‌నగర్ సర్కిల్‌లో 15.54 శాతం విద్యుత్ డిమాండ్ పెరిగింది.
ఇదికూడా చదవండి: Warangal: మేడారం గద్దెల వద్ద పూజారుల ధర్నా ..
రూ. 12.5 కోట్లతో పీటీఆర్‌ల సామర్థ్యం పెంపు
వేసవి విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని రంగారెడ్డిజోన్ పరిధిలో 12 సబ్‌స్టేషన్లలో రూ.12.5 కోట్లతో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల (పీటీఆర్)సామర్థ్యం పెంచారు. దీంతో గతేడాది కంటే ఈ యేడాది 11 కేవీ ఫీడర్ల పరిధిలో ట్రిప్పింగ్స్ తగ్గాయి. కోకాపేట, నార్సింగ్, గచ్చిబౌలి, ఉమదాన్‌నగర్, జల్‌పల్లి, తుర్కయాంజాల్, మదర్‌డెయిరీ, తట్టిఅన్నారం ప్రాంతాల్లోని సబ్‌స్టేషన్లలో పీటీఆర్‌ల సామర్థ్యం 5 నుంచి 8 మెగా వాట్స్ యాంప్స్ (ఎంవీఏ)కు పెంచారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్ రోజున.. తగ్గిన పొల్యూషన్
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - May 30 , 2024 | 10:20 AM