ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు..

ABN, Publish Date - Nov 10 , 2024 | 01:13 PM

‘నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు.. నాపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి.. నా భర్త, అత్త, నా భర్త మేనత్త కొడుకుపై జూబ్లీహిల్స్‌(Jubilee Hills) పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు’ అని బేగంపేట(Begumpet)లోని గ్రీన్‌పార్క్‌, మ్యారీగోల్డ్‌ హోటల్స్‌ డైరెక్టర్‌ దామోదర్‌రెడ్డి భార్య రచనారెడ్డి ఆరోపించారు.

- నాపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి

- జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయిస్తా

- ఆదాల దామోదర్‌రెడ్డి భార్య రచనారెడ్డి

హైదరాబాద్: ‘నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు.. నాపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి.. నా భర్త, అత్త, నా భర్త మేనత్త కొడుకుపై జూబ్లీహిల్స్‌(Jubilee Hills) పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు’ అని బేగంపేట(Begumpet)లోని గ్రీన్‌పార్క్‌, మ్యారీగోల్డ్‌ హోటల్స్‌ డైరెక్టర్‌ దామోదర్‌రెడ్డి భార్య రచనారెడ్డి ఆరోపించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో రచనారెడ్డి మాట్లాడుతూ.. తనకు ఆదాల దామోదర్‌రెడ్డితో 2022 డిసెంబర్‌ 4న వివాహం జరిగిందని, ఇది పెద్దలు కుదిర్చిన వివాహమని చెప్పారు. ఇద్దరికీ రెండో వివాహం అని పేర్కొన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు... ఏం జరిగిందంటే..


కొద్ది నెలల తర్వాత అత్త పార్వతి, భర్త దామోదర్‌రెడ్డి, భర్త మేనత్త కొడుకు గౌతమ్‌రెడ్డి నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయని తెలిపారు. తొమ్మిది నెలల క్రితం కట్టుబట్టలతో ఇంట్లో నుంచి వెల్లగొట్టారన్నారు. తరువాత తనకు విడాకుల నోటీస్‌ పంపించారని, తాను వారిపై గృహహింస కేసు పెట్టగా న్యాయస్థానం తనను అత్తవారింటికి వెళ్లొచ్చని చెప్పడంతో గత నెల 11న వెళ్లగా అక్కడ అన్ని గదులకూ తాళం వేసి ఉందని చెప్పారు. తాను మరోసారి హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ఆదేశాల మేరకు అత్త పార్వతి ఒక గది, బాత్‌ రూమ్‌కు తాళం తీసి వెళ్లిపోయారని, నెల రోజుల పాటు ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నానని తెలిపారు.


తాను ఈనెల 6న ఇంటి వద్దకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లగా, ఇంట్లోకి రానివ్వలేదని, తన వస్ర్తాలు, ఇతర సామగ్రిని బయటికి విసిరేశారని ఆమె తెలిపారు. బౌన్సర్లని పంపించి ఇంటి నుంచి బలవంతంగా పంపించడంతో పాటు తనపైన దాడిచేసి తన రెండు మొబైల్స్‌ లాక్కున్నారని ఆమె ఆరోపించారు. గాయపడ్డ తనను తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వచ్చి అపోలో హాస్పిటల్‌లో అడ్మిట్‌ చేశారని తెలిపారు.


తనపై దాడి చేసిన అత్తింటి వారిపై జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తనపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి, తన మొబైల్స్‌ ఇప్పించాలని ఆమె కోరారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, చర్యలు తీసుకోని పక్షంలో ఆదివారం పోలీస్ స్టేషన్‌ ఎదుట బైఠాయిస్తానని ఆమె తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: Minister PonnamPrabhakar: సమగ్ర కుటుంబ సర్వేపై ఆందోళన వద్దు.. మంత్రి పొన్నం ప్రభాకర్

ఈవార్తను కూడా చదవండి: KTR: విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా..: కేటీఆర్

ఈవార్తను కూడా చదవండి: Caste Census: తెలంగాణలో 243 కులాలు

ఈవార్తను కూడా చదవండి: Tummala: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 10 , 2024 | 01:14 PM