ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ప్రైవేట్‌ ల్యాబ్‌లకు వెళ్లండి..

ABN, Publish Date - Aug 27 , 2024 | 11:34 AM

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాధి నిర్ధారణ రోగులకు ఓ ‘పరీక్ష’లా మారుతోంది. మధ్యాహ్నం అయితే చాలు ల్యాబ్‌లు మూతపడుతుండడమే ఇందుకు కారణం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవుట్‌ పేషెంట్‌ (ఓపీ) రాక ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉంటే, ఆ సమయం వరకే ల్యాబ్‌లు పనిచేస్తున్నాయి.

- రోగులకు ప్రభుత్వాస్పత్రుల ల్యాబ్‌ సిబ్బంది సూచన

హైదరాబాద్‌ సిటీ: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాధి నిర్ధారణ రోగులకు ఓ ‘పరీక్ష’లా మారుతోంది. మధ్యాహ్నం అయితే చాలు ల్యాబ్‌లు మూతపడుతుండడమే ఇందుకు కారణం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవుట్‌ పేషెంట్‌ (ఓపీ) రాక ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉంటే, ఆ సమయం వరకే ల్యాబ్‌లు పనిచేస్తున్నాయి. ఆ తర్వాత వచ్చే వారు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఓ పది నిమిషాలు ల్యాబ్‌కు చేరుకోవడానికి ఆలస్యమైతే చాలు మరో రోజు వరకు వేచి చూడాల్సిందే. అత్యవసరంగా ఎక్స్‌రే, సీటీస్కాన్‌, మూత్రం, రక్తం.. ఇలా అన్నిరకాల పరీక్షలు చేయించుకోవాలంటే ప్రభుత్వ ఆస్పత్రులకు మధ్యాహ్నం 1 గంటలోపు రావాల్సిందే. ఆ తర్వాత వస్తే ప్రైవేట్‌ ల్యాబ్‌(Private Lab)లను ఆశ్రయించి పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోంది.

ఇదికూడా చదవండి: Hyderabad: హైడ్రాకు ప్రజలందరూ మద్దతివ్వాలి


రోడ్డు ప్రమాద బాధితులే అధికం..

గాంధీ ఆస్పత్రికి నిత్యం 1200 మందికి మించి రోగు లు ఓపీకి వస్తుంటారు. 100-150 వరకు కొత్త కేసులు అడ్మిట్‌ అవుతుంటాయి. ఇది జనరల్‌ ఆస్పత్రి కావడంతో ప్రతి రోజు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తులు ఎక్కువగా వస్తుంటారు. వీరిలో ఎక్కువమందికి తప్పని సరిగా రక్తం, మూత్రం, ఎక్స్‌రే, స్కానింగ్‌, థైరాయిడ్‌ వంటి పరీక్షలు అవసరమవుతాయి. అయితే ఆస్పత్రిలో రోగుల సంఖ్యకనుగుణంగా నిర్ధారణ పరీక్షలు జరగడం లేదు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలంటే రెండు మూడు రోజుల సమయం పడుతోందంటూ సిబ్బంది ప్రైవేటు ల్యాబ్‌లకు రెఫర్‌ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ‘అక్కడికే వెళ్లండి’ అని ఉచిత సలహా ఇస్తున్నారు. అత్యవసర సమయంలో ప్రైవేటు ల్యాబ్‌ సిబ్బందిని పిలిపిస్తున్నారు. వారు గాంధీ ఆస్పత్రి వార్డులోనే రోగుల రక్త, మూత్ర నమునాలను సేకరిస్తున్నారు.


అక్కడ స్కానింగ్‌ సెంటర్ల దందా జోరు

సుల్తాన్‌బజార్‌, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల వద్ద స్కానింగ్‌ సెంటర్ల దందా యథేచ్ఛగా సాగుతోంది. సమీపంలోనే ప్రైవేట్‌ ల్యాబ్‌లు ఉండడంతో చాలా మంది మహిళా రోగులకు సంబంధించిన పరీక్షలు ప్రైవేటు డయగ్నోస్టిక్‌ సెంటర్లలోనే జరుగుతున్నాయి. పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో రోజుకు 50-60 మందికి మాత్రమే స్కానింగ్‌ చేసే సదుపాయం ఉంది. సుల్తాన్‌బజార్‌ ప్రసూతి ఆస్పత్రిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.


24 గంటల ల్యాబ్‌ ఎప్పుడో ?

ఉస్మానియాలో నిత్యం 1500 నుంచి 2 వేల మంది మంది ఔట్‌ పేషెంట్లు, 1200 మంది ఇన్‌ పేషెంట్లు చికిత్స పొందుతుంటారు. ఈఎన్‌టీ, గుండె, మధుమేహం, చర్మవ్యాధులు, సర్జికల్‌ విభాగం, ఆపరేషన్‌ థియేటర్లు, గోల్డెన్‌ జూబ్లీ బ్లాక్‌లో ఔట్‌ పేషెంట్లకు సంబంధించిన విభాగం వైద్యులు పరీక్షలు చేసి వివిధ వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం పంపిస్తుంటారు. వీరికి అత్యవసరంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలంటే 24 గంటల ల్యాబ్‌ అవసరం. ఈ సదుపాయం ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. ఆస్పత్రిలో సీటీస్కాన్‌ ఎప్పుడు పాడవుతుందో తెలియని పరిస్థితి.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 27 , 2024 | 11:34 AM

Advertising
Advertising
<