ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: 24న నగరానికి కృష్ణాజలాలు బంద్‌..

ABN, Publish Date - Oct 22 , 2024 | 07:27 AM

ఈనెల 24న నగరంలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరాలో 24 గంటల పాటు అంతరాయం తలెత్తనున్నది. హైదరాబాద్‌(Hyderabad) మహా నగరానికి తాగునీటిని సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్‌ వాటర్‌ సరఫరా ఫేజ్‌-3లోని 2375 ఎంఎం డయా ఎంఎస్‌ పంపింగ్‌ మెయిన్‌ పైపులైనుకు లీకేజీ ఏర్పడింది.

- ఆ ప్రాంతవాసులకు పొదుపు చర్యలు అవసరం

హైదరాబాద్‌ సిటీ: ఈనెల 24న నగరంలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరాలో 24 గంటల పాటు అంతరాయం తలెత్తనున్నది. హైదరాబాద్‌(Hyderabad) మహా నగరానికి తాగునీటిని సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్‌ వాటర్‌ సరఫరా ఫేజ్‌-3లోని 2375 ఎంఎం డయా ఎంఎస్‌ పంపింగ్‌ మెయిన్‌ పైపులైనుకు లీకేజీ ఏర్పడింది. లీకేజీని అరికట్టడానికి ఈ నెల 24న ఉదయం ఆరు గంటల నుంచి మరుసటి రోజు (25వ తేదీ) ఉదయం ఆరు గంటల వరకు మరమ్మతు పనులు చేపట్టనున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Gajwel: హరీశ్‌రావు చెప్పినవన్నీ అబద్ధాలే


ఈ నేపథ్యంలో నగరానికి కృష్ణా ఫేజ్‌-3 నుంచి వచ్చే జలాలను 24గంటల పాటు బంద్‌ చేయనున్నట్లు వాటర్‌బోర్డు అధికారులు సోమవారం ప్రకటించారు. దీనివల్ల శాస్త్రీపురం, బండ్లగూడ, భోజగుట్ట, షేక్‌పేట్‌, ఆళ్లబండ, జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, ప్రశాసన్‌నగర్‌, తట్టిఖానా, లాలాపేట్‌, సాహెబ్‌నగర్‌, ఆటోనగర్‌, సరూర్‌నగర్‌, వాసవి రిజర్వాయర్లు, సైనిక్‌పురి, మౌలాలి, గచ్చిబౌలి, మాదాపూర్‌, అయ్యప్ప సొసైటీ(Gachibowli, Madapur, Ayyappa Society), కావూరిహిల్స్‌, స్నేహపురి, కైలాసగిరి, దేవేంద్రనగర్‌, మధుబన్‌,


దుర్గానగర్‌, బుద్వేల్‌, సులేమాన్‌నగర్‌, గోల్డెన్‌హైట్స్‌, 9 నంబర్‌, కిస్మత్‌పూర్‌, గంధంగూడ, బోడుప్పల్‌, మల్లికార్జుననగర్‌, మాణిక్‌చంద్‌, చెంగిచెర్ల(Manikchand, Chengicherla), భరత్‌నగర్‌, ఫీర్జాదిగూడ, పెద్ద అంబర్‌పేట్‌, ధర్మసాయి (శంషాబాద్‌) రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోనుంది. ఆయా ప్రాంతాల వినియోగదారులు గమనించి నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు.


ఇదికూడా చదవండి: Real Estate: ప్రభుత్వ అనుమతులుంటే కూల్చరు!

ఇదికూడా చదవండి: KTR : రేవంత్‌ చెప్పేవి పచ్చి అబద్ధాలు!

ఇదికూడా చదవండి: TGSPDCL: కరెంటు అంతరాయమా.. డయల్‌ 1912

ఇదికూడా చదవండి: Thummala: రుణమాఫీ చేసి తీరుతాం.. ఏ ఒక్క రైతు అధైర్యపడొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 22 , 2024 | 07:30 AM