Hyderabad: డాన్‌గా ఎదగాలనే తుపాకీ కొన్నా..
ABN, Publish Date - Aug 31 , 2024 | 09:58 AM
గాజులరామారం(Gajularamaram)లోని ఓ బార్ వద్ద జరిగిన కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడు మల్లంపేట నరేశ్(Mallampet Naresh)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో సహా 15 మందిని కటకటాల్లోకి నెట్టారు.
- గాజులరామారం కాల్పుల నిందితుడు నరేశ్ ఒప్పుకోలు
- ఆయనతోసహా 15 మంది అరెస్ట్, రిమాండ్
హైదరాబాద్: గాజులరామారం(Gajularamaram)లోని ఓ బార్ వద్ద జరిగిన కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడు మల్లంపేట నరేశ్(Mallampet Naresh)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో సహా 15 మందిని కటకటాల్లోకి నెట్టారు. వారి నుంచి నాటు తుపాకీ, 87 బుల్లెట్లు, తల్వార్‌ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం దీనికి సంబంధించిన వివరాలను డీసీపీ కోటిరెడ్డి(DCP Kotireddy) వెల్లడించారు. ఈనెల 27న అర్ధరాత్రి చేబ్రోలు పూర్ణిమ (35), అజయ్‌చంద్ర, గౌతమ్ బైక్‌పై మల్లంపేట నుంచి గాజులరామారం వస్తుండగా ఎల్‌ఎన్ బార్ వద్ద వీరి వాహనంలో పెట్రోల్ అయిపోయింది. బార్ వద్ద వాహనాల్లో పెట్రోలు తీస్తుండగా సిబ్బంది వారించారు. దీంతో ఘర్షణ పెరగగా, పూర్ణిమ నరేష్, శివలకు ఫోన్ చేసి త్వరగా రావాలని కోరింది.
ఈ వార్తను కూడా చదవండి: Collector: ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం 32 ఎకరాల్లో..
దీంతో నరేశ్ తన గ్యాంగ్‌తో కలిసి బార్ వద్దకు వచ్చి నానా హంగామా చేశారు. ఆవేశంలో నరేశ్ తన వద్ద ఉన్న తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. అనంతరం పారిపోగా పోలీసులు గాలించి ప్రధాన నిందితుడు నరేశ్‌తోపాటు శివ, సోహెల్, శ్యాంసన్, నరేందర్, ఉజ్వల్ సహా 15 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డాన్‌గా ఎదగాలని, రియల్ వ్యాపారం చేస్తూ అడ్డొచ్చిన వారి భూములు లాక్కోవాలనే ఉద్దేశంతో తుపాకీ కొనుగోలు చేసినట్టు నరేష్ అంగీకరించాడు. ఆయనపై త్వరలో రౌడీషీట్ ఓపెన్ చేసి, పీడీ యాక్టు పెడతామని డీసీపీ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ సత్యనారాయణ, ఏసీపీ హన్మంతరావు, ఎస్‌వోటీ సీఐ శ్యామ్‌సుందర్, జీడిమెట్ల సీఐ మల్లేష్, ఎస్‌ఐ రవికిరణ్ పాల్గొన్నారు.
...............................................................
ఈ వార్తను కూడా చదవండి:
..............................................................
Congress: కాంగ్రెస్ ఖాతాలోకి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్..
- నూతన మేయర్‌గా అమర్‌సింగ్ ఎన్నిక
హైదరాబాద్: నగరశివారు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్(Peerjadiguda Municipal Corporation) కాంగ్రెస్ వశమైంది. నూతన మేయర్‌గా అమర్‌సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కీసర ఆర్డీవో వెంకట ఉపేందర్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ ఎన్నిక నిర్వహించారు. 26 మంది కార్పొరేటర్లకుగాను 21 మంది కాంగ్రెస్‌కు మద్దతివ్వడంతో అమర్‌సింగ్ మేయర్ పీఠం దక్కించుకున్నారు. తాజాగా పీర్జాదిగూడ కార్పొరేషన్‌తో కలిపి మేడ్చల్ నియోజకవర్గంలో మూడు కార్పొరేషన్లు హస్తం ఖాతాలోకి చేరినట్టు అయ్యింది. అనంతరం మేడిపల్లిలోని ఓ కన్వెన్షన్‌లో నూతన మేయర్‌ను కాంగ్రెస్ నేతలు ఘనంగా సన్మానించారు.
కార్పొరేషన్ అభివృద్ధిపై దృష్టి సారిస్తాం
అరాచక, అవినీతి పాలనకు చరమగీతం పాడామని, ఇకపై పీర్జాదిగూడ నగరాభివృద్ధిపై దృష్టి సారిస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి తెలిపారు. మేయర్ అమర్‌సింగ్‌కు సన్మానం సందర్భంగా వారు మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో కార్పొరేషన్ అభివృద్ధికి చర్యలు చేపడుతామని పేర్కొన్నారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read Latest Telangana News and National News
Updated Date - Aug 31 , 2024 | 09:58 AM