ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ‘గీతం’ విద్యార్థికి రూ.60 లక్షల వేతనం

ABN, Publish Date - Nov 07 , 2024 | 11:38 AM

గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం(Geetam Deemed University) మరోసారి ప్రాంగణ నియామకాల్లో మేటిగా నిరూపించుకుంది. ప్రతిష్టాత్మక బహుళజాతి సంస్థల భాగస్వామ్యంతో విశేష విజయాలను ప్రదర్శిస్తూ, 2024-25 విద్యా సంవత్సరానికి ప్రాంగణ నియామకాల్లో మరోసారి తన సత్తా చాటింది. అత్యధిక గరిష్ఠ వార్షిక వేతనం రూ.60 లక్షలతో ఒక విద్యార్థిని ఎంపిక కాగా, మరో ఇద్దరు రూ.51 లక్షల గరిష్ఠ వార్షికవేతనానికి ఎంపికయ్యారు.

- రూ.51 లక్షల వార్షిక వేతనంతో మైక్రోసాఫ్ట్‏కు ఎంపికైన మరో ఇద్దరు విద్యార్థులు

పటాన్‌చెరు(హైదరాబాద్): గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం(Geetam Deemed University) మరోసారి ప్రాంగణ నియామకాల్లో మేటిగా నిరూపించుకుంది. ప్రతిష్టాత్మక బహుళజాతి సంస్థల భాగస్వామ్యంతో విశేష విజయాలను ప్రదర్శిస్తూ, 2024-25 విద్యా సంవత్సరానికి ప్రాంగణ నియామకాల్లో మరోసారి తన సత్తా చాటింది. అత్యధిక గరిష్ఠ వార్షిక వేతనం రూ.60 లక్షలతో ఒక విద్యార్థిని ఎంపిక కాగా, మరో ఇద్దరు రూ.51 లక్షల గరిష్ఠ వార్షికవేతనానికి ఎంపికయ్యారు.

ఈ వార్తను కూడా చదవండి: MLA: నమ్మించి మోసం చేశారు.. తులం బంగారం వెంటనే ఇవ్వాలి


బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థిని యర్రం అనూష అట్లాసియన్‌లో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా గౌరవనీయమైన స్థానాన్ని సంపాదించుకుని, రూ.60 లక్షల వార్షిక వేతనాన్ని పొందనుంది. అంతేగాక, తన తోటి విద్యార్థిని కొర్రపాటి సమీనాతో కలిసి మైక్రోసా్‌ఫ్టలో రూ.51లక్షల వార్షిక వేతనంతో సాఫ్ట్‌ వేర్‌ డెవలపర్‌గా ఎంపికైంది.


సిలికాన్‌ల్యాబ్‌ గీతం విద్యార్థి ఒకరిని రూ.22 లక్షల వార్షిక వేతనానికి ఎంపిక చేయగా, పెగా సిస్టమ్స్‌ ఏడుగురు విద్యార్థులకు రూ.15.48 లక్షలు, డెలివరూ ముగ్గురుకి రూ.12.07 లక్షలు, ఒరాకిల్‌ ఐదుగురికి రూ.10 లక్షలు, రిలయన్స్‌ జియో బీపీ ఒక విద్యార్థికి రూ.9 లక్షలు, డెలాయిట్‌ పీపీవో ఐదుగురికి రూ.8.64 లక్షలు, ఏషియన్‌ పెయింట్స్‌ ముగ్గురుకి రూ.8.5 లక్షలు, ఐసీఐసీఐ బ్యాంక్‌ 14 మందికి రూ.8.29 లక్షలు, నౌకరీ.కామ్‌ ఒక్కరికి రూ.7 లక్షలు, పీజీఎస్‌ ముగ్గురు విద్యార్థులకు రూ.8 లక్షలు, కీలూప్‌ ఆరుగురికి రూ.7.2 లక్షలు, వయాప్లస్‌ ఐదుగురికి రూ.7 లక్షలు, హెచ్‌ అండ్‌ ఆర్‌ బ్లాక్‌ నలుగురుకి రూ.5.27 లక్షలు,


మ్యూసిగ్మా 17మందికి రూ.5 లక్షలు, ఈవై జీడీఎస్‌ 49 మందికి రూ.4.83 లక్షలు, యాక్సెంచర్‌ 92 మందికి రూ.4.5 లక్షలు, టెక్‌ మహీంద్రా 85 మంది విద్యార్థులను రూ.4 లక్షల వార్షిక వేతనానికి ఎంపిక చేశాయి. కెరీర్‌ గైడెన్స్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మమతారెడ్డి ప్రస్తుత ప్లేస్‌ మెంట్‌ సీజన్‌పై మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది మా ప్రాంగణ నియామకాలను అట్లాసియన్‌, మైక్రోసాఫ్ట్‌, సిలికాన్‌ ల్యాబ్స్‌, పెగా సిస్టమ్స్‌ వంటి ప్రముఖ బహుళ జాతి కంపెనీలతో ప్రారంభించడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.


ఈవార్తను కూడా చదవండి: యాదగిరిగుట్ట ఆలయంలో కుంగిన ఫ్లోరింగ్‌!

ఈవార్తను కూడా చదవండి: కేశవాపురం వద్దు.. మేఘా కాంట్రాక్టు రద్దు

ఈవార్తను కూడా చదవండి: అరుణాచల ప్రదక్షిణకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ఈవార్తను కూడా చదవండి: తీన్మార్ మల్లన్నకు స్ట్రాంగ్ వార్నింగ్

Read Latest Telangana News and National News

Updated Date - Nov 07 , 2024 | 11:38 AM