Hyderabad: గోల్డ్ స్కీమ్‌లో చేరాలని ఫోన్లు వస్తున్నాయా.. అయితే..
ABN, Publish Date - Nov 06 , 2024 | 08:15 AM
హలో అమూల్య గారు.. నా పేరు శ్రీరమ్య... మేము గోల్డ్ షోరూం(Gold Showroom) నుంచి కాల్ చేస్తున్నాం. ధన్‌తేరాస్ రోజున గోల్డ్ కొనడానికి వచ్చినప్పడు మీరు నంబర్ ఇచ్చారు గుర్తుంది కదా.. ఆ.. అంటూ అవతలి నుంచి సమాధానం రావడంతో గోల్డ్ స్కీం గురించి ఒకసారి మా షోరూంకు వస్తారా అంటూ కాస్త నెమ్మదిగా మాట్లాడింది.
- అన్ని అంశాలు తెలుసుకొని చేరండి
- పండుగ ఆఫర్లు స్కీమ్స్ కట్టే వారికి వర్తించవు
- మధ్యలో ఆపేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ
- కూకట్‌పల్లి పరిసర ప్రాంతవాసులకు ఫోన్లు
హైదరాబాద్: హలో అమూల్య గారు.. నా పేరు శ్రీరమ్య... మేము గోల్డ్ షోరూం(Gold Showroom) నుంచి కాల్ చేస్తున్నాం. ధన్‌తేరాస్ రోజున గోల్డ్ కొనడానికి వచ్చినప్పడు మీరు నంబర్ ఇచ్చారు గుర్తుంది కదా.. ఆ.. అంటూ అవతలి నుంచి సమాధానం రావడంతో గోల్డ్ స్కీం గురించి ఒకసారి మా షోరూంకు వస్తారా అంటూ కాస్త నెమ్మదిగా మాట్లాడింది.
హలో సార్ నాపేరు శ్రీలేఖ నేను గోల్డ్ షాపు నుంచి ఫోన్ చేస్తున్నా.. మాట్లాడుతుంది నాగార్జున గారే కదా.. ఆ... చెప్పండి మేడం అనడంతో.. ధన్‌తేరాస్ రోజున మేడంకు బంగారు నగలు కొనడానికి మా షాప్‌కొచ్చి ఏమీ కొనకుండానే వెళ్లిపోయారు. మీకు తక్కువ ధరలో గోల్డ్ కొనుగోలు చేసేందుకు మా వద్ద స్కీమ్స్ ఉన్నాయి. మీరు వస్తారా? మమ్మల్ని రమ్మంటారా.. అంటూ ఫోన్ చేసింది.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: నగరంలో.. నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలివే..
పైన పేర్కొన్న రెండు ఉదాహారణల్లో సారాంశం ఒక్కటే గోల్క్ స్కీమ్స్‌లో చేర్పించేందుకు కూకట్‌పల్లిలోని పలు నగల దుకాణాలకు చెందిన ఉద్యోగులు వరుసగా కస్టమర్లకు కాల్స్ చేస్తున్నారు. ఎలాగైనా పసిడి అమ్మడమే లక్ష్యంగా పెట్టుకొని ఉద్యోగులకు ఆయా దుకాణాల నిర్వాహకులు, మేనేజర్లు టార్గెట్లు నిర్దేశించారట. దీంతో రోజుకు కనీసం ఒక్కో ఉద్యోగి 15 నుంచి 20 మందికి ఫోన్‌చేసి గోల్డ్ స్కీమ్స్ గురించి మాట్లాడుతున్నామని ఓ దుకాణంలో పనిచేసే ఉద్యోగి తెలిపారు.
మర్యాదలకు మురిసిపోవద్దు..
పసిడి ధరలు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో కొనడానికి కాస్త వెనకడుగు వేస్తున్నారు కొనుగోలు దారులు. కానీ మహిళలకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని బంగారు నగలు అమ్మేందుకు ఉద్యోగుల చేత ఫోన్లు చేయించి దుకాణాలకు రప్పిస్తున్నారు. ఇటీవల ధన్‌తేరా్‌స రోజున అమ్మకాలు అంతంత మాత్రంగానే సాగడంతో గోల్డ్ స్కీమ్స్‌పై దృష్టిసారించారు. రెండు రోజులుగా కార్తీక మాసం, మహిళల సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునే పనిలో దుకాణాల నిర్వాహకులు నిమగ్నమయ్యారు.
