ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad : 8 ఏళ్లుగా కిలోల కొద్దీ కొకైన్‌ విక్రయం

ABN, Publish Date - Jul 17 , 2024 | 03:49 AM

ఉచెన్నా.. ఎజియోనిలి ఫ్రాంక్లిన్‌ ఉచెన్నా అలియాస్‌ కలేషీ..! ఎనిమిదేళ్లుగా హైదరాబాద్‌ నగరంలోనే తిష్ట వేశాడు. నైజీరియా నుంచి డ్రగ్స్‌ తెప్పించి.. నగరంలో విక్రయించాడు.

  • నైజీరియన్‌ స్మగ్లర్‌ ఫ్రాంక్లిన్‌ తీరు

  • అయినా.. పట్టుబడని వైనం

  • తాజా కేసులోనూ పరారీలోనే..

హైదరాబాద్‌ సిటీ, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ఉచెన్నా.. ఎజియోనిలి ఫ్రాంక్లిన్‌ ఉచెన్నా అలియాస్‌ కలేషీ..! ఎనిమిదేళ్లుగా హైదరాబాద్‌ నగరంలోనే తిష్ట వేశాడు. నైజీరియా నుంచి డ్రగ్స్‌ తెప్పించి.. నగరంలో విక్రయించాడు. పకడ్బందీగా పెడ్లర్ల నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకుని, ఈ ఎనిమిదేళ్లలో రూ. కోట్లు విలువ చేసే కిలోల కొద్దీ కొకైన్‌ను విక్రయించాడు. ఈ ఎనిమిదేళ్లలో ఎన్నడూ పోలీసులకు పట్టుబడకపోవడం గమనార్హం..! సోమవారం రాజేంద్రనగర్‌ పోలీసులు, టీజీ న్యాబ్‌ జా యింట్‌ ఆపరేషన్‌లో భారీ ఎత్తున డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ను ఛేదించిన విషయం తెలిసిందే..! ఈ కేసులో అరెస్టయిన ఐదుగురిని పోలీసులు మంగళవారం కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు.

సన్‌సిటీలోనే మకాం..

2017లో ఉచెన్నా హైదరాబాద్‌ వచ్చాడు. అప్పటి నుంచి బండ్లగూడ పరిధిలోని సన్‌సిటీలో మకాం వేసి, డ్రగ్స్‌ విక్రయాలు చేసేవాడు. ఇటీవల హైదర్షాకోట్‌లోని విశాఖనగర్‌ వ్యూ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతను నగరానికి వచ్చిన కొత్తల్లో నైజీరియాకు చెందిన ఘరానా స్మగ్లర్‌ డివైన్‌ ఎబూకా సుజీ అలియాస్‌ ఇమ్మాన్యుయెల్‌ నెట్‌వర్క్‌లో చేరాడు. నగరంలో డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ వ్యవహారాలను పర్యవేక్షించేవాడు.

ఇతనికి బెంగళూరులో పరిచయమైన నైజీరియన్‌ మహిళ ఒనూహ బ్లెస్సింగ్‌ అలియాస్‌ జోయానాగోమ్స్‌తో పరిచయం ఏర్పడింది. ఉచెన్నా ఆమెను గోవా, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో డ్రగ్స్‌ సరఫరాకు నియమించాడు. ఎబూకా నైజీరియాకు తిరిగి వెళ్లిపోయాక.. హైదరాబాద్‌ డ్రగ్స్‌ సామ్రాజ్యానికి ఉచెన్నా నాయకుడయ్యాడు. ఆ తర్వాత నగరంలో పకడ్బందీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. నైజీరియా నుంచి సముద్రమార్గంలో వచ్చే కొకైన్‌ను తొలుత ఢిల్లీకి, ఆ తర్వాత జోయానాగోమ్స్‌ ద్వారా విమానాలు లేదా రైళ్లలో హైదరాబాద్‌కు తెప్పించేవాడు.

అరెస్టుకు ఆమడ దూరం?

ఉచెన్నా గడిచిన ఎనిమిదేళ్లలో హైదరాబాద్‌ నగరంలో రూ.కోట్లు విలువ చేసే కిలోల కొద్దీ కొకైన్‌ను విక్రయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతని నెట్‌వర్క్‌లో ఉన్న ఒక పెడ్లర్‌-- సత్య వెంకట గౌతమ్‌ కేవలం 7 నెలల్లో 2.6 కిలోల కొకైన్‌ను విక్రయించాడు. దీన్ని బట్టి ఉచెన్నా ఏ స్థాయిలో డ్రగ్స్‌ను విక్రయించాడో అంచనావేయవచ్చని పోలీసులు చెబుతున్నారు. అయినా.. ఇప్పటికీ ఉచెన్నా ఒక్కసారి కూడా పోలీసులకు పట్టుబడకపోవడం గమనార్హం..!

అమన్‌ ప్రీత్‌సింగ్‌ కాంటాక్టులపై నజర్‌

డ్రగ్స్‌ కేసులో వినియోగదారుడిగా పోలీసులకు పట్టుబడ్డ సినీ నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ సోదరుడు అమన్‌ ప్రీత్‌ సింగ్‌ ద్వారా సినీ ఇండస్ట్రీ లింకులను రాబట్టేందుకు టీజీ న్యాబ్‌ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అతని సెల్‌ఫోన్‌ కాల్‌ డేటా రికార్డు(సీడీఆర్‌)ను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

Updated Date - Jul 17 , 2024 | 03:49 AM

Advertising
Advertising
<