Hyderabad: హనుమాన్ విజయయాత్ర.. నేడు ట్రాఫిక్ ఆంక్షలు
ABN, Publish Date - Apr 23 , 2024 | 08:38 AM
హనుమాన్ విజయయాత్రను పురస్కరించుకొని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి(CP Kothakota Srinivas Reddy) తెలిపారు. విజయయాత్ర మంగళవారం ఉదయం గౌలిగూడ రామమందిరం నుంచి బయలుదేరి తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వద్ద ముగుస్తుంది.
హైదరాబాద్ సిటీ: హనుమాన్ విజయయాత్రను పురస్కరించుకొని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి(CP Kothakota Srinivas Reddy) తెలిపారు. విజయయాత్ర మంగళవారం ఉదయం గౌలిగూడ రామమందిరం నుంచి బయలుదేరి తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వద్ద ముగుస్తుంది. గౌలిగూడ, పుత్లిబౌలి క్రాస్‌రోడ్స్, ఆంధ్రాబ్యాంక్ క్రాస్‌రోడ్స్, కోఠి, డీఎంహెచ్‌ఎస్, సుల్తాన్‌బజార్, రాంకోఠి, కాచిగూడ, నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్‌నగర్, గాంధీనగర్, ప్రాగాటూల్స్, కవాడిగూడ సీజీఓ టవర్స్, బన్సీలాల్‌పేట, బైబిల్‌హౌస్, సిటీలైట్ హోటల్, బాటా, ఉజ్జయిని మహంకాళి టెంపుల్, ప్యారడైజ్ క్రాస్‌రోడ్స్, సీటీఓ జంక్షన్, బ్రూక్‌బాండ్, ఇంపీరియల్ గార్డెన్, మస్తాన్ కేఫ్ మీదుగా 12 కిలోమీటర్ల మేర యాత్ర సాగుతుంది.
ఇదికూడా చదవండి: దేవుళ్ల పేరుతో రేవంత్ డ్రామా
రాచకొండ నుంచి మరో యాత్ర
రాచకొండ కమిషనరేట్ నుంచి వచ్చే మరో యాత్ర బృందం కర్మన్‌ఘాట్ నుంచి చంపాపేట, ఐఎస్ సదన్, ధోబీఘాట్, సైదాబాద్ కాలనీ రోడ్, శంకరేశ్వర బజార్, సరూర్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, ఆజంపురా రోటరీ మీదుగా చాదర్‌ఘాట్ వద్ద ప్రధాన యాత్రలో కలుస్తుంది. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని సీపీ తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి రద్దీని నివారించాలని కోరారు.
- సుల్తాన్‌బజార్ పోలీస్టేషన్ పరిధిలో గౌలిగూడ చమన్ నుంచి రామ్‌మందిర్ వైపు వెళ్లే వాహనాలను అనుమతించరు. జీపీఓ నుంచి ఎంబీ మార్కెట్ వైపు వాహనాలను అనుమతించరు.
ఇదికూడా చదవండి: కాంగ్రెస్‌లో చేరని వారిపై అక్రమ కేసులు
- లక్డీకాపూల్ నుంచి దిల్‌సుఖ్‌నగర్ వైపునకు వెళ్లే వాహనదారులు కోఠి వైపు నుంచి కాకుండా బషీర్‌బాగ్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ హియాయత్‌నగర్, నారాయణగూడ ఫ్లైఓవర్, బర్కత్‌పురా, నింబోలిఅడ్డా, చాదర్‌ఘాట్ కాజ్‌వే మీదుగా నల్గొండ ఎక్స్‌రోడ్స్ వైపు వెళ్లాలి.
- దిల్‌సుఖ్‌నగర్ నుంచి మెహిదీపట్నం వెళ్లే వాహనదారులు ఎల్‌బీనగర్, చాంద్రాయణగుట్ట, ఆరాంఘర్, అత్తాపూర్ మీదుగా వెళ్లాలి.
ఇదికూడా చదవండి: MLC Kavitha: కవితకు బెయిల్ వస్తుందా?
Updated Date - Apr 23 , 2024 | 08:38 AM