ఈనెల అంతా శుభం అంటూ ఆయా దుకాణాలకు వచ్చే వారికి మినరల్ మంచినీళ్ల బాటిల్స్, టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్ ఇస్తూ మచ్చిక చేసుకొని గోల్డ్ తమ షోరూంలోనే కొనుగోలు చేసేలా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గోల్డ్ స్కీమ్స్ కు చట్టబద్ధత ఏమీ లేదు. నగలు కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్ అనే పదాన్ని ప్రస్తుతం గోల్డ్ స్కీమ్స్‌గా చెలామణి చేస్తున్నారు. పెద్దపెద్ద దుకాణాలైతే ఓకే... చిన్నపాటి, ఊరు, పేరు తెలియని వారి దగ్గర స్కీమ్స్ కడితే వారి దుకాణం ఎత్తేస్తే పరిస్థితి ఏంటి? ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఆయా షోరూమ్స్‌లో రాచమర్యాదలను చూసి స్కీమ్స్‌లో చేరవద్దని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
కట్టే ముందే ఇవి చూసుకోండి..
గోల్డ్ స్కీమ్స్ అన్నీ దాదాపు 10, 11 నెలల పాటు నెలకు రూ. 5 వేలు కడితే మరోనెల చెల్లించాల్సిన డబ్బును జమ చేసి రూ. 50,000 లేదా రూ. 55,000 వేలకు బంగారు నగలు కొనుగోలు చేయొచ్చు. ఇక్కడ కూడా 10, 11 నెలల పాటు ఉంటున్నా ఆ నెలలో ఏ రోజు చెల్లిస్తే ఆరోజు రూ. 5 వేలకు ఎంత బంగారం వస్తే అంత జమచేస్తారు. దీనివల్ల బంగారం పెరిగినా, తగ్గినా కస్టమర్‌కు భారం ఉండదు.
ఒక్కో షోరూంలో ఒక్కోలా మీరు నెలనెలా కట్టే డబ్బులకు ఎలాంటి బోనస్ లేకుండా బంగారు ఆభరణాలు కొనేటప్పుడు తరుగు, మజూరీ ఉండదు. ఇప్పుడు చాలా దుకాణాల్లో 2 నుంచి 13 శాతం మధ్యలోనే తరుగు చార్జ్ చేస్తున్నారు. కొన్ని డిజైన్లు ఉండే షోరూమ్స్‌లో మాత్రం 33శాతం వరకు తరుగు ఉంటుంది. మీరు ఏం కొనాలో నిర్ణయించుకున్న తర్వాత మీకు నచ్చిన నగలు దొరికేచోట కడితేనే ప్రయోజనం.
పెద్దపెద్ద బంగారు షోరూమ్స్‌తో పాటు కేపీహెచ్‌బీ కాలనీ(KPHB Colony) గల్లీల్లో ఉండే దుకాణాల్లో కూడా గోల్డ్ స్కీమ్స్ రన్ చేస్తున్నారు. పండుగలు, అక్షయ తృతీయ, ధన్‌తేరా్‌స, ఆయా షోరూమ్స్ వార్షికోత్సవ వేడుకల సమయంలో ఇచ్చే ఆఫర్లు స్కీమ్స్ ద్వారా వచ్చే వారికి వర్తించవు. మీరు ఎక్కడైతే స్కీమ్ కడతారో అక్కడే నగలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
గోల్క్ స్కీం కట్టేముందు అన్నీ నెలల పాటు కట్టి వెంటనే నెలరోజుల్లోనే నగలను కొనుగోలు చేయాలి. లేదంటే ఎటువంటి బోనస్ లేకుండా మీ అసలు సొమ్మునే మీ బ్యాంక్ అకౌంట్‌కు జమచేస్తారు. కొన్ని దుకాణాల నిర్వాహకులు మాత్రం మేము డబ్బులు ఇవ్వం మీరు నగలే కొనుగోలు చేయాలని కండీషన్ పెడుతున్నారు.
అనివార్య కారణాలవల్ల మధ్యలో స్కీమ్‌కు డబ్బులు కట్టడం ఆపేస్తే ఎటువంటి ప్రయోజనాలు లేకుండా అదే దుకాణంలో నగలు కొనుగోలు చేయాలి. కొన్నింటిలో మాత్రం కనీసం 7 నెలల పాటు కడితే తరుగులో కొంత రాయితీ ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా స్కీమ్ మధ్యలో ఆపేస్తే డబ్బులు మాత్రం ఇవ్వరు. ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసువాలి.
ఈవార్తను కూడా చదవండి: అయ్యోపాపం. ఎంతఘోరం.. పాఠశాల గేటు పడి విద్యార్థి దుర్మరణం
ఈవార్తను కూడా చదవండి: తెలంగాణలో కులగణన.. దేశానికి నమూనా
ఈవార్తను కూడా చదవండి: Medical Student: అయ్యా.. నాది ఏ రాష్ట్రం?
ఈవార్తను కూడా చదవండి: Uttam: కేంద్ర నిబంధనల మేరకే ధాన్యం కొనుగోళ్లు!
Read Latest Telangana News and National News
Updated Date - Nov 06 , 2024 | 08:15 AM