ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: హైదరాబాద్‏కు కృష్ణా జలాలు నిలిపివేత...

ABN, Publish Date - Jun 27 , 2024 | 09:46 AM

హైదరాబాద్‌(Hyderabad) మహా నగరానికి ఫేజ్‌2లోని కృష్ణా జలాలను నిలిపివేశారు. పంపింగ్‌లో తొలిసారిగా నీటి ఒత్తిడికి నాన్‌ రిటర్న్‌ వాల్వ్‌ ఎగిరిపోయి పూర్తిగా ధ్వంసమైంది. దీంతో నీరంతా కోదండాపూర్‌ పంపింగ్‌ హౌస్‌ ప్రాంతానికి చేరింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది నగరానికి అత్యవసరంగా కృష్ణా జలాలు ఫేజ్‌-2 నీటి సరఫరాను నిలిపివేశారు.

- ఒత్తిడి ఎక్కువై ఫేజ్‌-2లో ఎగిరిపోయిన నాన్‌ రిటర్న్‌ వాల్వ్‌

- కొనసాగుతున్న మరమ్మతు పనులు

- పలు ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌(Hyderabad) మహా నగరానికి ఫేజ్‌2లోని కృష్ణా జలాలను నిలిపివేశారు. పంపింగ్‌లో తొలిసారిగా నీటి ఒత్తిడికి నాన్‌ రిటర్న్‌ వాల్వ్‌ ఎగిరిపోయి పూర్తిగా ధ్వంసమైంది. దీంతో నీరంతా కోదండాపూర్‌ పంపింగ్‌ హౌస్‌ ప్రాంతానికి చేరింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది నగరానికి అత్యవసరంగా కృష్ణా జలాలు ఫేజ్‌-2 నీటి సరఫరాను నిలిపివేశారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు ప్రారంభించారు. గురువారం రాత్రి వరకు పనులు కొనసాగే అవకాశాలున్నాయి.

ఇదికూడా చదవండి: Patancheru: మహిపాల్‌రెడ్డి చూపు.. బీజేపీ వైపు?


హైదరాబాద్‌ మహానగరానికి నాగార్జునసాగర్‌ నుంచి కృష్ణా డ్రింకింగ్‌ వాటర్‌ సప్లై స్కీమ్‌ ఫేజ్‌-1, ఫేజ్‌-2, ఫేజ్‌-3లలో నీటిని తరలిస్తున్నారు. రోజూ దాదాపు 1255 మిలియన్‌ లీటర్ల నీళ్లు నగరానికి వస్తున్నాయి. మహా నగరంలో అత్యధిక ప్రాంతాలకు జీవనాధారంగా కృష్ణా జలాలున్నాయి. నాగార్జునసాగర్‌లో ప్రస్తుత నీటిమట్టం 510 అడుగుల కంటే దిగువకు చేరిన నేపథ్యంలో నెల క్రితమే అత్యవసర పంపింగ్‌ను ప్రారంభించారు. కాగా, కోదండాపూర్‌లోని వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లో నీటిని శుద్ధి చేసిన తర్వాత హైదరాబాద్‌కు పంపింగ్‌ చేసే క్రమంలో ఆ లైన్‌కు గల నాన్‌ రిటర్న్‌ వాల్వ్‌ తీవ్ర ఒత్తిడికి గురైంది. ఒక్కసారిగా భారీ శబ్ధంతో ధ్వంసం కావడంతో నీటి సరఫరాకు ఆటంకం తలెత్తింది. వెంటనే కృష్ణా ఫేజ్‌-2 జలాలను అధికారులు నగరానికి నిలిపివేశారు. వాటర్‌బోర్డు ఉన్నతస్థాయి అధికారులు, ట్రాన్స్‌మిషన్‌ అధికారులు అత్యవసరంగా కోదండాపూర్‌కు వెళ్లి మరమ్మతు పనులను పర్యవేక్షిస్తున్నారు. గురువారం మరమ్మతు పనులు పూర్తి చేసి హైదరాబాద్‌కు యధావిధిగా నీటి సరఫరా చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.

ఇదికూడా చదవండి: Harish Rao: గురుకుల అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలి..


నిలిచిన నీటి సరఫరా

కృష్ణా ఫేజ్‌-2లో తలెత్తిన సమస్య కారణంగా మరమ్మతు పనులు సాగుతుండడంతో వాటర్‌బోర్డు ఆపరేషన్‌ మెయింటెనెన్స్‌ డివిజన్లలో 2, 3, 4, 5, 7, 9, 10(ఏ), 10(బీ), 13, 14, 16, 20 పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. గురువారం కూడా తాగునీటి సరఫరాలో అంతరాయం తలెత్తనుంది. కొన్ని ప్రాంతాలకు పూర్తిగా, కొన్ని ప్రాంతాలకు పాక్షికంగా నీటి సరఫరాలో అంతరాయాలు ఏర్పడనున్నాయి. ప్రధానంగా మీరాలం, ఎన్‌పీఏ, బాలాపూర్‌, మైసారం, బార్కాస్‌ భోజగుట్ట, ఆళ్లబండ, మేకలమండి, భోలక్‌పూర్‌, చిలకలగూడ, తార్నాక, లాలాపేట్‌, బౌద్ధనగర్‌, మారేడుపల్లి, కంట్రోల్‌రూమ్‌(Maredupalli, Control Room), రైల్వేస్‌, ఎంఈఎస్‌, కంటోన్మెంట్‌, ప్రకాశ్‌నగర్‌, పాటిగడ్డ, హస్మత్‌పేట్‌, ఫిరోజ్‌గూడ, గౌతమ్‌నగర్‌, వైశాలినగర్‌, బీఎన్‌రెడ్డినగర్‌, వనస్థలిపురం, ఆటోనగర్‌, అల్కపురికాలనీ, మహేంద్రహిల్స్‌, ఏలుగుట్ట, రామంతాపూర్‌, ఉప్పల్‌, నాచారం, హబ్సిగూడ, చిల్కానగర్‌, బీరప్పగడ్డ, బుద్వేల్‌, శాస్ర్తిపురం, మీర్‌పేట్‌, బడంగ్‌పేట్‌, శంషాబాద్‌ తదితర ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని, వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 27 , 2024 | 09:46 AM

Advertising
Advertising