Hyderabad: మళ్లీ భారీ అగ్నిప్రమాదం
ABN, Publish Date - Nov 26 , 2024 | 07:13 PM
హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఓ పరిశ్రమలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. వాటిని ఆర్పేందుకు ఫైరింజన్లు ఘటన స్థలానికి చేరుకున్నాయి. దాదాపు 4 గంటలుగా శ్రమిస్తున్నా.. మంటలు మాత్రం అదుపులోకి రాలేదు.
హైదరాబాద్, నవంబర్ 26: నగరంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్ బ్యాగుల పరిశ్రమలో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సదరు పరిశ్రమ యాజమాన్యంతోపాటు స్థానికులు వెంటనే స్పందించి.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఆరు ఫైరింజన్లతోపాటు 20 వాటర్ ట్యాంకర్లతో అగ్నిమాపక సిబ్బంది.. ఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read: రూ. 24 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
అయితే పరిశ్రమలో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దాదాపు నాలుగు గంటలుగా వాటిని అదుపులోకి తీసుకు వచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ సాధ్యం కావడం లేదు. ఆ క్రమంలో మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు వారు మరింత శ్రమిస్తున్నారు. మరోవైపు భారీగా మంటలు ఎగసిపడుతుండడంతో.. ముందస్తు చర్యల్లో భాగంగా పరిసర ప్రాంతంలోని ప్రజలను అగ్ని మాపక సిబ్బంది ఖాళీ చేయిస్తున్నారు.
Also Read:సీఎం రేవంత్ భేటీ.. అనంతరం కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
మరోవైపు అగ్ని మాపక శాఖ నిర్లక్ష్య వైఖరిపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ ప్రమాదంపై ఫిర్యాదు అందిన వెంటనే రెండు ఫైరింజన్లు మాత్రమే ఘటన స్థలానికి చేరుకున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో మంటలు రెండో అంతస్తుకు సైతం వ్యాపించాయని వారు వివరిస్తున్నారు. ఆ తర్వాత మరిన్ని ఫైరింజన్లు వచ్చినా.. మంటలను మాత్రం అదుపులోకి తీసుకు రాలేక పోయారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read రాగల 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు
ఇది ఇలా ఉంటే.. మంటలు అదుపులోకి తీసుకు వచ్చేందుకు గంటలు గంటలుగా ప్రయత్నిస్తున్న.. అవి విఫలం కావడంతో అగ్నిమాపక సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. అదీకాక ఈ ఫ్యాక్టరీలో వేస్టేజ్ చాలా ఉందని.. అందువల్ల అగ్నికీలలు అదుపులోకి రావడం లేదనే వాదన స్థానికంగా వినిపిస్తుంది. అయితే జీహెచ్‌ఎంసీ, డీఆర్ఎఫ్, స్థానికులు సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మరికొన్ని గంటల్లో మంటలు అదుపులోకి తీసుకు వచ్చే అవకాశముందని తెలుస్తుంది.
Also Read: ఏపీలో ఎన్నికలు.. నోటిఫికేషన్ విడుదల
అయితే ఈ అగ్ని ప్రమాదంలో ఎవరైనా మరణించారా? ఎవరికైనా గాయాలయ్యాయా? అనే విషయం మాత్రం తెలియరాలేదు. ఈ ప్రమాదానికి గల కారణాలు సైతం తెలియ రాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా ఈ ప్రమాదం.. షార్ట్ సర్కూట్ కారణంగానా? లేకుంటే మానవ తప్పిదమా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read: మున్సిపల్ కమిషనర్ నివాసంపై ఏసీబీ దాడి.. కీలక పత్రాలు స్వాధీనం
For Telangana News And Telugu News
Updated Date - Nov 26 , 2024 | 07:16 PM