Hyderabad: పట్టాలపై పరేషాన్.. మెట్రో రాకపోకల్లో అంతరాయం
ABN, Publish Date - Nov 05 , 2024 | 10:15 AM
ఉరుకులు పరుగులతో సోమవారం ఉదయం ఆఫీసులకు బయలుదేరిన నగరవాసులకు మెట్రోరైలు(Metro Rail) షాకిచ్చింది. సాంకేతిక లోపంతో పలు మార్గాల్లో రైలు నిలిచిపోవడం, స్టేషన్లలో డోర్లు తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. బ్లూలైన్‌లోని నాగోలు-రాయదుర్గం కారిడార్‌లో సోమవారం ఉదయం 9.55 నిమిషాలకు బేగంపేట నుంచి అమీర్‌పేట(Begumpet to Ameerpet)కు బయలుదేరిన రైలు మధ్యలో ఆగిపోయింది. దా
- ఉదయం ఆఫీసు వేళల్లో పలుమార్లు నిలిచిన రైళ్లు
- బేగంపేట-అమీర్‌పేట మార్గంలో 15 నిమిషాలు..
- మలక్‌పేట, మూసారాంబాగ్‌లోనూ ఇదే తరహా సమస్య
- స్టేషన్లలో డోర్లు తెరుచుకోక ప్రయాణికుల ఆందోళన
హైదరాబాద్ సిటీ: ఉరుకులు పరుగులతో సోమవారం ఉదయం ఆఫీసులకు బయలుదేరిన నగరవాసులకు మెట్రోరైలు(Metro Rail) షాకిచ్చింది. సాంకేతిక లోపంతో పలు మార్గాల్లో రైలు నిలిచిపోవడం, స్టేషన్లలో డోర్లు తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. బ్లూలైన్‌లోని నాగోలు-రాయదుర్గం కారిడార్‌లో సోమవారం ఉదయం 9.55 నిమిషాలకు బేగంపేట నుంచి అమీర్‌పేట(Begumpet to Ameerpet)కు బయలుదేరిన రైలు మధ్యలో ఆగిపోయింది. దాదాపు 15 నిమిషాలపాటు పట్టాలపై నిలిచిపోవడంతో అంతా పరేషాన్ అయ్యారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: అయ్యోపాపం. ఎంతఘోరం.. పాఠశాల గేటు పడి విద్యార్థి దుర్మరణం
సమాచారం అందుకున్న అధికారులు సమస్యను పరిష్కరించడంతో ఊపిరి పీల్చుకున్నారు. అంతకు ముందు ఇదే రైలు పరేడ్‌గ్రౌండ్ స్టేషన్ వచ్చే ముందు 15 నిమిషాలు ఆగిపోయినట్లు ప్రయాణికులు తెలిపారు. బేగంపేటలో మళ్లీ రైలు నిలిచిపోవడంతో ఆందోళన చెందామని చెప్పారు. కాగా, విద్యుత్ ఫీడర్ ఛానల్‌లో సాంకేతిక సమస్య వల్లే బేగంపేట వద్ద రైలు ఆగిందని అధికారులు తెలిపారు.
ఎక్కడికక్కడ నిలిచిన రైళ్లు
పరేడ్‌గ్రౌండ్, బేగంపేట-అమీర్‌పేట స్టేషన్ల మధ్య రైలు ఆగిపోవడంతో ఇటు నాగోలు-రాయదుర్గం (బ్లూలైన్), అటు మియాపూర్- ఎల్‌బీనగర్ (రెడ్‌లైన్) కారిడార్లలో బయలుదేరిన రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉదయం 10 నుంచి 10.30 గంటల పాటు పలు రైళ్లు స్టేషన్లలో ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కాగా, మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్‌కు వెళ్తున్న మెట్రోరైలు మూసారాంబాగ్ స్టేషన్‌కు వచ్చిన కొద్ది సేపటికి సాంకేతిక సమస్యతో స్టేషన్‌లోనే నిలిచిపోయింది. మూసారాంబాగ్ నుంచి బయలుదేరేందుకు సిద్ధమైన రైలు తలుపులు మూతపడిన కొద్ది సేపటికి స్టేషన్‌లోనే నిలిచిపోయింది.
సాంకేతిక సమస్యల వల్ల రైలు నిలిచిపోయిందని, అందుకు చింతిస్తున్నామని వాయిస్ మెసేజ్ రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. తర్వాత 2 నిమిషాలకు రైలు కదిలింది. ఇదే రైలు మలక్‌పేట్ స్టేషన్‌కు చేరుకున్న తర్వాత కూడా నిలిచిపోయింది. 11.30 గంటల సమయంలో ఇక్కడ రైలు ఆగినట్లు ప్రయాణికులు తెలిపారు. కాగా, రైళ్లు ఆగిపోవడంతో ఎల్‌బీనగర్, నాగోల్, ఉప్పల్, బేగంపేట్, అమీర్‌పేట్(Nagol, Uppal, Begumpet, Ameerpetc), పెద్దమ్మగుడి, జేఎన్‌టీయూ, హైటెక్‌సిటీ, మియాపూర్ స్టేషన్లలో వేలాది మంది ఫ్లాట్‌ఫారాలపై నిరీక్షించారు. అమీర్‌పేట స్టేషన్‌లో రద్దీ ఎక్కువ కావడంతో ఫ్లాట్‌ఫారాల పైకి చాలామందిని అనుమతించలేదని తెలిసింది. బేగంపేట, అమీర్‌పేట, మూసారాంబాగ్, మలక్‌పేట తదితర స్టేషన్లకు రైలు వచ్చిన నిమిషం వరకు డోర్లు తెరుచుకోకపోవడంతో ఆందోళనకు గురయ్యామని కొంతమంది ప్రయాణికులు తెలిపారు.
సమస్యను పరిష్కరించాం
బేగంపేట-రాయదుర్గం మార్గంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అమీర్‌పేట, మియాపూర్, నాగోలు రూట్‌లో మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. దాదాపు 15 నిమిషాలపాటు రైళ్లు ఆగిపోయాయి. సమస్యను పరిష్కరించి సకాలంలో రైళ్లను పునరుద్ధరించాం.
- ఎన్వీఎస్ రెడ్డి, మెట్రో రైల్ ఎండీ
ఈవార్తను కూడా చదవండి: Unsafe Abortions: విచ్చలవిడిగా గర్భవిచ్ఛిత్తి!
ఈవార్తను కూడా చదవండి: 24 గంటల విద్యుత్ అంటూ మోసం: హరీశ్‌రావు
ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్, హరీశ్ ఇళ్ల ముందు ధర్నా చేయండి
ఈవార్తను కూడా చదవండి: అసంక్రమిత వ్యాధులకు ప్రత్యేక క్లినిక్‌లు
Read Latest Telangana News and National News
Updated Date - Nov 05 , 2024 | 10:15 AM