Hyderabad: అధికారులపై దాడి వెనుక ఎవరున్నా ఉపేక్షించొద్దు
ABN, Publish Date - Nov 15 , 2024 | 09:50 AM
వికారాబాద్(Hyderabad:) జిల్లా, దుద్యాల మండలం, లగచర్లలో అధికారులపై జరిగిన దాడి ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. ఈఘటన వెనుక ఎవరున్నా ఉపేక్షించొద్దని కోరారు.
- తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి
- లగచర్ల ఘటనకు నిరసనగా కలెక్టరేట్ ఎదుట ధర్నా
హైదరాబాద్ సిటీ: వికారాబాద్(Vikarabad) జిల్లా, దుద్యాల మండలం, లగచర్లలో అధికారులపై జరిగిన దాడి ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. ఈఘటన వెనుక ఎవరున్నా ఉపేక్షించొద్దని కోరారు. లగచర్ల ఘటనకు నిరసనగా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు గురువారం హైదరాబాద్ కలెక్టరేట్(Hyderabad Collectorate) ఎదుట ఉద్యోగులు ధర్నా నిర్వహించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మూసీని పునరుజ్జీవింప చేయాల్సిందే..
ఈ సందర్భంగా లచ్చిరెడ్డి మాట్లాడుతూ ఈఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా సేవలు అందించే అధికారులపై దాడులు, హత్యాయత్నం వంటి ఘటనలకు పూనుకోవడం వెనుకాల కుట్ర కోణం దాగిఉందనే అనుమానం వ్యక్తం చేశారు. లగచర్ల ఘటనలో కొందరు దాడికి గురైన ఉద్యోగులను కాకుండా, దాడికి పాల్పడిన వారిని పరామర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు.
అనంతరం హైదరాబాద్ కలెక్టర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో ఉద్యోగుల జేఏసీ నాయకులు కె. రామకృష్ణ, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎస్.రాములు, తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ అధ్యక్షులు డా.జి.నిర్మల, తెలంగాణ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు దర్శన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: కేసు పెట్టాల్సింది.. సీఎం బ్రదర్స్‌పైనే
ఈవార్తను కూడా చదవండి: మాజీ మంత్రి మల్లారెడ్డి మోసం చేశారు
ఈవార్తను కూడా చదవండి: 14 రకాల వివరాలివ్వండి..
ఈవార్తను కూడా చదవండి: ‘లగచర్ల’పై ఉన్నత స్థాయి విచారణ
Read Latest Telangana News and National News
Updated Date - Nov 15 , 2024 | 09:50 AM