Hyderabad: మెదక్ సర్కిల్ శివంపేట సెక్షన్ ఏఈ సస్పెన్షన్..
ABN, Publish Date - Sep 11 , 2024 | 10:37 AM
అవినీతి ఆరోపణలపై దక్షిణ డిస్కం చర్యలు ప్రారంభించింది. మెదక్ సర్కిల్ శివంపేట్ సెక్షన్ అసిస్టెంట్ ఇంజనీర్ బి.దుర్గాప్రసాద్(B. Durgaprasad)ను సస్పెండ్ చేస్తూ రూరల్ జోన్ చీఫ్ ఇంజనీర్ పి.భిక్షపతి మంగళవారం ఆదేశాలు జారీచేశారు.
- అవినీతి ఆరోపణలపై దక్షిణ డిస్కం చర్యలు
హైదరాబాద్ సిటీ: అవినీతి ఆరోపణలపై దక్షిణ డిస్కం చర్యలు ప్రారంభించింది. మెదక్ సర్కిల్ శివంపేట్ సెక్షన్ అసిస్టెంట్ ఇంజనీర్ బి.దుర్గాప్రసాద్(B. Durgaprasad)ను సస్పెండ్ చేస్తూ రూరల్ జోన్ చీఫ్ ఇంజనీర్ పి.భిక్షపతి మంగళవారం ఆదేశాలు జారీచేశారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రధాన కార్యాలయంలోని ప్రత్యేక సెల్‌కు వచ్చే ఫిర్యాదులపై సంస్థ చర్యలు మొదలు పెట్టింది.
ఇదికూడా చదవండి: Hyderabad: విద్యుత్ డిమాండ్ 20 కిలోవాట్లు దాటితే ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్
ఓ పనికి సంబంధించి ఎస్టిమేట్ తయారు చేసి, వర్క్ ఆర్డర్ రిలీజ్ చేసేందుకు ఏఈ దుర్గాప్రసాద్(AE Durgaprasad) లంచం డిమాండ్ చేస్తున్నాడని ఫిర్యాదు అందింది. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ చేసిన అధికారులు ఆరోపణలు నిజమని తేలడంతో చర్యలు తీసుకున్నారు. విద్యుత్‌సంస్థలో అవినీతిని సహించబోమని, ఎవరైనా సిబ్బంది, అధికారులు ఏదైనా పనికి లంచం అడిగితే 040-2345 4884, 7680901912కు ఫోన్ చేసి తెలియజేయాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు.
.......................................................
ఈ వార్తను కూడా చదవండి:
........................................................
Hyderabad: జైళ్లలో డ్రగ్స్ నిరోధానికి స్నిఫర్ డాగ్స్‌తో తనిఖీలు
- ఆ శాఖ డీజీ సౌమ్యమిశ్రా
హైదరాబాద్: జైళ్లలో ఖైదీల డ్రగ్స్ వినియోగాన్ని నిరోధించేందుకు స్నిఫర్ డాగ్స్ తో తనిఖీలు నిర్వహిస్తున్నామని ఆ శాఖ డీజీ సౌమ్య మిశ్రా(DG Soumya Mishra) తెలిపారు. చంచల్‌గూడలోని జైళ్ల శాఖ కార్యాలయంలో మంగళవారం ‘డ్రగ్స్, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, నిరోధంపై అవగాహన’ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ‘జైళ్లను డ్రగ్స్ రహితంగా చేసేందుకు ఇప్పటికే డాగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశాం. డ్రగ్స్‌కు బానిసలై జైల్లోకి వచ్చిన ఖైదీలకు ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో వైద్యం అందిస్తున్నాం’ అని చెప్పారు.
టీజీ న్యాబ్ డైరక్టర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ.. జైళ్లలో డ్రగ్స్ నిరోధానికి అధికారులు, సిబ్బంది, పోలీసుశాఖ సమష్టిగా బాధ్యత తీసుకోవాలని సూచించారు. అనంతరం జైలు అధికారులు, సిబ్బందికి నూతన క్రిమినల్ చట్టాలపై అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులను సౌమ్యమిశ్రా(Soumyamishra) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ ఐజీలు రాజేష్, మురళీబాబు, డీఐజీ డాక్టర్ శ్రీనివాస్, సంపత్, జైలు సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి:Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి:Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read LatestTelangana NewsandNational News
Updated Date - Sep 11 , 2024 | 10:37 AM