Hyderabad: రేపు ఖైరతాబాద్ గణేశ్ కర్రపూజ
ABN, Publish Date - Jun 16 , 2024 | 11:56 AM
ఖైరతాబాద్(Khairatabad) గణపతి తయారీ పనులను నిర్జల ఏకాదశి రోజు సోమవారం సాయంత్రం ఐదు గంటలకు కర్రపూజతో ప్రారంభిస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు.
హైదరాబాద్: ఖైరతాబాద్(Khairatabad) గణపతి తయారీ పనులను నిర్జల ఏకాదశి రోజు సోమవారం సాయంత్రం ఐదు గంటలకు కర్రపూజతో ప్రారంభిస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. శనివారం గణపతి ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటైన ఖైరతాబాద్ శ్రీ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎం.మహేందర్‌బాబు(M. Mahenderbabu) విలేకరులతో మాట్లాడారు.
ఇదికూడా చదవండి: Minister Ponnam: బోనాలకు ఘనంగా ఏర్పాట్లు: పొన్నం
ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్(Singari Sudarshan) పరమపదించిన అనంతరం ఉత్సవ నిర్వాహక కుటుంబసభ్యులతో కలిసి ఖైరతాబాద్ పుర ప్రముఖులతో కొత్త కమిటీని వేశామని తెలిపారు. ఇందులో నిర్వాహక కుటుంబం నుంచి సింగరి రాజ్‌కుమార్ చైర్మన్‌గా, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని తెలిపారు. కర్రపూజ కార్యక్రమానికి భక్తులు హాజరు కావాలని కోరారు.
దికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jun 16 , 2024 | 11:56 AM