Hyderabad: బాటిల్ నీళ్లా.. జరదేఖో..
ABN, Publish Date - Nov 15 , 2024 | 06:56 AM
వాటర్‌బాటిల్(Water bottle) నీళ్లు శ్రేయస్కరమని తాగుతున్నారా..? జరజాగ్రత్త. మీరు కొనుగోలు చేసిన వాటర్‌బాటిల్‌ను ఒకసారి నిశితంగా పరిశీలించండి. అసలు కంపెనీ వాటరా ? లేదా గమనించండి. ప్రముఖ కంపెనీలను పోలిన లేబుళ్లతో తయారు చేసిన బాటిళ్లలో ప్రమాణాల ప్రకారం లేని తాగునీటిని విక్రయిస్తూ ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టివేస్తున్నారు.
- ప్రముఖ కంపెనీలను పోలిన వాటర్‌బాటిళ్ల తయారీ
- పీహెచ్, టీడీఎస్ లేని నీళ్లు నింపి విక్రయం
- గ్రేటర్‌లో జోరుగా తాగునీరు కల్తీ
హైదరాబాద్: వాటర్‌బాటిల్(Water bottle) నీళ్లు శ్రేయస్కరమని తాగుతున్నారా..? జరజాగ్రత్త. మీరు కొనుగోలు చేసిన వాటర్‌బాటిల్‌ను ఒకసారి నిశితంగా పరిశీలించండి. అసలు కంపెనీ వాటరా ? లేదా గమనించండి. ప్రముఖ కంపెనీలను పోలిన లేబుళ్లతో తయారు చేసిన బాటిళ్లలో ప్రమాణాల ప్రకారం లేని తాగునీటిని విక్రయిస్తూ ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టివేస్తున్నారు. కాచిగూడ(Kachiguda) నింబోలిఅడ్డాలో ఐదేళ్లుగా సాగుతున్న ఈ అక్రమ వ్యాపారం గుట్టును జీహెచ్‌ఎంసీ, ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ బృందం(GHMC, East Zone Task Force Team) రట్టు చేసింది.
ఈ వార్తను కూడా చదవండి: 20 నుంచి కాళేశ్వరంపై విచారణ పునఃప్రారంభం
గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అధికారులు నకిలీబాటిళ్లను స్వాధీనం చేసుకొని, ప్లాంట్‌ను సీజ్ చేశారు. నింబోలిఅడ్డాలో షేక్‌ఉమర్ అనే వ్యక్తి వాటర్ బాటిళ్ల తయారీ ప్లాంట్ నిర్వహిస్తున్నాడు. ప్రముఖ నీటి విక్రయ కంపెనీలు బిస్లరీ, కిన్లీ, నేచర్స్ ప్యూర్‌లను పోలిన తరహాలో లేబుళ్లు తయారు చేసి కొంచెం రంగు మార్చి అదే పేరులో తయారుచేసిన లేబుళ్లను బాటిళ్లకు అంటిస్తున్నాడు. వాటిలో పీహెచ్, టోటల్ డిసాల్వ్‌డ్ సాలిడ్స్ (టీడీఎస్) నిర్ణీత స్థాయిలో లేకుండా నీటిని నింపుతున్నారు. నకిలీ వాటర్‌బాటిళ్లను నగరంలోని బార్ అండ్ రెస్టారెంట్లు, హోటళ్లు, వైన్‌షాపుల వద్ద పర్మిట్ రూంలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు సరఫరా చేస్తున్నాడు.
విశ్వసనీయ సమాచారం మేరకు ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ సబ్‌ఇన్‌స్పెక్టర్ కరుణాకర్‌రెడ్డి, పుడ్‌సేఫ్టీ అధికారి స్వాతి, సిబ్బందితో కలిసి వాటర్‌ప్లాంట్‌ను తనిఖీ చేశారు. బ్రిశ్లెరి లీటర్ బాటిళ్లు 5400, బ్రిశ్లెరి అరలీటర్ బాటిళ్లు 6108, కిల్వీ లీటరు బాటిళ్లు 6480, నేచర్స్ ప్యూర్ అరలీటరు బాటిళ్లు 108 స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.3.85 లక్షలని, నీటి నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం స్టేట్ లేబోరేటకి పంపామని అధికారులు తెలిపారు. ప్లాంట్‌నూ సీజ్ చేశారు.
ఈవార్తను కూడా చదవండి: కేసు పెట్టాల్సింది.. సీఎం బ్రదర్స్‌పైనే
ఈవార్తను కూడా చదవండి: మాజీ మంత్రి మల్లారెడ్డి మోసం చేశారు
ఈవార్తను కూడా చదవండి: 14 రకాల వివరాలివ్వండి..
ఈవార్తను కూడా చదవండి: ‘లగచర్ల’పై ఉన్నత స్థాయి విచారణ
Read Latest Telangana News and National News
Updated Date - Nov 15 , 2024 | 06:56 AM