ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: పేరుకే అంబులెన్స్‌లు.. చేసేది ప్రయాణికుల రవాణా

ABN, Publish Date - Jul 27 , 2024 | 11:30 AM

అంబులెన్స్‌(Ambulance)ల ముసుగులో పలువురు డ్రైవర్లు రవాణా దందా సాగిస్తున్నారు. అత్యవసర రోగులకు వినియోగించాల్సిన వీటిని సాధారణ ప్రయాణికులకు వినియోగిస్తూ జేబులు నింపుకొంటున్నారు. అంతేకాకుండా ట్రాఫిక్‌ ఆటంకాలు లేకుండా నిబంధనలను తుంగలో తొక్కుతూ.. సైరన్‌లను వినియోగిస్తూ రాంగ్‌రూట్‌లో వెళుతున్నారు.

- కనిపించకుండా అద్దాలకు బ్లాక్‌ఫిల్మ్‌ల వినియోగం

- అడ్డదారుల్లో కొందరి నిర్వాకం

- రోగులు లేకున్నా సైరన్ల మోత

- లైసెన్సు లేని డ్రైవర్లు, పర్మిట్లు లేని వాహనాలతో దందా

- వారం రోజుల్లో 31 వాహనాలపై కేసులు, జరిమానాలు

అంబులెన్స్‌(Ambulance)ల ముసుగులో పలువురు డ్రైవర్లు రవాణా దందా సాగిస్తున్నారు. అత్యవసర రోగులకు వినియోగించాల్సిన వీటిని సాధారణ ప్రయాణికులకు వినియోగిస్తూ జేబులు నింపుకొంటున్నారు. అంతేకాకుండా ట్రాఫిక్‌ ఆటంకాలు లేకుండా నిబంధనలను తుంగలో తొక్కుతూ.. సైరన్‌లను వినియోగిస్తూ రాంగ్‌రూట్‌లో వెళుతున్నారు. అటు వాహనదారులను, ఇటు ట్రాఫిక్‌ పోలీసులను బురిడీకొట్టిస్తున్నారు. వీటిపై అధికారులు పెద్దగా దృష్టి సారించకపోవడంతో డ్రైవర్ల ఇష్టారాజ్యంగా మారుతున్నది.

హైదరాబాద్: అత్యవసర సమయాల్లో రోగులను ఆస్పత్రులకు చేర్చి ప్రాణాలు కాపాడే అంబులెన్స్‌లు దారితప్పుతున్నాయి. డ్రైవర్లు వాటి నిర్వాహకులు అంబులెన్స్‌ల ముసుగులో దందాలు చేస్తున్నారు. కేవలం రోగులకు అత్యవసర (ఎమర్జెన్సీ) సమయంలో దారి వదిలేలా వినియోగించాల్సిన సైరన్‌ను సైతం దుర్వినియోగపరుస్తున్నారు. వాహనాల్లో ఎమర్జెన్సీ రోగులు లేకున్నప్పటికీ రాంగ్‌రూట్లో వేగంగా వెళుతూ ట్రాఫిక్‌కు ఆటంకాలు కలిగిస్తున్నారు. అంబులెన్స్‌ నిర్వాహకులు కొందరు తమ వాహనాలకు బ్లాక్‌ఫిల్మ్‌లను వినియోగిస్తూ నిబంధనలను విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.

ఇదికూడా చదవండి: JNTU: జేఎన్‏టీయూలో ఈవెనింగ్‌ బీటెక్‌..


నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..

- అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంబులెన్స్‌లు సైరన్‌లను వినియోగించాలి

- సైరన్‌ వేయాలంటే ముందస్తుగా ఆ స్టేషన్‌ పరిధిలో పోలీసులకు తెలియజేయాలి. అపుడే వారు గ్రీన్‌ సిగ్నల్‌ ద్వారా ట్రాఫిక్‌ను క్లియర్‌ చేసి అంబులెన్స్‌ సాఫీగా వెళ్లేందుకు సహకరిస్తారు.

- అంబులెన్స్‌లలో ఆక్సిజన్‌ సౌకర్యం ఉండాలి.

- ఒక నర్సుతో పాటు అనుభవం ఉన్న వైద్యుడు ఉండాలి.

- వాహనం పూర్తి ఫిట్‌నెస్‌ కలిగి ఉండాలి.

- ఆర్టీఏ పర్మిట్‌ ఉండాలి.


- లైసెన్స్‌తో కూడిన నిపుణులైన డ్రైవర్లు ఉండాలి చేయకూడనివి ..

- అంబులెన్స్‌లో మృతదేహాలను తరలించేపుడు, రోగులను పరీక్షలకు తీసుకెళ్లేపుడు సైరన్‌ వేయకూడదు.

- అద్దాలకు బ్లాక్‌ ఫిల్మ్‌ వాడకూడదు.

- రాంగ్‌రూట్‌లో వెళ్లకూడదు.

- ప్రయాణికులను తరలించకూడదు.

- ఆస్పత్రులకు సంబంధించిన సేవలకు మాత్రమే వినియోగించాలి.


31 అంబులెన్స్‌లను గుర్తించాం..

బోయిన్‌పల్లి మీదుగా నగరం లోపలికి ప్రవేశించే పలు జిల్లాల అంబులెన్స్‌లపై వారం రోజులుగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాం. 31కి పైగా నకిలీ అంబులెన్స్‌లను గుర్తించాం. ఇందులో 5 అంబులెన్స్‌లకు ఎలాంటి పర్మిట్‌ లేదు. వాహనానికి బ్లాక్‌ ఫిలిం ఉండడంతో పాటు డ్రైవర్లకు లైసెన్స్‌లు సైతం లేవు. ఆర్‌టీఏ నిబంధనలు, ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకుండా నడిపిస్తున్న వాహనాలను సీజ్‌ చేశాం. ఎంవీ యాక్ట్‌ ప్రకారం చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశాం. సైరన్‌ను దుర్వినియోగం చేసిన కొందరికి, బ్లాక్‌ ఫిల్మ్‌ వేసుకుని ఉన్న మరికొందరికి, రాంగ్‌రూట్లలో వెళుతున్న మరి కొన్ని అంబులెన్స్‌ల డ్రైవర్లకు కౌన్సెలింగ్‌ ఇచ్చి, జరిమానాలు విధించాం. మరికొందరిపైన కేసులు నమోదు చేశాం. ఆర్‌టీఏ పర్మిట్‌ లేకుండా అంబులెన్స్‌ పేరుతో ప్రయాణికులను తరలిస్తున్న ఆదిలాబాద్‌కు చెందిన ఓ వాహనాన్ని సీజ్‌ చేశాం.

- నాగయ్య, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌, బోయిన్‌పల్లి

Updated Date - Jul 27 , 2024 | 11:30 AM

Advertising
Advertising
<