Hyderabad: చిత్రపురి కాలనీలో విల్లా కూల్చివేత
ABN, Publish Date - Aug 21 , 2024 | 12:26 PM
మణికొండ మున్సిపాలిటీ(Manikonda Municipality) పరిధిలోని చిత్రపురి కాలనీలో అనుమతి లేకుండా నిర్మించిన విల్లాల కూల్చివేత ప్రారంభమైంది. ఒక విల్లాను పాక్షికంగా కూల్చారు.
- అక్రమంగా ఏడు ఇళ్ల నిర్మాణం
- తొలి నుంచి వివాదాస్పదమే
నార్సింగ్(హైదరాబాద్): మణికొండ మున్సిపాలిటీ(Manikonda Municipality) పరిధిలోని చిత్రపురి కాలనీలో అనుమతి లేకుండా నిర్మించిన విల్లాల కూల్చివేత ప్రారంభమైంది. ఒక విల్లాను పాక్షికంగా కూల్చారు. 220 విల్లాల నిర్మాణానికి అనుమతి పొందిన చిత్రపురి హౌసింగ్ సొసైటీ.. ఏడింటిని అదనంగా నిర్మించినట్లు పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై గతంలో కోర్టు కేసు కూడా నడిచింది. అయితే కూల్చివేతల సందర్భంగా చిత్రపురి హౌసింగ్ సొసైటీ, మున్సిపల్ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది.
ఇదికూడా చదవండి: Hyderabad: హైడ్రా లాంటి సంస్థను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలి
ఆది నుంచి వివాదమే...
చిత్రపురి కాలనీలో హెచ్‌ఐజీ, ఎంఐజీ(HIG, MIG)తోపాటు రోహౌజెస్ కూడా నిర్మించారు. ఈ రోహౌజెస్లో అక్రమాలు జరిగాయని, సినీ కార్మికులకు కాకుండా బయట వ్యక్తులకు స్థలాలు కేటాయించారని ఫిర్యాదులొచ్చాయి. రోహౌజెస్ను పూర్తిగా తొలగించి ఫ్లాట్లు నిర్మిస్తే 3 వేల మంది కార్మికులకు ఇళ్లు లభిస్తాయని సినీ కార్మికులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. కాగా, ఈ కూల్చివేతలపై చిత్రపురి హౌసింగ్ సొసైటీ(Chitrapuri Housing Society) నాయకులు మాట్లాడుతూ.. నిర్మాణాలకు మున్సిపాలిటీ అనుమతి ఇచ్చిందని, ఇప్పుడు అనుమతి లేదంటే ఎలాగని ప్రశ్నించారు.
............................................................................
ఈ వార్తను కూడా చదవండి:
.............................................................................
Hyderabad: వాటర్‌బోర్డు ఈడీగా మయాంక్ మిట్టల్
హైదరాబాద్ సిటీ: వాటర్‌బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ)గా మయాంక్ మిట్టల్(Mayank Mittal) నియమితులయ్యారు. నారాయణపేట అదనపు కలెక్టర్(Additional Collector)గా పనిచేస్తున్న ఆయన్ను ప్రభుత్వం వాటర్‌బోర్డుకు బదిలీ చేసింది. 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈడీగా ఐఏఎస్(IAS) నియామకం జరిగింది. అలాగే హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా కోట శ్రీవాత్సవ నియామకమయ్యారు.
జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్(GHMC Additional Commissioner)గా కొనసాగుతున్న ఆయన్ను హెచ్‌ఎండీఏకు బదిలీ చేశారు. ఇప్పటివరకు జాయింట్ కమిషనర్‌గా కొనసాగిన ఆమ్రపాలికి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఇక నుంచి హెచ్‌ఎండీఏ అడ్మినిస్ర్టేషన్ నిర్వహణ, ఇతర బాధ్యతలు జాయింట్ కమిషనర్ పర్యవేక్షించనున్నారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read Latest Telangana News and National News
Updated Date - Aug 21 , 2024 | 12:26 PM