Hyderabad: ఏడాది పొడవునా అన్నదానం..
ABN, Publish Date - Nov 23 , 2024 | 10:48 AM
సిక్కులు లంగర్ సేవ (అన్నదానం)కు ప్రాధాన్యం ఇస్తారు. ప్రతి గురుద్వారాలో లంగర్ సేవలు నిర్వహిస్తూ కులమతాలకతీతంగా ఆకలితో వచ్చిన వారికి ఉచితంగా భోజనం అందిస్తారు. తెలంగాణ(Telangana)లో ఉన్న 52 గురుద్వారాలలో ఈ లంగర్ సేవ కొనసాగుతుంది.
- అనాథల ఆకలి తీరుస్తున్న గురుద్వారా ప్రబంధక్ కమిటీ
హైదరాబాద్: సిక్కులు లంగర్ సేవ (అన్నదానం)కు ప్రాధాన్యం ఇస్తారు. ప్రతి గురుద్వారాలో లంగర్ సేవలు నిర్వహిస్తూ కులమతాలకతీతంగా ఆకలితో వచ్చిన వారికి ఉచితంగా భోజనం అందిస్తారు. తెలంగాణ(Telangana)లో ఉన్న 52 గురుద్వారాలలో ఈ లంగర్ సేవ కొనసాగుతుంది. 550 ఏళ్ల క్రితం సిక్కుల గురువు గురునానక్ రూ.20లతో లంగర్‌సేవ ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతీ గురుద్వారాలో లంగర్‌సేవ నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. గురుద్వారాలో ఎత్తైన ప్రదేశంలో అందరికీ కనపడేలా జెండా(నిషాన్ సాహిబ్) కనిపిస్తుంది. ఈ నిషాన్‌సాహిబ్ సహాయం చేయడానికి గురుద్వారా ఉంది అనే సంకేతం. సికింద్రాబాద్(Secunderabad) గురుద్వారా ప్రబంధక్ కమిటీ ఆధ్వర్యంలో ఏడాది పొడవునా పేదలు, అనాథలకు అన్నదానం చేస్తూ ఆకలి తీరుస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: MP Etala: నోడౌట్.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎగిరేది కాషాయ జెండానే
రోజూ 200 నుంచి 250 మందికి..
సికింద్రాబాద్ గురుద్వారాలో రోజూ 200-250 మందికి అన్నదానం చేస్తున్నారు. దీనితోపాటు ఉదయం అల్పాహారం, సాయంత్రం పలావ్ అందిస్తూ పేదల అకలి తీరుస్తున్నారు. కేవలం అనాథలే కాకుండా ఇతరులు కూడా వచ్చి భోజనం చేసి ఆకలి తీర్చుకుంటున్నారు. గురుద్వారాకు వస్తే అకలి తీర్చుకోవచ్చని లంగర్ సేవ సమయానికి అనాథలు అక్కడి చేరుకుని లైన్‌లో నిల్చుంటారు.
సామాజిక సేవకు ప్రాధాన్యం
సామాజిక సేవకు గురుద్వారా ప్రభందక్ కమిటీ ప్రాధా న్యం ఇస్తుంది. పేదలకు మూడు పూట లా ఆకలి తీరుస్తు న్నాం. కోవిడ్ సమయంలో నిత్యావసరాలను పంపిణీ చేశాం. కోవిడ్ భాదితులకు ఆక్సీజన్ సిలిండర్‌లు ఉచితంగా అందించాం.
- హరిప్రీత్ సింగ్ గులాటీ, సెక్రటరీ, గురుద్వారా సాహెబ్
ఈవార్తను కూడా చదవండి: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు
ఈవార్తను కూడా చదవండి: Sarpanch: కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ఆత్మహత్య
ఈవార్తను కూడా చదవండి: AV Ranganath: కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తుంది!
ఈవార్తను కూడా చదవండి: వామ్మో...చలి
Read Latest Telangana News and National News
Updated Date - Nov 23 , 2024 | 10:48 AM