ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: డేంజర్‌ టర్నింగ్స్‌.. మూలమలుపుల్లో వాహనాలు వెళ్లాలంటే నరకమే

ABN, Publish Date - Oct 22 , 2024 | 10:46 AM

సికింద్రాబాద్‌ నియోజకవర్గం(Secunderabad Constituency)లో సీతాఫల్‌మండి, బౌద్ధనగర్‌ డివిజన్లలో మూడుచోట్ల మూలమలుపుల రోడ్లు అతిప్రమాదకరంగా ఉన్నాయి. సీతాఫల్‌మండి చౌరస్తా, వారాసిగూడ చౌరస్తా, ఆర్ట్స్‌కాలేజీ టర్నింగ్‌ పాయింట్‌ వద్ద ఉన్న మూలమలుపులతో నిత్యం ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

- ప్రమాదకరంగా సీతాఫల్‌మండి, వారాసిగూడ, ఆర్ట్స్‌కాలేజీ వద్ద మలుపులు

సికింద్రాబాద్‌ నుంచి జామై ఉస్మానియాకు వెళ్లే ప్రధాన రహదారిలో టర్నింగ్‌లు డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నాయి. ఈ మూలమలుపులతో నిత్యం ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కనీసం మూలమలుపుల వద్దనైనా రోడ్లను విస్తరించాలని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులను స్థానికులు, ప్రయాణి కులు, వాహనదారులు కోరుతున్నారు.

హైదరాబాద్: సికింద్రాబాద్‌ నియోజకవర్గం(Secunderabad Constituency)లో సీతాఫల్‌మండి, బౌద్ధనగర్‌ డివిజన్లలో మూడుచోట్ల మూలమలుపుల రోడ్లు అతిప్రమాదకరంగా ఉన్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: సైబర్‌ కేటుగాళ్ల చేతిలో మోసపోతున్న అమాయకులు


సీతాఫల్‌మండి చౌరస్తా, వారాసిగూడ చౌరస్తా, ఆర్ట్స్‌కాలేజీ టర్నింగ్‌ పాయింట్‌ వద్ద ఉన్న మూలమలుపులతో నిత్యం ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీంతోపాటు ఎదురెదురుగా వస్తున్న వాహనాలు కనిపించడం లేదని డ్రైవర్లు, వాహనదారులు వాపోతున్నారు. ఉదయం, సాయంత్రం అయితే ఈ మూలమలుపుల వద్ద ట్రాఫిక్‌ రద్దీ భారీగా ఉంటుంది. దీంతోపాటు రోడ్డు ఇరుక్కుగా ఉండటం, ఆటోలు, తదితర వాహనాలను మూలమలుపుల్లో పార్కింగ్‌ చేయటంతో సమస్య మరింత జఠిలంగా ఉంటుంది. దీంతో మూలమలుపుల్లో ఆర్టీసీ బస్సులు నడపాలంటే చాలా ఇబ్బందులు పడాల్సివస్తుందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


రోడ్డును ఆక్రమించి తోపుడుబండ్లు..

వారాసిగూడ చౌరస్తాలోని టర్నింగ్‌లో రోడ్డును ఆక్రమించి పూలబండ్లు, టిఫిన్‌ బండ్లు నిలపడంతో ట్రాఫిక్‌కు విపరీతంగా అంతరాయం కలుగుతోంది. వారాసిగూడ చౌరస్తాలో కౌసర్‌మసీదుకు వెళ్లే రహదారిలో రోడ్డుమీద ఒకపక్క పూలబండి, మరో పక్క ఆటోల పార్కింగ్‌స్థలం ఉండటంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఉంది. ట్రాఫిక్‌ పోలీసులు చాలాసార్లు వీటిని తొలగించాలని కోరినావారు తమ పలుకబడితో ప్రజాపతినిధుల నుంచి ఫోన్‌చేయిస్తున్నారు. వీటితోపాటు వారాసిగూడ చౌరస్తాలో రెండు వైన్స్‌లు ఉన్నాయి. దీంతో వైన్స్‌కు వచ్చేవారు రోడ్లమీదే వాహనాలను నిలుపుతున్నారు. ఉదయం, సాయంత్రం ట్రాఫిక్‌తో నరకం అనుభవిస్తున్నామని స్థానికులు, వాహనదారులు, ప్రయాణికులు వాపోతున్నారు.


