Hyderabad: సిటీలో ఫుట్‌బాల్ మైదానాలు.. జోన్‌కొకటి చొప్పున ఏర్పాటు యోచన
ABN, Publish Date - Aug 06 , 2024 | 10:13 AM
ఫుట్‌బాల్‌పై ఆసక్తి పెంచడంతోపాటు మెరికల్లాంటి క్రీడాకారులను తయారు చేసేందుకు జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు రచిస్తోంది. స్వతహాగా ఈ క్రీడపై అమితాసక్తి ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఆదేశాల మేరకు గ్రేటర్‌లో ఫుట్‌బాల్ మైదానాల నిర్మాణాల కోసం అనువైన ప్రాంతాలను అన్వేషిస్తోంది.
- అనువైన ప్రాంతాల కోసం అన్వేషణ
- ఐదెకరాల కంటే ఎక్కువ విస్తీర్ణానికి ప్రాధాన్యం
- ప్రభుత్వానికి వివరాలు పంపిన జీహెచ్‌ఎంసీ
హైదరాబాద్ సిటీ: ఫుట్‌బాల్‌పై ఆసక్తి పెంచడంతోపాటు మెరికల్లాంటి క్రీడాకారులను తయారు చేసేందుకు జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు రచిస్తోంది. స్వతహాగా ఈ క్రీడపై అమితాసక్తి ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఆదేశాల మేరకు గ్రేటర్‌లో ఫుట్‌బాల్ మైదానాల నిర్మాణాల కోసం అనువైన ప్రాంతాలను అన్వేషిస్తోంది. ఐదెకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న పలు ఏరియాల వివరాలను బల్దియా క్రీడా విభాగం అధికారులు కమిషనర్ ద్వారా ప్రభుత్వానికి పంపినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఫుట్‌బాల్ గ్రౌండ్ అభివృద్ధికి ఎంత స్థలం అవసరం ? సాధారణంగా క్రీడాకారులు ఆడుకునేందుకు ఎంత విస్తీర్ణంలో ఉండాలి ? ప్రేక్షకులు వీక్షించేందుకు సీటింగ్ ఏర్పాట్లు చేయాలంటే ఎంత స్థలం కావాలి ? అన్న వివరాలను సేకరిస్తున్నారు. అలాగే ఒక్కో మైదానం అభివృద్ధికి ఎంత ఖర్చవుతుంది ? ఎలాంటి సదుపాయాలు ఉండాలి ? తదితర విషయాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: హత్యాయత్నం కేసు.. రెండేళ్ల తర్వాత హత్య కేసుగా.. అసలేం జరిగిందంటే..
ఆసక్తి ఉన్నా మైదానాలు లేక..
నగరంలో జీహెచ్‌ఎంసీ(GHMC)కి చెందిన 12 స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, చిన్నవి, పెద్దవి కలిపి 521 క్రీడా మైదానాలున్నాయి. పలు గ్రౌండ్లలో నిత్యం వివిధ క్రీడలకు సంబంధించి కోచ్‌లు శిక్షణ ఇస్తుంటారు. వేసవిలో నెలన్నరపాటు భారీఎత్తున ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి 50కిపైగా క్రీడల్లో పిల్లలకు శిక్షణ ఇస్తుంటారు. క్రికెట్, బాస్కెట్‌బాల్, షటిల్ బ్యాడ్మింటన్, బాల్ బ్యాడ్మింటన్, సెపక్‌థక్రా తదితర క్రీడలు ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియాల్లో ఆడుతుంటారు. అయితే, నగరంలో ఫుట్‌బాల్‌కు ప్రత్యేకంగా గ్రౌండ్ ఇప్పటివరకు లేదు. క్రికెట్ తర్వాత చాలామంది ఇష్టపడే క్రీడల్లో ఫుట్‌బాల్ ఒకటి. సదుపాయాలు లేక సాధన, ఆడేందుకు యువత ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో కనీసం జోన్‌కు ఒకటి చొప్పున ఫుట్‌బాల్ మైదానాలు అభివృద్ధి చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
లేదంటే మినీ గ్రౌండ్‌లూ...
ప్రభుత్వానికి పంపిన వివరాల్లో కొన్ని స్థలాల విస్తీర్ణం ఐదెరాల కంటే తక్కువ ఉన్నట్లు తెలిసింది. అలాంటి చోట క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి మినీ గ్రౌండ్‌లు అభివృద్ధి చేసే చాన్స్ ఉంది. ఉదాహరణకు గచ్చిబౌలి గోపన్‌పల్లి తండా(Gachibowli Gopanpally Thanda)లో స్థలం అందుబాటులో ఉన్నా హైటెన్షన్ విద్యుత్ లైన్ ఉండడంతో అక్కడ మైదానం అభివృద్ధి సాధ్యమా అన్నది పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తేనే ఫుట్‌బాల్ మైదానాల ఏర్పాటులో ముందడుగు పడుతుందని ఓ అధికారి చెప్పారు.
మైదానాల కోసం గుర్తించిన ప్రాంతాల్లో కొన్ని..
జోన్ --- ప్రాంతాలు
ఎల్‌బీనగర్ జేజే నగర్, వల్‌వర్‌నగర్ (కాప్రా), ఛత్రపతి శివాజీ గ్రౌండ్
శేరిలింగంపల్లి గోపన్‌పల్లి తండా,
మియాపూర్ బస్‌డిపో వెనుక
కూకట్‌పల్లి ఎస్‌ఆర్ నాయక్‌నగర్ (అల్వాల్)
ఖైరతాబాద్ లంగర్‌హౌస్
సికింద్రాబాద్ తిరుమలగిరి
ఇదికూడా చదవండి: TG News: పీవీఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే పైనుంచి దూకిన గుర్తు తెలియని వ్యక్తి
ఇదికూడా చదవండి: RBI Official: రూ.40 కోట్ల ఆర్థిక మోసం కేసు.. బషీద్‌కు ఆర్‌బీఐ అధికారి సహకారం?
ఇదికూడా చదవండి: KTR: రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు!
Updated Date - Aug 06 , 2024 | 10:13 AM