ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: సీఐ + అడ్మిన్ ఎస్ఐ.. పైసా వసూల్

ABN, Publish Date - Oct 25 , 2024 | 08:46 AM

‘ఆయన రూల్‌ బుక్‌కే రోల్‌మోడల్‌.. అలాంటి పోలీస్‌ బాస్‌ వద్ద ఎవరి ఆటలూ సాగవు.. అక్రమాలకు పాల్పడే ఇన్‌స్పెక్టర్లకు చుక్కలే..’ ఇదీ.. 11 నెలల క్రితం ఓ ఖరీదైన కమిషనరేట్‌కు ఆయన పోలీస్‌ బాస్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు పోలీస్ వర్గాల్లో జరిగిన చర్చ.

- వివాదాస్పదమవుతున్న కొందరి తీరు

- ఖరీదైన కమిషనరేట్‌లో వసూళ్ల దందా

- ఇద్దరూ మిలాఖత్‌ అయి కేసులకు ఖరీదు

వామ్మో.. లంచమా.. అంటూ పైకి భయం నటిస్తున్న కొందరు ఇన్‌స్పెక్టర్లు(Inspectors) లోపల మాత్రం అక్రమ వసూళ్ల దందా ఇష్టారీతిన కొనసాగిస్తున్నారు. అనూకూలమైన వారిని స్టేషన్‌ అడ్మిన్‌ ఎస్‌ఐగా నియమించుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు. ఖరీదైన కమిషనరేట్‌ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్‌లలో ఇన్‌స్పెక్టర్‌లు, అడ్మిన్‌ ఎస్‌ఐల తీరు వివాదాస్పదంగా మారింది.

హైదరాబాద్‌ సిటీ: ‘ఆయన రూల్‌ బుక్‌కే రోల్‌మోడల్‌.. అలాంటి పోలీస్‌ బాస్‌ వద్ద ఎవరి ఆటలూ సాగవు.. అక్రమాలకు పాల్పడే ఇన్‌స్పెక్టర్లకు చుక్కలే..’ ఇదీ.. 11 నెలల క్రితం ఓ ఖరీదైన కమిషనరేట్‌కు ఆయన పోలీస్‌ బాస్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు పోలీస్ వర్గాల్లో జరిగిన చర్చ. కానీ ప్రస్తుతం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు ఇన్‌స్పెక్టర్లు, అడ్మిన్‌ ఎస్‌ఐలు కలిసి కేసుల తీవ్రత తగ్గించేందుకు కాసుల వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇటీవల శేరిలింగంపల్లి పరిధిలో ఓ కేసులో ఇన్‌స్పెక్టర్‌ రూ. 3 లక్షలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సీపీ విచారణలో నిజమని తేలడంతో ఇన్‌స్పెక్టర్‌పై బదిలీ వేటు వేశారు. ఇలా పట్టుబడని వారు చాలా మందే ఉన్నారని కమిషనరేట్‌ పరిధిలో చర్చ జరుగుతోంది.

ఈ వార్తను కూడా చదవండి: CP CV Anand: ఎమ్మెల్యే అనుచరులకు సీపీ వార్నింగ్.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే..


పోలీస్‌ బాస్‌ అనుచరులమంటూ..

తాము పోలీస్‌ బాస్‌ అనుచరులం అంటూ.. ప్రచారం చేసుకుంటున్న కొందరు ఇన్‌స్పెక్టర్లు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ దండుకుంటున్నారు. డబ్బుల పంపిణీలో మరో ఇన్‌స్పెక్టర్‌తో సిబ్బంది ఎదుటే గొడవపడ్డ ఓ ఇన్‌స్పెక్టర్‌ను సీపీ ఓ పారిశ్రామికవాడలోని పోలీస్ స్టేషన్‌కు ఇటీవల బదిలీ చేశారు. అయితే ఆ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్‌ చేయకుండా తిరిగి పోస్టింగ్‌ ఇవ్వడంపై పోలీసువర్గాల్లో చర్చ జరిగింది. ఆ ఇన్‌స్పెక్టర్‌ పద్ధతి మార్చుకోకుండా అక్రమాల దందాను యథేచ్చగా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.


