Hyderabad: బంజారాహిల్స్‌లో కూలిన నాలా గోడ
ABN, Publish Date - May 17 , 2024 | 12:04 PM
భారీ వర్షానికి బంజారాహిల్స్ రోడ్‌నెంబర్-11(Banjara Hills Road No-11)లోని ఉదయ్‌నగర్ కాలనీలో నాలా రిటైనింగ్ వాల్ కూలింది. దీంతో పక్కనున్న రోడ్డు కుంగడంతో పాటు.. ఆ రహదారిపై పార్క్ చేసిన వాహనాలు, నాలాకున్న ఫెన్సింగ్.. వరద నీటిలో కొట్టుకుపోయాయి.
- కుంగిన పక్కనే ఉన్న రోడ్డు
- వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన ద్విచక్ర వాహనాలు
- ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపణ
- సందర్శించిన మేయర్, కమిషనర్
హైదరాబాద్ సిటీ: భారీ వర్షానికి బంజారాహిల్స్ రోడ్‌నెంబర్-11(Banjara Hills Road No-11)లోని ఉదయ్‌నగర్ కాలనీలో నాలా రిటైనింగ్ వాల్ కూలింది. దీంతో పక్కనున్న రోడ్డు కుంగడంతో పాటు.. ఆ రహదారిపై పార్క్ చేసిన వాహనాలు, నాలాకున్న ఫెన్సింగ్.. వరద నీటిలో కొట్టుకుపోయాయి. గురువారం సాయంత్రం బంజారాహిల్స్‌లో అత్యధికంగా 8.7 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వరద రావడంతో ఆ తాకిడికి ఉదయ్‌నగర్‌లోని పురాతన రిటైనింగ్ వాల్ కుప్పకూలింది. ఉధృతి ఎక్కువగా ఉండడంతో పక్కనే ఉన్న రోడ్డు కుంగింది. నాలా వెడల్పు తక్కువగా ఉండడం.. భారీగా వరద నీరు రావడంతో గోడపై ఒత్తిడి పెరిగింది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం రాళ్లతో నిర్మించిన గోడ కావడం వల్లే కుప్పకూలిందని అధికారులు చెబుతున్నారు. రిటైనింగ్ వాల్ కూలిన చోట ప్రమాదాలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉదయ్‌నగర్ కాలనీలో రిటైనింగ్ వాల్ అధ్వాన స్థితికి చేరిందని ఫిర్యాదు చేస్తోన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాలాపూడిక తీయకపోవడంతో వరద నీటిమట్టంపెరిగి ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: వర్షం నేపథ్యంలో.. ఐటీ కంపెనీలు షిఫ్ట్‌లు మార్చుకోవాలి
సందర్శించిన మేయర్, కమిషనర్...
ఉదయ్‌నగర్ కాలనీని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రోస్, ఈవీడీఎం డైరెక్టర్ ఎన్.ప్రకా్‌షరెడ్డి సందర్శించారు. మేయర్ స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వరద ఉధృతికి ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రక్షణా చర్యలు చేపట్టడంతోపాటు.. వరదనీరు ఇళ్లలోకి రాకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. వరదతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇదికూడా చదవండి: Secunderabad: కంటోన్మెంట్‌లో క్రాస్ ఓటింగ్ భయం...
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - May 17 , 2024 | 12:04 PM