ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఫుడ్ సేఫ్టీ నాన్ స్టాప్ దాడులు.. ఈ హోటల్స్‌లో తింటున్నారా.. కొంచెం జాగ్రత్త

ABN, Publish Date - Nov 07 , 2024 | 12:11 PM

గ్రేటర్ హైదరాబాద్‌లో పలు హోటల్స్‌, రెస్టారెంట్స్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు నాన్ స్టాప్ దాడులు చేస్తున్నారు. ఆహార భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించని పలు హోటల్స్ లైసెన్స్ లను రద్దు చేశారు.

hotels

Hyderabad : హైదరాబాద్‌లో గ్రేటర్ హోటల్స్, రెస్టారెంట్స్ పై జిహెచ్ఎంసి ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేక బృందాలతో నాన్ స్టాప్ దాడులు దాడులు చేపట్టారు. ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి హోటల్స్ పై ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే ఆహార భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించని పలు హోటల్స్ లైసెన్స్ లను రద్దు చేశారు. రెస్టారెంట్లపై ప్రత్యేక బృందాలతో తనిఖీలు కొనసాగిస్తున్నారు.


నోటీసులు..

హైదరాబాద్ ఓల్డ్ సిటీ సంతోష్ నగర్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. శ్రీ రాఘవేంద్ర, ఉడిపి, సంతోష్ డాబా రెస్టారెంట్లపై దాడులు జరుగుతున్నాయి. హోటల్స్ లో కాలం చెల్లిన ఆహార పదార్థాలను గుర్తించారు. కిచెన్ లో అపరిశుభ్రమైన వాతావరణం ఉందని అధికారులు తెలిపారు. కుళ్లిపోయిన కూరగాయలతో హోటళ్ళ నిర్వాహకులు వంట చేయడం గుర్తించారు.

కిచెన్‌లో బొద్దింకలు, స్టోర్ రూమ్ లో ఫంగస్ వచ్చిన అల్లంను కనుగొన్నారు. ఆహార పదార్థాల్లో మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ వినియోగించడంపై హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకులకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు ఇచ్చారు.


ఫ్రిజ్‌లో కుళ్లిన చికెన్‌..

మూసాపేట్ కృతుంగ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయగా కిచెన్ లో ఎలుకలు, బొద్దింకలు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా హోటల్ నిర్వాహకులు కుళ్లిన చికెన్‌ను రోజుల తరబడి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచినట్లు వెల్లడించారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని తెలిపారు. ఆహార భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే క్రిమినల్ కేసులు పెడతామంటూ హెచ్చరించారు.


Also Read:

గంట సేపు మూసీలో నిలబడాలి..కేసీఆర్, కేటీఆర్‌కు కాంగ్రెస్ సవాల్..

నమ్మించి మోసం చేశారు.. తులం బంగారం వెంటనే ఇవ్వాలి

ప్రయాణికుడి వద్ద బుల్లెట్లు.. టార్గెట్ ఏమిటంటే..

For More Andhra Pradesh and Telangana News

Updated Date - Nov 07 , 2024 | 12:33 PM