Hyderabad: ‘జంట’గా గంజాయి విక్రయాలు..
ABN, Publish Date - Oct 02 , 2024 | 09:15 AM
ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట నేరాలబాట పట్టింది. డబ్బు సంపాదన కోసం గంజాయి విక్రయిస్తూ చివరకు పోలీసులకు పట్టుబడి కటకటాలపాలైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా మాచర్ల(Macharla)కు చెందిన యాపర్తి గోపి(25), ఉమాహేశ్వరి(24) ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
- డబ్బు సంపాదన కోసం చిన్నచిన్న ప్యాకెట్లలో అమ్మకం
- ప్రేమించి పెళ్లి చేసుకొని, చివరకు కటకటాల్లోకి..
హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట నేరాలబాట పట్టింది. డబ్బు సంపాదన కోసం గంజాయి విక్రయిస్తూ చివరకు పోలీసులకు పట్టుబడి కటకటాలపాలైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా మాచర్ల(Macharla)కు చెందిన యాపర్తి గోపి(25), ఉమాహేశ్వరి(24) ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చిన్నచిన్న పనులు చేసినా ఆదాయం చాలలేదు. గంజాయి సరఫరా చేసే బంధువు శివనాగరాజు వారికి పరిచయమయ్యాడు. అతడు 2 కేజీల నుంచి 5 కేజీల వరకు హోల్‌సేల్‌గా గంజాయి విక్రయించేవాడు.
దాన్ని 200 గ్రాముల ప్యాకెట్లుగా మార్చి స్కూటీపై దంపతులిద్దరూ హైదరాబాద్(Hyderabad)కు వచ్చి, విక్రయించి వెళ్లిపోయేవారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌వోటీ పోలీసులు ఎల్‌బీనగర్ మెట్రోస్టేషన్(LB Nagar Metro Station) వద్ద కాపుకాసి గంజాయి విక్రయిస్తున్న గోపి, ఉమాహేశ్వరి దంపతులతోపాటు కొనుగోలు చేస్తున్న నాగోలుకు చెందిన ప్రభుచరణ్(23), నగేష్(24)లను అదుపులోకి తీసుకొని ఎల్‌బీనగర్ పోలీసులకు అప్పగించారు. వారి నుంచి సుమారు కిలో గంజాయి, 3 సెల్‌ఫోన్లు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం దర్యాప్తు చేస్తున్నారు.
......................................................................
ఈ వార్తను కూడా చదవండి:
.......................................................................
Hyderabad: మళ్లీ చికున్‌గున్యా.. నగరంలో పెరుగుతున్న కేసులు
- అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ
- రేపటి నుంచి స్పెషల్ డ్రైవ్
హైదరాబాద్ సిటీ: గ్రేటర్‌పై మళ్లీ చికున్‌గున్యా(Chikungunya) పంజా విసురుతోంది. ఇప్పటికే డెంగీ(Dengue)తో ప్రజలు అల్లాడుతుండగా, తాజాగా చికున్‌గున్యా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని జీహెచ్‌ఎంసీ(GHMC) నిర్ణయించింది.
దోమల తీవ్రత తగ్గేలా యాంటీలార్వా ఆపరేషన్ విస్తృతం చేయాలని, కేసు నమోదైన ఇంటి చుట్టూ ఉన్న 50 నుంచి 100 ఇళ్లలో సర్వే చేసి దోమల ఉత్పత్తి జరుగుతోందా ? లేదా ? పరిశీలించాలని కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్(Hyderabad, Rangareddy, Sangareddy, Medchal) జిల్లాల వైద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసుకొని అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఇదికూడా చదవండి: హూక్కా సెంటర్‌పై పోలీసుల దాడులు..
ఇదికూడా చదవండి: రేవంత్ సర్కారు.. ఇక ఇంటికే
ఇదికూడా చదవండి: దసరాకు ఏపీఎస్ ఆర్టీసీ 1,200 ప్రత్యేక బస్సులు
ఇదికూడా చదవండి: చీపుర్లు, రోకళ్లతో సిద్ధంగా ఉండండి
Read Latest Telangana News and National News
Updated Date - Oct 02 , 2024 | 09:15 AM