ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: హయత్‌నగర్‌ టు ఆటోనగర్‌.. 3 కి.మీ.లకు ఒకే యూటర్న్‌

ABN, Publish Date - Oct 15 , 2024 | 09:43 AM

విజయవాడ(Vijayawada) జాతీయ రహదారి విస్తరణ పనులు వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి. హయత్‌నగర్‌ టు ఆటోనగర్‌(Hayatnagar to Autonagar) వరకు ఒకే యూటర్న్‌ ఉండడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. జాతీయ రహదారి విస్తరణ పనులు ఏడాది నుంచి జరుగుతున్నాయి.

- విజయవాడ జాతీయరహదారిపై వాహనదారుల ఇబ్బంది

- ఆటోనగర్‌లో వంద మీటర్లకు రెండు యూటర్న్‌లు

హైదరాబాద్: విజయవాడ(Vijayawada) జాతీయ రహదారి విస్తరణ పనులు వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి. హయత్‌నగర్‌ టు ఆటోనగర్‌(Hayatnagar to Autonagar) వరకు ఒకే యూటర్న్‌ ఉండడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. జాతీయ రహదారి విస్తరణ పనులు ఏడాది నుంచి జరుగుతున్నాయి. రహదారికి ఇరువైపులా వందలాది కాలనీలు ఉన్నాయి. ఎడమ వైపు ఉన్న కాలనీవాసులు కుడి వైపునకు రావాలన్నా.. కుడివైపున ఉన్న కాలనీవాసులు ఎడమ వైపు వెళ్లాలన్నా బైక్‌పై కనీసం మూడు కిలో మీటర్లు తిరిగి రావాల్సి వస్తోంది. హయత్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌ ఎదుట ఒక యూటర్న్‌ ఉంటే మరో యూటర్న్‌ ఆటోనగర్‌ వద్ద ఉంది. చిన్న పని కోసం రోడ్డెక్కినా మూడు కిలోమీటర్ల ప్రయాణం తప్పడం లేదు. ఆటోనగర్‌లో మాత్రం కేవలం 100 మీటర్ల దూరంలోనే రెండు యూటర్న్‌లు ఏర్పాటు చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఇంకుడు గుంత లేకుంటే నోటీసులు...


రెండు యూటర్న్‌లు తొలగించడంతోనే..

మొదట హయత్‌నగర్‌ పోలీస్‏స్టేషన్‌ నుంచి ఆటోనగర్‌ వరకు నాలుగు చోట్ల యూటర్న్‌లు ఉండేవి. ఆ తర్వాత కాంట్రాక్టర్‌, అధికారులు వినాయకనగర్‌ పెట్రోల్‌బంకు, హైకోర్టు కాలనీ వద్ద యూటర్న్‌లను తొలగించడంతో సమస్య ప్రారంభమైంది.


నత్తనడకన రోడ్డు విస్తరణ పనులు..

జాతీయ రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభించి దాదాపు సంవత్సరం కావస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఇప్పటికీ హయత్‌నగర్‌లో భూసేకరణ జరగలేదు. రోడ్డు పక్కన ఉన్న వారికి నష్టపరిహారం ఇవ్వలేదు. ఆర్‌టీసీ కాలనీ వద్ద రోడ్డు మధ్యలో ఉన్న సమాధులను తొలగించలేదు. అక్కడ రోడ్డు పనులను ఆపేశారు. లెక్చరర్స్‌ కాలనీ వద్ద రోడ్డుపైన ఉన్న చిన్న గుడి అలానే ఉంది. అక్కడ కూడా పనులు మధ్యలో ఆపేశారు. ఆటోనగర్‌ పాత ఇసుక అడ్డా వద్ద రోడ్డు పనులను మధ్యలో నిలిపేశారు. చింతల్‌కుంట నుంచి అబ్దుల్లాపూర్‌మెట్‌ వరకు అనేక ప్రాంతాలలో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి జాతీయ రహదారి పనులను త్వరగా పూర్తిచేసి యూటర్న్‌లు ఓపెన్‌ చేసేందుకు చర్యలు తీసుకోవాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.


ఒకచోట యూటర్న్‌ తెరిస్తే..

చిన్న పనికి రోడ్డుపైకి వస్తే మూడు కిలోమీటర్ల దూరం తిరిగి రావాల్సి వస్తోంది. పనులు జరగని ప్రాతంలో కూడా యూటర్న్‌లను మూసివేశారు. ఆటోనగర్‌, హయత్‌నగర్‌ పోలీస్‏స్టేషన్‌ మధ్యలో తాత్కాలికంగా ఒకచోట యూటర్న్‌ తెరిస్తే సమస్య ఉండదు.

- జి.వెంకట్‌రెడ్డి, వినాయకనగర్‌ కాలనీ


ఇదికూడా చదవండి: Mahesh Kumar Goud: త్వరలోనే మంత్రివర్గ విస్తరణ

ఇదికూడా చదవండి: Alcohol Sales: ఖజానాకు దసరా కిక్కు!

ఇదికూడా చదవండి: Papikondalu: పాపికొండలు విహారయాత్ర షురూ

ఇదికూడా చదవండి: CM Revanth Reddy: కొడంగల్‌.. దశ తిరిగేలా

Read Latest Telangana News and National News

Updated Date - Oct 15 , 2024 | 09:43 AM