ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: పన్నెండేళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు..

ABN, Publish Date - Aug 15 , 2024 | 10:44 AM

పన్నెండేళ్ల కుమారుడు సిగరెట్‌(Cigarette) తాగుతున్నాడన్న విషయం తెలిసిన తండ్రి మందలించడంతో ఆ ఇంటిని విడిచి వెళ్లిన ఓ కుర్రాడు మరో పన్నెండేళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు చేరాడు. ఈ క్రమంలో ఎన్నో చెడుసావాసాలు చేశాడు.

- సిగరెట్‌ మానేయమని మందలించడంతో 12వ ఏట ఇంటికి దూరం..

- నేరస్తులతో దోస్తీ.. పలు కేసుల్లో నిందితుడు

హైదరాబాద్: పన్నెండేళ్ల కుమారుడు సిగరెట్‌(Cigarette) తాగుతున్నాడన్న విషయం తెలిసిన తండ్రి మందలించడంతో ఆ ఇంటిని విడిచి వెళ్లిన ఓ కుర్రాడు మరో పన్నెండేళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు చేరాడు. ఈ క్రమంలో ఎన్నో చెడుసావాసాలు చేశాడు. పలు నేరాల్లో నిందితుడిగా మారాడు. తప్పించుకు తిరుగుతున్న అతన్ని పోలీసులు పట్టుకుని పుట్టుపూర్వోత్తరాలు రాబట్టడంతో అసలు విషయం తెలిసింది. దీంతో అతని తల్లిదండ్రులకు సమాచారం చేరవేసి వారి చెంతకు చేర్చారు.

ఇదికూడా చదవండి: Hyderabad: పాత నాణేలు, కరెన్సీ సేకరణ అతని హాబీ...


డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్‌(DCP Sadhana Rashmi Perumal) బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. జార్ఖండ్‌ రాష్ట్రం రాంచీ నగరానికి చెందిన చిమన్‌ రావు లచ్చయ్య రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి కాగా, ఆయన భార్య సుందేరా రీనా ఆలం పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. తన కుమారుడు అర్మాన్‌ ఆలం(12) సిగరెట్‌ తాగుతున్నాడని తెలిసిన తండ్రి తాగవద్దని అతన్ని మందలించాడు.


తండ్రికి భయపడిన అర్మాన్‌ రాంచీ నుంచి రైలులో హైదరాబాద్‌కు వచ్చాడు. క్లాక్‌ టవర్‌(Clock tower) వద్ద ఉంటూ కొంతమంది నేరప్రవృత్తి కలిగిన వ్యక్తులతో సావాసం చేశాడు. కుమారుడు కనిపించడం లేదని తల్లిదండ్రులు 2012లో రాంచీలోని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి పలు ప్రాంతాలలో వెతికి కుమారుడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో వారు ఆశలు వదులుకున్నారు. 2019లో నగరంలోని కార్ఖానా పరిధిలో జరిగిన దారిదోపిడీ కేసులో నిందితుడిగా ఉన్న అర్మాన్‌ ఆలంను భాగ్యరాజ్‌ అనే వ్యక్తి షూరిటీ కింద విడిపించాడు.


అప్పటి నుంచి పరారీలో ఉన్న ఇతడు కోర్టుకు హాజరు కాకపోవడంతో పోలీసులు అర్మాన్‌ ఆలంకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. రాంచీలో ఉన్న మిస్సింగ్‌ కేసులను పరిశీలించగా 12 సంవత్సరాల క్రితం కేసు నమోదు అయినట్లు పోలీసులు గుర్తించి వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. 12 ఏళ్ల తర్వాత కుమారుడి ఆచూకీ తెలియడంతో బుధవారం నగరానికి చేరుకున్న తల్లి కుమారుడిని చేరదీసింది.ఆ తల్లి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 15 , 2024 | 10:44 AM

Advertising
Advertising
<