Hyderabad: వేగంగా ఖైరతాబాద్ గణపతి విగ్రహ తయారీ పనులు..
ABN, Publish Date - Jul 04 , 2024 | 10:36 AM
వైభవంగా జరిగే గణపతి ఉత్సవాలు సమీపిస్తుండడంతో ఖైరతాబాద్ గణపతి(Khairatabad Ganapati) విగ్రహ తయారీ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రతియేటా షెడ్డు నిర్మాణం పూర్తయిన అనంతరమే వెల్డింగ్ పనులు ప్రారంభమయ్యేవి.
- ఈసారి 60 రోజుల్లో పూర్తి
హైదరాబాద్: వైభవంగా జరిగే గణపతి ఉత్సవాలు సమీపిస్తుండడంతో ఖైరతాబాద్ గణపతి(Khairatabad Ganapati) విగ్రహ తయారీ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రతియేటా షెడ్డు నిర్మాణం పూర్తయిన అనంతరమే వెల్డింగ్ పనులు ప్రారంభమయ్యేవి. ఈసారి ఉత్సవ కమిటీ రెండు గ్రూపులుగా ఏర్పడడం, ఎవరికి వారే ఈసారి ఉత్సవాలు జరుపుతామని భీష్మించడంతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Dana Nagender) జోక్యం చేసుకున్నారు. దీంతో ఇరువర్గాల నుంచి 21 మందితో అడ్‌హాక్ కమిటీ వేసి దాని ఆధ్వర్యంలో ఉత్సవాలు జరపాలని నిర్ణయానికి వచ్చారు. ఈ ప్రక్రియ కొంత ఆలస్యం కావడంతో ప్రతియేటా 100 రోజుల పాటు జరిగే విగ్రహ తయారీ పనులు ఈసారి 60 రోజుల్లో పూర్తి చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వినాయక ప్రాంగణానికి 3 రోజుల క్రితమే షెడ్డు కర్రలు రాగా మంగళవారం విగ్రహ తయారీకోసం వాడే స్టీలు వచ్చింది.
ఇదికూడా చదవండి: Hyderabad: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీలు..
సమయం తక్కువగా ఉండడంతో ఓవైపు షెడ్డు పనులతో పాటే మరోవైపు విగ్రహ తయారీ కోసం స్టీలుతో వెల్డింగ్ పనులు ప్రారంభించారు. ఎంతటి భారీ గాలులతో వర్షాలు వచ్చినా తట్టుకునేలా షెడ్డు నిర్మాణాన్ని ఆదిలాబాద్ మంచిర్యాల(Adilabad, Manchryala)కు చెందిన నర్సయ్యతో పాటు 22 మంది నిపుణులు వేస్తున్నారు. దానికోసం వాడే నాటుకర్రలను నర్సాపూర్ నుంచి 3లోడ్‌లను వేర్వేరు పరిమాణంతో తెప్పించారు. వెల్డింగ్ పనులను మచిలీపట్నంకు చెందిన నాగబాబుతోపాటు 14 మంది నిపుణులు నిర్వహిస్తున్నారు. పనులను ఎక్కువ మంది కళాకారులను వినియోగించి చేస్తామని, వినాయకచవితికి ఒకరోజు ముందే పూర్తిస్థాయిలో తయారు చేస్తామని ప్రధాన శిల్పి చినస్వామి రాజేంద్రన్, ఉత్సవ కమిటీ కన్వీనర్ సందీ్‌పరాజ్ తెలిపారు.
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jul 04 , 2024 | 10:36 AM