ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఎల్లమ్మా.. ఈ పనులయ్యేది ఎప్పుడమ్మా?

ABN, Publish Date - Oct 25 , 2024 | 10:32 AM

ఎంతో ప్రసిద్ధి చెందిన బల్కంపేట ఎల్లమ్మ ఆలయం(Balkampeta Ellamma Temple) వద్ద అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. 2022లో ప్రారంభం అయిన మల్టీలెవల్‌ పార్కింగ్‌ కాంప్లెక్స్‌ పనులకు దేవాదాయ శాఖ కమిషనర్‌ నిధుల విడుదలకు అనుమతి ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్‌ సంవత్సరం క్రితం పనులను అర్ధాంతరంగా నిలిపివేశాడు.

- ఏళ్లు గడుస్తున్నా ముందుకుసాగని బల్కంపేట పార్కింగ్‌ కాంప్లెక్స్‌ పనులు

- రూ.3 కోట్ల బిల్లులు రాక చేతులెత్తేసిన కాంట్రాక్టర్‌

- 2017లో పనులు ప్రారంభం.. జీ ప్లస్‌ 2 వరకే స్లాబ్‌ పూర్తి

- జీ ప్లస్‌ 6కు చేపట్టాలని నిర్ణయం

- కల్యాణ మండప నిర్మాణానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన పీఎం మోదీ

- అధికారుల పర్యటనలు, పరిశీలనలకే పరిమితమైన పనులు

హైదరాబాద్: ఎంతో ప్రసిద్ధి చెందిన బల్కంపేట ఎల్లమ్మ ఆలయం(Balkampeta Ellamma Temple) వద్ద అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. 2022లో ప్రారంభం అయిన మల్టీలెవల్‌ పార్కింగ్‌ కాంప్లెక్స్‌ పనులకు దేవాదాయ శాఖ కమిషనర్‌ నిధుల విడుదలకు అనుమతి ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్‌ సంవత్సరం క్రితం పనులను అర్ధాంతరంగా నిలిపివేశాడు. ముందుగా జీప్ల్‌స-2గా అంచనాలు వేసిన దేవాదాయ శాఖ దీన్ని జీప్ల్‌స-6కు మార్చింది. మొదట నిర్ణయించిన టెండర్‌ ప్రకారం పనులు పూర్తి చేసినప్పటికీ సుమారు రూ.3కోట్ల వరకు బిల్లులు చెల్లించడంలేదని కాంట్రాక్టర్‌ మొత్తుకుంటున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: బాణసంచా దుకాణాలకు అనుమతి తప్పనిసరి


ఈ విషయమై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిసి వినతిపత్రం అందజేసినా ఫలితంలేకుండా పోయిందని కాంట్రాక్టర్‌ ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. కాగా కేంద్ర టూరిజం విభాగం నిర్మిస్తామన్న కల్యాణమండపం పనులు ఇంకా మొదలు పెట్టనేలేదు. రాష్ట్రదేవాదాయశాఖ పలకదు.. కేంద్ర టూరిజం విభాగం ఉలకదు అన్న చందంగా పరిస్థితి తయారైంది. దీంతో దేవాలయానికి వచ్చే వేలాది మంది భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.


చూస్తున్నారు.. వెళ్తున్నారు..

దేవాలయం వద్ద 400 గజాల్లో ఉన్న కల్యాణమండపం ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. కాగా ఈ కల్యాణ మండపాన్ని కూలగొట్టి ఆధునిక సౌకర్యాలతో ఐదంతస్థుల భవనాన్ని ప్రసాదం పథకంలో భాగంగా రూ.4.40 కోట్లతో నిర్మించడానికి కేంద్ర టూరిజం విభాగం 2022 సెప్టెంబర్‌లో ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా భవన నమూనా రూపొందించారు. ఈ సంవత్సరం మార్చిలో ప్రధాని నరేంద్ర మోదీతో వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. తర్వాత కేంద్ర టూరిజం విభాగం వారు వస్తున్నారు..చూస్తున్నారు.. వెళ్తున్నారే తప్ప ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదు. ప్రజాప్రతినిధులు నిర్మాణాల పూర్తికి చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.


సంవత్సరాలు గడుస్తున్నా ముందుకు సాగని పనులు

బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతరరాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. వీరంతా తమ వాహనాలను పార్కింగ్‌ చేయడానికి స్థలం లేక అవస్థలు పడుతున్నారు. రహదారులపై ఎక్కడ పడితే అక్కడ నిలుపుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని 2017లో ఆధునిక సౌకర్యాలతో కూడిన ఆరు అంతస్థుల్లో మల్టీలెవల్‌ పార్కింగ్‌ కాంప్లెక్స్‌ను రూ.5.60 కోట్లతో నిర్మించాలని నిర్ణయించారు. మొదట్లో పనులు చకచకా జరుగగా.. పునాది తవ్వకాల్లో రాతిపొరలు ఉండడంతో మొదట గుత్తేదారు తప్పుకున్నాడు.


తర్వాత కరోనాతో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. అప్పుడు మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్‌(Thalasani Srinivas Yadav) చొరవతో 1,165 గజాల్లో దేవస్థానమే ఈ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులను చేపట్టాలని నిర్ణయించింది. పనులు మళ్లీ మొదలై.. మూడుస్లాబులు వేసిన అనంతరం గుత్తేదారుకు డబ్బులు చెల్లించలేదు. దీంతో కాంట్రాక్టర్‌ తప్పుకున్నాడు. దేవస్థానానికి సంబంధించిన నిధులు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. వీటిని తీయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కావాలి. దేవాదాయ శాఖ కమిషనర్‌ ఇందుకు అనుమతి ఇవ్వడంలేదు. దీంతో మల్టీలెవల్‌ పార్కింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. మరో మూడు స్లాబ్‌లతోపాటు మిగతా పనులు పూర్తిచేయాల్సి ఉంది.


ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: ఉద్యోగులకు రెండు డీఏలు!

ఈవార్తను కూడా చదవండి: KTR: ఒకటి, రెండేళ్లు జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే

ఈవార్తను కూడా చదవండి: రాష్ట్రంలోనే సొంతంగా సీడ్‌ గార్డెన్‌: తుమ్మల

ఈవార్తను కూడా చదవండి: నేడు సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌

Read Latest Telangana News and National News

Updated Date - Oct 25 , 2024 | 10:32 AM