Hyderabad: దాదర్ స్టేషన్ నుంచే రైళ్ల మళ్లింపు...
ABN, Publish Date - May 18 , 2024 | 11:06 AM
ముంబై స్టేషన్‌లో నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు, 10, 11 ఫ్లాట్‌ఫాం యార్డుల విస్తరణ పనుల దృష్టా హైదరాబాద్(Hyderabad) నుంచి వచ్చే రైళ్లను దాదర్ నుంచే మళ్లించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు తెలిపారు.
హైదరాబాద్: ముంబై స్టేషన్‌లో నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు, 10, 11 ఫ్లాట్‌ఫాం యార్డుల విస్తరణ పనుల దృష్టా హైదరాబాద్(Hyderabad) నుంచి వచ్చే రైళ్లను దాదర్ నుంచే మళ్లించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు తెలిపారు. మే 15 నుంచి 30 వరకు హైదరాబాద్-సీఎ్‌సటీ ముంబై రైలు(12702), మే 30, జూన్ 1న లింగంపల్లి-సీఎస్‌టీ ముంబై రైలు(17058), జూన్ 1న బీదర్- సీఎస్‌టీ ముంబై రైలు(22144), మే 31, జూన్1న హైదరాబాద్-సీఎస్‌టీ ముంబై రైలు (22731), జూన్ 1, 2 తేదీల్లో సీఎస్ టీముంబై -హైదరాబాద్ రైలు(22732) దాదర్ వరకు నడుస్తాయని వివరించారు.
ఇదికూడా చదవండి: Big Alert: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. మెట్రో రైలు వేళలు మారిపోయాయ్..
జూన్ 1న సీఎస్‌టీ ముంబై-ఆదిలాబాద్(Mumbai-Adilabad) రైలు(11401), సీఎ్‌సటీ ముంబై-బీదర్ రైలు(22143)-సీఎ్‌సటీ ముంబై-లింగంపల్లి రైలు (17057)దాదర్ నుంచి బయలుదేరుతుందని రైల్వేఅధికారులు పేర్కొన్నారు. గుంటూరు-కాచిగూడ రైలు(17251) మే 18 నుంచి పునరుద్ధరించనున్నట్టు తెలిపారు. కాచిగూడ-గుంటూరురైలు(17252), కాచిగూడ-మెదక్ రైలు(07577), మెదక్-కాచిగూడ రైలు(07578)ను మే19 నుంచి పునరుద్ధరిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: ‘మెట్రో’లో మహిళలు తగ్గుతున్నారు..!
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - May 18 , 2024 | 11:06 AM