Hyderabad: ఎయిర్ పోర్టులకు దీటుగా అమృత్ భారత్ స్టేషన్లు..
ABN, Publish Date - Sep 05 , 2024 | 12:09 PM
అమృత్ భారత్ ప్రాజెక్టుల ద్వారా రైల్వేస్టేషన్లను ఎయిర్‌పోర్టులకు దీటుగా అభివృద్ధి చేస్తున్నట్లు రైల్వే సహాయ మంత్రి సోమన్న(Minister Somanna) తెలిపారు.
- రైల్వే సహాయమంత్రి సోమన్న
- ఉందానగర్ స్టేషన్లో ప్రాజెక్టు పనుల పరిశీలన
హైదరాబాద్ సిటీ: అమృత్ భారత్ ప్రాజెక్టుల ద్వారా రైల్వేస్టేషన్లను ఎయిర్‌పోర్టులకు దీటుగా అభివృద్ధి చేస్తున్నట్లు రైల్వే సహాయ మంత్రి సోమన్న(Minister Somanna) తెలిపారు. బుధవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్(Secunderabad Railway Station) నుంచి ప్రత్యేక రైల్లో కాచిగూడ యాకత్‌పురా, ఉప్పుగూడ మీదుగా ఉందానగర్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న మంత్రి సోమన్న.. అక్కడ అమృత్ భారత్ ప్రాజెక్టు ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బాసర, నిజామాబాద్, మల్కాజిగిరి,
ఇదికూడా చదవండి: MLA Kaushik Reddy: నా ఫోన్ ప్రభుత్వం ట్యాప్ చేస్తోంది: కౌశిక్ రెడ్డి
యాకత్‌పుర(Basara, Nizamabad, Malkajigiri, Yakatpura), ఉప్పుగూడ, ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్లను అమృత్ భారత్ ప్రాజెక్టు ద్వారా పూర్తిగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే అమృత్ భారత్ స్టేషన్ల లక్ష్యమన్నారు. ఆయా స్టేషన్లలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి సోమన్న శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి, అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లిపోయారు. రైల్వే మంత్రి వెంట దక్షిణమధ్యరైల్వే ఏజీఎం నీరజ్ అగర్వాల్, హైదరాబాద్ డీఆర్‌ఎం లోకేష్ వైష్ణవ్ తదితరులున్నారు.
...............................................................................
ఈ వార్తను కూడా చదవండి:
...............................................................................
Cyber criminals: ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్‌తో అధిక లాభాలంటా..
- రూ. 11.30 లక్షలకు టోకరా
హైదరాబాద్ సిటీ: ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్(Online Investment)తో అధిక లాభాలు వస్తాయంటూ.. సైబర్ నేరగాళ్లు(Cyber criminals) నగరానికి చెందిన మహిళ నుంచి రూ.11.30లక్షలు దోచేశారు. బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 43 ఏళ్ల మహిళ ఫేస్‌బుక్‌లో ఓ ప్రకటనను చూసింది. అందులో ఉన్న వాట్సాప్ నంబర్‌లో చాటింగ్ చేసింది. వెంటనే లైన్‌లోకి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను ‘జీ5 బ్లాక్ రాక్ బిజినెస్ స్కూల్’ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూపులో యాడ్ చేశారు. మీరు బ్లాక్ రాక్ బిజినెస్ స్కూల్ గ్రూపులో ఇన్వెస్టిమెంట్ చేస్తే అధిక మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించారు. దాంతో ఆమె ప్రారంభంలో కొద్దిమొత్తంలో పెట్టుబడులు పెట్టి అధిక మొత్తంలో లాభాలు అందుకుంది.
ఈ క్రమంలో ఆమెను మరో వాట్సాప్ గ్రూపు ‘జీ5 వీఐపీ గ్రూపు926’లో యాడ్ చేశారు. ఆమెకు ఒక లింక్‌ను వాట్సాప్ ద్వారా పంపారు. అందులో లాగిన్ అయి ఆమె పెట్టుబడి పెట్టగా వచ్చిన లాభాలను విత్‌డ్రా చేసుకుంది. అలా మూడో దఫా రూ. 11.30లక్షలు పెట్టుబడి పెట్టింది. వెంటనే సైబర్ నేరగాళ్లు విత్‌డ్రా ఆప్షన్ క్లోజ్ చేశారు. ఎవరూ స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు బుధవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read Latest Telangana News and National News
Updated Date - Sep 05 , 2024 | 12:09 PM