అడ్మిన్‌ ఎస్‌ఐలతో మిలాఖత్‌

దేశంలోనే అతిపెద్ద కాలనీ పోలీస్ స్టేషన్‌కు ఎస్‌హెచ్‌వోగా విధులు నిర్వహిస్తున్న ఇన్‌స్పెక్టర్‌పైనా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫిర్యాదుదారులతో మాట్లాడటం మొదలు.. కేసుల నిర్వహణ, ఛేదనలో పరిణతి లేనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆయన పనితీరుపై ఆ స్టేషన్‌ సిబ్బంది బాహాటంగానే చర్చించుకుంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి కేసులోనూ కాసుల వేట సాగించే దారులను వెదుకుతారని తెలుస్తోంది. అడ్మిన్‌ ఎస్‌ఐలతో మిలాఖత్‌ అయి కేసులను బట్టి కాసులు దండుకుంటున్నట్లుసమాచారం. స్టేషన్‌లో ఏ కేసు వచ్చినా అడ్మిన్‌ ఎస్సైకి తెలియాల్సిందే. దాంతో ఇన్‌స్పెక్టర్‌, అడ్మిన్‌ ఎస్సై కూడబలుక్కొని కేసు తీవ్రతను బట్టి రేటు కడుతూ అక్రమ దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.


మూడు పువ్వులు.. ఆరు కాయలుగా..

పైన తెలిపిన పోలీస్‌ స్టేషన్‌లలో.. బేరం కుదిరితే కేసును నీరు గార్చడం.. లేకపోతే పెద్ద కేసుగా చిత్రీకరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. క్రైమ్‌ అయినా.. కొట్లాట అయినా.. భూ కబ్జాలైనా.. కుటుంబ తగాదాలైనా కేసును, దాని తీవ్రతను బట్టి రేటు కడతారు. కాసులు చేతిలో పడే వరకు కేసులు ముందుకు కదలవని బాధితులు ఆరోపిస్తున్నారు. అతిపెద్ద కాలనీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అర్ధరాత్రి వరకూ తెరిచి ఉంచే మద్యం, బెల్టు దుకాణాలు, ఇతర వ్యాపార సముదాయాల నుంచి అమ్యామ్యాలు దండిగా దండుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అలాగే, పారిశ్రామికవాడలో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్‌ ఏకంగా నేరస్థులతో దోస్తీ కట్టి కేసులను నీరుగార్చుతున్నట్లు తెలుస్తోంది. పలు పోలీస్ స్టేషన్‌లలో ఎస్‌హెచ్‌వోల అడ్మినిస్ట్రేషన్‌ తీరు విమర్శలకు తావిస్తున్నట్లు సమాచారం. వారి పద్ధతి, విధానం చూసి అదే పోలీస్ స్టేషన్‌లలో పనిచేస్తున్న ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు సైతం విసుగు చెందుతున్నారు.


నేర నియంత్రణ గాలికి

కొంతమంది సెక్టార్‌ ఎస్సైలు సైతం ప్రజా రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణను గాలికొదిలేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీస్‌ స్టేషన్‌లో సిబ్బంది పనితీరు బాగాలేకున్నా.. అక్రమాలకు అడ్డాగా మారుతున్నా.. సిబ్బందిపై పలు ఆరోపణలు వస్తున్నా.. నిఘా (ఎస్‌బీ) అధికారులు వారికి వత్తాసు పలుకుతున్నట్లు తెలిసింది. ఇటీవల వెలుగులోకి వస్తున్న కొంతమంది అక్రమార్కుల తీరుపై ఉన్నతాధికారులకు ఎందుకు రిపోర్టు చేయడంలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి, క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, పలువురు ఇన్‌స్పెక్టర్‌ల పనితీరు, అడ్మిన్‌స్ట్రేషన్‌ విధానం, కేసుల నిర్వహణపై, ఛేదించిన కేసులు, నేరనియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై దృష్టి సారిస్తే అక్రమ ఇన్‌స్పెక్టర్‌ల బండారం బట్టబయలయ్యే అవకాశం ఉంది.


ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: ఉద్యోగులకు రెండు డీఏలు!

ఈవార్తను కూడా చదవండి: KTR: ఒకటి, రెండేళ్లు జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే

ఈవార్తను కూడా చదవండి: రాష్ట్రంలోనే సొంతంగా సీడ్‌ గార్డెన్‌: తుమ్మల

ఈవార్తను కూడా చదవండి: నేడు సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌

Read Latest Telangana News and National News

Updated Date - Oct 25 , 2024 | 08:46 AM