Hyderabad: హలో.. ఈ విషయం మీకు తెలుసా.. గ్యాస్ సిలిండర్‌కూ ఉంటుంది గడువు
ABN, Publish Date - Nov 23 , 2024 | 11:26 AM
మనం కొత్త వస్తువు కొన్నపుడు అది పనిచేసే విధానాన్ని పూర్తిగా తెలుసుకునేందుకు తప్పనిసరిగా వస్తువుతో పాటు అందించే సూచనల పుస్తకం (మ్యాన్యువల్ బుక్) ను పూర్తిగా చదవాలి. కానీ మనలో చాలా మంది అదేమి పట్టించుకోకుండా నేరుగా వస్తువులను వాడుతుంటాం.
- గడువు తీరిన సిలిండర్లతోనే ప్రమాదాలు
- అవగాహన లేకుండా ఉపయోగిస్తున్న ప్రజలు
హైదరాబాద్: మనం కొత్త వస్తువు కొన్నపుడు అది పనిచేసే విధానాన్ని పూర్తిగా తెలుసుకునేందుకు తప్పనిసరిగా వస్తువుతో పాటు అందించే సూచనల పుస్తకం (మ్యాన్యువల్ బుక్) ను పూర్తిగా చదవాలి. కానీ మనలో చాలా మంది అదేమి పట్టించుకోకుండా నేరుగా వస్తువులను వాడుతుంటాం. మన నిత్య జీవితంలో వంటలో భాగమైన గ్యాస్ సిలిండర్(Gas cylinder) గురించి కూడా పూర్తి విషయాలు తెలియకుండానే వాడేస్తున్నారు. నిత్యం వాడే అనేక వస్తువులు, ఇతర వాటికి ఉన్నట్టే గ్యాస్ సిలిండర్‌కు కూడా గడువు తేది ఉంటుందన్న విషయం దానిని రోజు ఉపయోగించే చాలా మందికి తెలియదు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఏడాది పొడవునా అన్నదానం..
గృహ, వాణిజ్య, హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు పలు అవసరాల కోసం గ్యాస్ సిలిండర్‌లు వాడుతున్నా వాటి గడువు తేదీని పట్టించుకునే వారు చాలా తక్కువ. గ్యాస్ సరఫరా చేసే వ్యక్తి వచ్చి సిలిండర్‌ను అందించగానే అతని ఇచ్చే రసీదును, ఎంత డబ్బు తీసుకుంటున్నాడు అన్న విషయాన్ని మాత్రమే గమనిస్తున్నారే తప్పా ఇచ్చిన సిలిండర్ గడువు తేదీ ఉన్నదా లేదా అయిపోయిందా లేక లీకేజీ ఎమైన అవుతుందా అన్న విషయమే తక్కువ మంది గమనిస్తున్నారని నిపుణులు అంటున్నారు. ఒకవేళ గడువు తేదీ అయిపోయినా, లీకేజీ ఉన్న సిలిండర్‌ను ఉపయోగిస్తే ప్రమాదాన్ని పక్కన ఉంచుకున్నట్లేనని, 90 శాతం ప్రమాదాలకు అవే కారణమని వారు అంటున్నారు.
గడువు తేదీలను గుర్తించండి ఇలా..
గ్యాస్ సిలిండర్‌పై ఉన్న మూడు ఇనుప దిమ్మెలపై రాసిన ఇంగ్లిష్ అక్షరాలను, సంకెలను ఎవరు పట్టించుకోరు. కానీ విషయమంతా వాటిలోనే దాగుంది. ఆ సిలిండర్ ఎప్పుడు తయారైంది. ఎంత గ్యాస్ అందులో నిక్షిప్తమై ఉంది. గడువు తేదీ ఎప్పటి వరకు ఉంది అన్న వివరాలన్నీ ఈ సంఖ్యలు, అక్షరాలు తెలియజేస్తాయి. సిలిండర్ గడువు తేదీ ఏ, బి, సి, డి అక్షరాలతో సూచిస్తారు. సంవత్సరాల కాలాన్ని మూడు త్రైమాసీకాలుగా విభజిస్తారు. అందులో...
-ఏ- జనవ రి, ఫిబ్రవరి, మార్చి నెలలను మొదటి త్రైమాసికంగా, దీనిని ఏ అక్షరంతో సూచిస్తారు.
-బి- ఏప్రిల్, మే, జూన్ నెలలను రెండో త్రైమాసికంగా, దీనిని బి అక్షరంతో సూచిస్తారు.
-సీ- జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలను మూడో త్రైమాసికంగా విభజించి, సి అక్షరంతో సూచిస్తారు.
-డీ- అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలను చివరి త్రైమాసికంగా విభజించి డి అనే అక్షరంతో సూచిస్తారు.
ఉదాహరణకు సిలిండర్‌పై సి-26 అని రాసి ఉంటే దాని గడువు సెప్టెంబరు 2026వ సంవత్సరం వరకు మాత్రమే ఉందని గమనించాలి. ఆ గడువు దాటితే, సిలిండర్ గడువు తేదీ అయిపోయినట్లు గుర్తించి అటువంటి సిలిండర్‌ను వాడకుండా సంబందిత డీలర్‌కు తిరిగి ఇచ్చేయాలి.
సిలిండర్ వాడేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు..
గ్యాస్ సిలిండర్ డెలివరీ తీసుకునేటప్పుడు ముఖ్యంగా గడువు తేదీని గమనించాలి. ఒకవేళ గడువు తేదీని తెలియజేసే అక్షరాలపై ఏదైన స్టిక్కర్లు అంటించి ఉండడం, రంగులు వేసి కొత్తగా రాసినట్లు అనిపిస్తే అటువంటి సిలిండర్‌ను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. గ్యాస్ సిలిండర్‌కు ఉన్న సీల్ స్థితిని తప్పకుండా పరిశీలించాలి. ఒక్కొక్కసారి ఆ సీల్ మాములుగా అంటించి వినియోగదారులకు అందించే అవకాశం ఉంది. అటువంటి వాటి వలన గ్యాస్ లీకేజీలు ఏర్పడుతాయి.
- గ్యాస్ సిలిండర్ గృహ అవసరాలకు, వాణిజ్య అవసరాలకు అనుగుణంగా వేరువేరుగా త యారు చేయడం జరుగుతుంది. కావున వేటి కోసం తయారు చేసింది వాటి కోసమే ఉపయోగించాలి. ఖాళీ సిలిండర్‌లను ఎక్కువ రోజులు ఇంట్లో పెట్టుకోవడం వలన కూడా అనార్థాలు జరిగే అవకాశం ఉంది. కావున వీలైనంత త్వరగా సిలిండర్‌లను డీలర్‌లకు తిరిగి ఇచ్చేయాలి.
ఈవార్తను కూడా చదవండి: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు
ఈవార్తను కూడా చదవండి: Sarpanch: కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ఆత్మహత్య
ఈవార్తను కూడా చదవండి: AV Ranganath: కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తుంది!
ఈవార్తను కూడా చదవండి: వామ్మో...చలి
Read Latest Telangana News and National News
Updated Date - Nov 23 , 2024 | 11:26 AM