Hyderabad: ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ నిమజ్జనం.. ఆరోజు మధ్యాహ్నంలోపే
ABN, Publish Date - Sep 11 , 2024 | 08:47 AM
గతేడాది జరిగినట్లుగానే ఖైరతాబాద్ గణేషుడి(Khairatabad Ganesha) విగ్రహం నిమజ్జనాన్ని మధ్యాహ్నంలోపు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తామని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(Hyderabad City Police Commissioner CV Anand) స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం ఖైరతాబాద్ బడా గణేషున్ని దర్శించుకున్న సీపీ ప్రత్యేక పూజలు చేశారు.
- ఆ విధంగా ప్రణాళికలు
- పటిష్ట బందోబస్తుకు ఏర్పాట్లు
- గణనాథుడి అనుగ్రహంతోనే మరోసారి సీపీగా అవకాశం వచ్చింది : సీవీ ఆనంద్
హైదరాబాద్ సిటీ: గతేడాది జరిగినట్లుగానే ఖైరతాబాద్ గణేషుడి(Khairatabad Ganesha) విగ్రహం నిమజ్జనాన్ని మధ్యాహ్నంలోపు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తామని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(Hyderabad City Police Commissioner CV Anand) స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం ఖైరతాబాద్ బడా గణేషున్ని దర్శించుకున్న సీపీ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గణేష్ కమిటీతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉదయం 6 గంటలకు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యేలా చేసి విగ్రహాన్ని తరలించడానికి సన్నాహాలు చేస్తామని, 70 అడుగుల భారీ విగ్రహాన్ని మధ్యాహ్నం 1:30లోపు నిమజ్జనం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.
ఇదికూడా చదవండి: యాదాద్రి థర్మల్‌లో నేడు మహత్తర ఘట్టం
లక్షలాదిగా తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తామన్నారు. గణేష్ చతుర్థి రోజున హైదరాబాద్ సీపీగా నియమితులవడం చాలా సంతోషంగా ఉందని, ఆయన అనుగ్రహంతోనే మరోసారి సిటీ పోలీస్ కమిషనర్‌గా అవకాశం వచ్చిందని భావిస్తున్నానని తెలిపారు. తాను డీసీపీ(DCP)గా ఉన్నప్పటి నుంచి గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు సుదర్శన్ సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా గణేశ్ పండుగను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేస్తున్నామన్నారు. ఒక భక్తునిగా, ఒక హైదరాబాదీగా నన్ను ఆ వినాయకుడే ఇక్కడకు రప్పించాడన్నారు.
సౌత్‌జోన్‌లో పర్యటన
ఖైరతాబాద్‌లో పూజలు, సమావేశం అనంతరం సీపీ సెంట్రల్‌జోన్‌తో పాటు సౌత్‌జోన్‌లో పర్యటించారు. పురానీహవేలీలోని సౌత్‌జోన్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ అధికారులతో సమావేశం అయ్యారు. మిలాద్-ఉన్-నబీకి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, ఎస్పీ, టాస్క్‌ఫోర్స్ అధికారులతో సీపీ సమావేశమై బందోబస్తుకు సంబంధించిన సూచనలు చేశారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి:Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి:Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read LatestTelangana NewsandNational News
Updated Date - Sep 11 , 2024 | 08:47 AM