Hyderabad: కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలి
ABN, Publish Date - Nov 13 , 2024 | 07:28 AM
మాజీ సీఎం కేసీఆర్(KCR) హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని తెలంగాణ రక్షణ సమితి (టీఆర్‌ఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు నరాల సత్యనారాయణ(Nerve Satyanarayana) డిమాండ్ చేశారు.
- టీఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సత్యనారాయణ
హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్(KCR) హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని తెలంగాణ రక్షణ సమితి (టీఆర్‌ఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు నరాల సత్యనారాయణ(Nerve Satyanarayana) డిమాండ్ చేశారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను లోటు బడ్జెట్‌గా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని, పదేళ్ల పాలనలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: అపరిశుభ్రత.. కృత్రిమ రంగులు
కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project), విద్యుత్ ఒప్పందం, భూబదలాయింపులో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఫోన్‌ట్యాపింగ్ కేసు, కవిత మద్యం స్కామ్, దళిత బంధులో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కేసీఆర్ అవినీతి, అక్రమాలను ప్రజలకు తెలియజేయడానికి డిసెంబర్ 6న భద్రాచలం నుంచి మహాపాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు.
చిలుకూరు బాలాజీ టెంపుల్(Chilkur Balaji Temple) వద్ద ఈ పాదయాత్ర ముగుస్తుందని, 33 జిల్లాల గుండా ఈ పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మంజూష, సురేఖ, లక్ష్మి, కె. శారద, రేఖ, లావణ్య, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: ‘లగచర్ల' దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం
ఈవార్తను కూడా చదవండి: హనుమకొండ ఆస్పత్రిలో ఎలుకల స్వైరవిహారం
ఈవార్తను కూడా చదవండి: ఫిలింనగర్‌లో యువతి ఆత్మహత్య
ఈవార్తను కూడా చదవండి: ఇదేనా నీ పాలన.. రేవంత్‌పై హరీష్ కామెంట్స్
Read Latest Telangana News and National News
Updated Date - Nov 13 , 2024 | 07:28 AM