Hyderabad: కాఫీ.. ఒక అనుభవం..
ABN, Publish Date - Sep 12 , 2024 | 10:50 AM
విభిన్న రకాల కాఫీలను రుచి చూపించేందుకు నో స్ట్రింగ్స్ హైదరాబాద్ సంస్థ నగరంలో తొలిసారిగా ఇండియన్ కాఫీ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్(Jubilee Hills Convention Centre) వద్ద సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ఈ ఫెస్టివల్ కొనసాగనుంది.
- రేపటి నుంచి ఇండియన్ కాఫీ ఫెస్టివల్
హైదరాబాద్ సిటీ: విభిన్న రకాల కాఫీలను రుచి చూపించేందుకు నో స్ట్రింగ్స్ హైదరాబాద్ సంస్థ నగరంలో తొలిసారిగా ఇండియన్ కాఫీ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్(Jubilee Hills Convention Centre) వద్ద సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ఈ ఫెస్టివల్ కొనసాగనుంది. కాఫీ.. కేవలం పానీయం కాదు.. ఇది ఒక అనుభవం అంటున్నారు నిర్వాహకులు. ఆసియాలో మొట్టమొదటి కాఫీ కప్పర్‌గా గుర్తింపు పొందిన సునాలినీ మీనన్(Sunalini Menon) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఇదికూడా చదవండి: AV Ranganath: ఆరుగురు అధికారుల వాంగ్మూలాలు నమోదు!
కాఫీ ఫెస్టివల్‌లో జంతు ప్రేమికుల కోసం పిల్లులు, పెంపుడు జంతువుల సంరక్షణ కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కథా కాఫీ, కరాఫా కాఫీ, ట్రూ బ్లాక్ కాఫీ, బిగ్ స్టార్ కేఫ్, కరాబీ కాఫీ, అరకు కాఫీ, ఎంఎస్పి హిల్ రోస్టర్స్, ఫస్ట్ క్రాక్ రోస్టర్స్, ఒడిస్సీ కాఫీలతో సహా భారతదేశంలోని కొన్ని అత్యుత్తమ కాఫీ బ్రాండ్‌లు పాల్గొనబోతున్నాయని ‘నో స్ట్రింగ్స్’ వ్యవస్థాపకుడు శ్రీహరి చావా అన్నారు.
.......................................................................
ఈ వార్తను కూడా చదవండి:
........................................................................
Hyderabad: ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చివేతలా?
- హైడ్రా చర్యలపై సున్నం చెరువు బాధితులు
- జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు
హైదరాబాద్ సిటీ: ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లను కూల్చివేయడం రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కును ఉల్లంఘించినట్లేనని సున్నం చెరువు బాధితులు వాపోతున్నారు. మాదాపూర్(Madapur)లో హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై బాధితులు ఢిల్లీలోని జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. మాదాపూర్ సరోజినినాయుడు నగర్(Madapur Sarojininaidu Nagar)లో దాదాపు 200 మంది పేదలు 15 ఏళ్లుగా గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. గుడిసెల్లో నివసించేవారు తెలంగాణ(Telangana)లోని వివిధ ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం నగరానికి వచ్చినవారే.
ముందస్తు నోటీసులు ఇవ్వకుండా హైడ్రా అధికారులు సెప్టెంబర్ 8న ఆదివారం పోలీసులతో కలిసి కూల్చివేతలు చేపట్టారు. విధులకు అడ్డంకులు కల్పిస్తున్నారని కొంతమంది బాధితులపై కేసులు నమోదు చేశారు. కూల్చివేతల సమయంలో గుడిసెల్లో ఉన్న సామాన్లు, నిత్యావసరాలు, చివరికి పిల్లల పుస్తకాలు తీసుకునే సమయం కూడా హైడ్రా అధికారులు ఇవ్వలేదని ఆరోపించారు. కూల్చివేతల్లో నష్టపోయిన పేదలకు పరిహారం అందించాలని, పునరావాసం కోసం ఏర్పాట్లు చేయాలని, పోలీసులు పెట్టిన కేసులు ఎత్తివేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి:Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి:Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read LatestTelangana NewsandNational News
Updated Date - Sep 12 , 2024 | 10:50 AM