Hyderabad: తెగిన చేతిని అతికించిన అపోలో వైద్యులు
ABN, Publish Date - Nov 07 , 2024 | 09:03 AM
ఓ ప్రమాదంలో తెగిపోయిన యువకుడి చేతిని అతికించారు అపోలో వైద్యులు(Apollo Doctors). మైక్రోవాస్కులర్ రీప్లాంటేషన్ శస్త్రచికిత్స చేసి చేతిని అతికించి పూర్వస్థితికి తీసుకొచ్చారు. ఈ తరహా పెద్ద ప్రాక్సిమల్ లింబ్ రీఅటాచ్‌మెంట్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారి అని వైద్యులు తెలిపారు.
- ఈ తరహా శస్త్రచికిత్స తెలుగు రాష్ట్రాల్లో మొదటిది
హైదరాబాద్ సిటీ: ఓ ప్రమాదంలో తెగిపోయిన యువకుడి చేతిని అతికించారు అపోలో వైద్యులు(Apollo Doctors). మైక్రోవాస్కులర్ రీప్లాంటేషన్ శస్త్రచికిత్స చేసి చేతిని అతికించి పూర్వస్థితికి తీసుకొచ్చారు. ఈ తరహా పెద్ద ప్రాక్సిమల్ లింబ్ రీఅటాచ్‌మెంట్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారి అని వైద్యులు తెలిపారు. బుధవారం అపోలో ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ జీఎన్ బండారి(Dr. GN Bandari) సర్జరీ వివరాలు వివరించారు.
ఈ వార్తను కూడా చదవండి: Cyber criminals: స్టాక్ మార్కెట్ టిప్స్ చెప్తానని రూ.16.25లక్షలు కొట్టేశారు..
మంచిర్యాలకు చెందిన ఏ. పవన్‌కుమార్(32) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా డీసీఎం డోర్ కుడిచేయి కంకణానికి తగలడంతో చేయి మోచేతి వరకు తెగిపోయింది. తెగిన చేతిని ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి పవన్‌కుమార్‌ను తీసుకొని బంధువులు అపోలో ఆస్పత్రి(Apollo Hospital)కి గతనెల 11వ తేదీన వచ్చారు. వైద్యులు 8 గంటల పాటు శస్త్రచికిత్స చేసి విరిగిన చేతిని విజయవంతంగా అతికించారని బండారి వివరించారు.
ఈ సందర్భంగా పేషెంట్ పవన్‌కుమార్ మాట్లాడుతూ.. విరిగిపోయిన చేతిని అపోలో ఆస్పత్రి వైద్యులు అతికించడంతో సంతోషంగా ఉన్నాను. త్వరలో కోలుకుంటానన్న నమ్మకం కలిగిందన్నాడు. సమావేశంలో ఆస్పత్రి సీఈవో తేజస్విరావు, మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్‌బాబు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: యాదగిరిగుట్ట ఆలయంలో కుంగిన ఫ్లోరింగ్!
ఈవార్తను కూడా చదవండి: కేశవాపురం వద్దు.. మేఘా కాంట్రాక్టు రద్దు
ఈవార్తను కూడా చదవండి: అరుణాచల ప్రదక్షిణకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ఈవార్తను కూడా చదవండి: తీన్మార్ మల్లన్నకు స్ట్రాంగ్ వార్నింగ్
Read Latest Telangana News and National News
Updated Date - Nov 07 , 2024 | 09:03 AM