ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ‘ఈవెనింగ్‌ బీటెక్‌’కు అరకొరగానే అడ్మిషన్లు

ABN, Publish Date - Nov 12 , 2024 | 08:23 AM

ఈవెనింగ్‌ బీటెక్‌(Evening B.Tech) కోర్సులకు వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ నుంచి స్పందన కరువైంది. జేఎన్‌టీయూ క్యాంపస్‌ కళాశాలతోపాటు 8 అఫిలియేటెడ్‌ కళాశాలల్లో కలిపి 660 సీట్ల భర్తీకి అడ్మిషన్ల విభాగం అక్టోబరు 25న నోటిఫికేషన్‌ జారీచేసింది.

- కంప్యూటర్‌ కోర్సులపై మక్కువ చూపని వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌

- ఫీజులు అధికంగా ఉండడమే కారణమంటున్న అభ్యర్థులు

- సీట్ల భర్తీకి 18న మరోసారి కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌ సిటీ: ఈవెనింగ్‌ బీటెక్‌(Evening B.Tech) కోర్సులకు వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ నుంచి స్పందన కరువైంది. జేఎన్‌టీయూ క్యాంపస్‌ కళాశాలతోపాటు 8 అఫిలియేటెడ్‌ కళాశాలల్లో కలిపి 660 సీట్ల భర్తీకి అడ్మిషన్ల విభాగం అక్టోబరు 25న నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ మేరకు 5 నుంచి 7వ తేదీ వరకు వర్సిటీ అడ్మిషన్ల విభాగంలో సెంట్రలైజ్డ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించగా, ప్రవేశాల కోసం వచ్చిన అభ్యర్థుల సంఖ్య వందకు లోపే ఉండడం గమనార్హం.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: నగరంలో నిషేధాజ్ఞల సడలింపు


వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్‌ కళాశాల, మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంజీఐటీ)ల్లో చేరేందుకు ఒక్కరు కూడా ఆసక్తి చూపలేదు. రూ. లక్షల్లో ట్యూషన్‌ ఫీజు చెల్లించడం తమకు భారంగా పరిణమించిందని కొందరు అభ్యర్థులు వాపోయారు. దీంతో తక్కువ ట్యూషన్‌ ఫీజులు ఉన్న జేఎన్‌టీయూ క్యాంపస్‌ కళాశాలల్లో మెకానికల్‌, మెటలర్జీ కోర్సుల్లో, మైసమ్మగూడలోని సెయింట్‌ పీటర్స్‌ కాలేజీలో ఎలక్ట్రికల్‌, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అనుబోస్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో మైనింగ్‌, అబ్దుల్‌ కలాం ఇంజనీరింగ్‌ కాలేజీలో ఎలక్ట్రికల్‌ కోర్సుల్లో అభ్యర్థులు చేరినట్లు అధికారులు తెలిపారు.


వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ ఎక్కువగా సంప్రదాయ మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, మెటలర్జీ, మైనింగ్‌ ఇంజనీరింగ్‌ కోర్సుల వైపే మొగ్గు చూపారని, కంప్యూటర్‌ సైన్స్‌, అనుబంధ కోర్సుల్లో చేరేందుకు ఎవరూ ముందుకు రాలేదని పేర్కొన్నారు. ఈవెనింగ్‌ బీటెక్‌ కోర్సుల(Evening BTech courses) పట్ల ఆసక్తి ఉన్న మరికొందరు అభ్యర్థుల నుంచి ఎంక్వయిరీలు వస్తున్నాయని, వీలైనంత ఎక్కువమందికి ప్రవేశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నెల 18న మరోసారి కౌన్సెలింగ్‌ ప్రక్రియను చేపడుతున్నట్లు వారు తెలిపారు.


కొన్ని కళాశాలల్లో అధికంగా ఉన్న ట్యూషన్‌ ఫీజులను తగ్గించాలని, వారంలో కొన్ని రోజులపాటు ఆన్‌లైన్‌, మరికొన్ని రోజుల పాటు ఆఫ్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ జేఎన్‌టీయూ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏడాదైనా విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా నోటిఫికేషన్‌ జారీచేస్తే తమలాంటి వారు ఎక్కువమంది అడ్మిషన్లు తీసుకునేందుకు మొగ్గు చూపుతారని అంటున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు... ఏం జరిగిందంటే..

ఈవార్తను కూడా చదవండి: IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య

ఈవార్తను కూడా చదవండి: TG News: పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత సుజాత...

ఈవార్తను కూడా చదవండి: Khammam: బోనకల్‌లో యాచకుడికి ఐపీ నోటీసు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 12 , 2024 | 08:23 AM