ఇష్టారాజ్యంగా ఆటోలు..

వారాసిగూడ చౌరస్తా నుంచి సికింద్రాబాద్‌ స్టేషన్‌(Secunderabad Station) వరకు ప్రతిరోజూ వందలాది సర్వీస్‌ ఆటోలు తిరుగుతుంటాయి. ప్రయాణికులను ఎక్కించుకోవటం కోసం ఆటోడ్రైవర్లు పోటాపోటీగా మూలమలుపుల్లోనే ఆటోలను నిలుపుతూ ఇతర వాహనాదారులను ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ కనీసం ట్రాఫిక్‌ పోలీసులను ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. మూలమలుపుల్లో సర్వీస్‌ ఆటోల నియంత్రణలో ట్రాఫిక్‌ పోలీసులు విఫలమవుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిలకలగూడ ట్రాఫిక్‌ పోలీసులు అప్పుడప్పుడు ఈ ప్రాంతంలో ఆటోడ్రైవర్లను కౌన్సిలింగ్‌ చేస్తున్నా సమస్య మాత్రం ఎప్పటిలాగే ఉంటుంది.


ప్రత్యేక దృష్టి సారించాలి

మూలమలుపులపై ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు ప్రత్యేకదృష్టి సారించాలి. ప్రజలు పలుమార్లు మూలమలుపులను విస్తరించాలని విజ్ఞప్తులు చేసినా, వినతిపత్రం సమర్పించినాపట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇప్పటికైనా మూలమలుపులను విస్తరించాలి.

- వల్లారపు శ్రీనివాసకుమార్‌, టీడీపీ సికింద్రాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి

ఆటోలను నియంత్రించాలి


ఈ మూలమలుపుల్లో ఆటోలను నియంత్రిస్తే కొద్దిగా ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం అవుతుంది. మహిళలు, వృద్ధులు, పిల్లలు, పాదచారులు మూలమలుపుల్లో రోడ్డు దాటాలంటే చాలా అవస్థలు పడుతున్నారు. మూలమలుపుల వద్ద ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించాలి.

- ఆనంద్‌, బౌద్ధనగర్‌

ఈ టర్నింగుల్లో డ్రైవింగ్‌ కష్టమే..


ఈ మూలమలుపుల్లో బస్సులు, పెద్ద వాహనాలు నడపాలంటే కష్టమేనని డ్రైవర్లు వాపోతున్నారు. సీతాఫల్‌మండి చౌరస్తా, వారాసిగూడ చౌరస్తా, ఆర్ట్స్‌కాలేజీ టర్నింగ్‌ పాయింట్లు ఆర్టీసీ డ్రైవర్లకు నరకంగా మారాయి. ఉదయం, సాయంత్రం, రద్దీవేళ్లలో ఈ మూలమలుపుల్లో ఆర్టీసీ బస్సులు ఎదురెదురు పడితే డ్రైవర్లకు యముడే కనిపిస్తాడు. ద్విచక్ర వాహనాదారులు ఈ బస్సుల మధ్య నుంచే వెళ్లుతుంటారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని డ్రైవర్ల ఒత్తిడికి గురవుతున్నారు. ఈ మూలమలుపుల్లో ఆటోలను నిలపటంతో సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. వారాసిగూడ నుంచి ఆర్ట్స్‌కాలేజీ టర్నింగ్‌ పాయింట్‌ వరకు ప్రధాన రహదారిలో ప్రతి శుక్రవారం సాయంత్రం కూరగాయల సంతను నిర్వహిస్తున్నారు. దీంతో కూడా వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. రోడ్డు విస్తరణ చేస్తామని 20 సంవత్సరాల నుంచి పలుమార్లు మార్కింగ్‌ వేసినా అవి అమలులోకి నోచుకోవటం లేదు.


ఇదికూడా చదవండి: Real Estate: ప్రభుత్వ అనుమతులుంటే కూల్చరు!

ఇదికూడా చదవండి: KTR : రేవంత్‌ చెప్పేవి పచ్చి అబద్ధాలు!

ఇదికూడా చదవండి: TGSPDCL: కరెంటు అంతరాయమా.. డయల్‌ 1912

ఇదికూడా చదవండి: Thummala: రుణమాఫీ చేసి తీరుతాం.. ఏ ఒక్క రైతు అధైర్యపడొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 22 , 2024 | 10:46 AM