ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: విద్యుత్‌ డిమాండ్‌ 20 కిలోవాట్లు దాటితే ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్‌

ABN, Publish Date - Sep 11 , 2024 | 10:00 AM

విద్యుత్‌ డిమాండ్‌ 20 కిలోవాట్లకు పైగా ఉండే అపార్ట్‌మెంట్లకు(Apartments) ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటును తప్పనిసరి చేస్తూ దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ చర్యలు తీసుకుంటోంది. తద్వారా మిగతా వాటిపై లోడ్‌ తగ్గించి విద్యుత్‌ అంతరాయాలకు చెక్‌ పెట్టాలని భావిస్తోంది.

- తప్పనిసరి చేస్తూ డిస్కం ఆదేశాలు

- ఓవర్‌లోడ్‌ తగ్గించడంపై దృష్టి

- సర్కిళ్లు, డివిజన్ల వారీగా లెక్కలు తీస్తున్న సంస్థ

- అపార్ట్‌మెంట్లకు నేరుగా ఇచ్చిన కనెక్షన్లపై ఆరా

- గ్రేటర్‌లో 1.85 లక్షల విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు

హైదరాబాద్‌ సిటీ: విద్యుత్‌ డిమాండ్‌ 20 కిలోవాట్లకు పైగా ఉండే అపార్ట్‌మెంట్లకు(Apartments) ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటును తప్పనిసరి చేస్తూ దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ చర్యలు తీసుకుంటోంది. తద్వారా మిగతా వాటిపై లోడ్‌ తగ్గించి విద్యుత్‌ అంతరాయాలకు చెక్‌ పెట్టాలని భావిస్తోంది. ఈమేరకు సర్కిళ్లు, డివిజన్ల వారీగా లెక్కలు తీస్తోంది. గచ్చిబౌలి(Gachibowli) పరిధిలోని గోపన్‌పల్లి జర్నలిస్ట్‌కాలనీ, మోతీనగర్‌, యూసు్‌ఫగూడ కృష్ణానగర్‌, రామంతాపూర్‌, సికింద్రాబాద్‌, ఎల్లారెడ్డిగూడ, బాలానగర్‌, మియాపూర్‌, కూకట్‌పల్లితో పాటు పలు ప్రాంతాల్లో పబ్లిక్‌ డిస్ర్టిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లపై ఓవర్‌లోడ్‌ పడుతోంది.

ఇదికూడా చదవండి: Hyderabad: ఖైరతాబాద్‌ గణేశ్‌ విగ్రహ నిమజ్జనం.. ఆరోజు మధ్యాహ్నంలోపే


ఆ ప్రాంతాల్లో ఫ్యూజులు పోవడం, ఓల్టేజీలో హెచ్చుతగ్గులు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్కిల్‌, డివిజన్‌, సెక్షన్లలో ఓవర్‌లోడ్‌ కల్గిన డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లను (డీటీఆర్‌) గుర్తించే చర్యలు ప్రారంభించింది. ఏయే ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లకు నేరుగా విద్యుత్‌ కనెక్షన్లు జారీ చేశారు, ఓవర్‌లోడ్‌ కలిగిన పబ్లిక్‌ డీటీఆర్‌లు ఎక్కడ ఎక్కువ ఉన్నాయనే లెక్కలు తీస్తున్నారు. 15 కిలోవాట్లకు పైబడి లోడ్‌ ఉన్న అపార్ట్‌మెంట్లకు ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్‌ పెట్టుకోవాలని గతంలో నిబంధనలున్నా పూర్తి స్థాయిలో వాటిని అమలు చేయలేదు. ఇప్పుడు తాజాగా 20 కిలోవాట్లకు పైబడి వినియోగం ఉన్న అపార్ట్‌మెంట్లకు ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటును తప్పనిసరి చేశారు.


లేని అపార్ట్‌మెంట్లను గుర్తించాలని సెప్టెంబర్‌ 6న సర్కిళ్ల సూపరింటెండెంట్‌ ఇంజనీర్లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మేడ్చల్‌, హబ్సిగూడ, సంగారెడ్డి, సైబర్‌సిటీ, రాజేంద్రనగర్‌, సరూర్‌నగర్‌, హైదరాబాద్‌ సెంట్రల్‌, హైదరాబాద్‌ సౌత్‌(Hyderabad South), బంజారాహిల్స్‌, సికింద్రాబాద్‌ సర్కిల్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో వందల అపార్ట్‌మెంట్లకు ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్లు లేకుండానే కొంతమంది అధికారులు, సిబ్బంది కనెక్షన్లు జారీచేశారు. ఈ కారణంగా పబ్లిక్‌ ట్రాన్స్‌ఫార్మర్లపై ఓవర్‌లోడ్‌ పడుతూ విద్యుత్‌సరఫరాలో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి. పటాన్‌చెరువు, రాజేంద్రనగర్‌, మేడ్చల్‌ డివిజన్లలో ఉన్నతాధికారులు తనిఖీలు చేపడితే క్షేత్రస్థాయిలో జరిగిన అక్రమాలు బయటపడే అవకాశాలుంటాయని ఓ రిటైర్డ్‌ అధికారి తెలిపారు.


సంగారెడ్డి, రాజేంద్రనగర్‌లో 30 వేల ట్రాన్స్‌ఫార్మర్లు

గ్రేటర్‌జోన్‌ పరిధి 10 సర్కిళ్లలో సింగిల్‌ ఫేజ్‌, త్రీఫేజ్‌ డిస్ర్టిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు మొత్తం 1.85 లక్షల వరకు ఉన్నాయి. సంగారెడ్డిలో అత్యధికంగా 37,782 ట్రాన్స్‌ఫార్మర్లు ఉండగా, రాజేంద్రనగర్‌లో 30,815, సైబర్‌సిటీలో 27,179, మేడ్చల్‌లో 23,041 డిస్ర్టిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. పబ్లిక్‌ ట్రాన్స్‌ఫార్మర్లపై ఓవర్‌లోడ్‌ పడుతూ నగరంలోని పలు ప్రాంతాల్లో రోజుకు నాలుగైదుసార్లు విద్యుత్‌సరఫరాలో అంతరాయాలు తలెత్తుతున్నాయి. 20 కిలోవాట్ల విద్యుత్‌ డిమాండ్‌ కలిగిన భవనాలకు ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తే సరఫరాలో అంతరాయాలను చాలావరకు తగ్గించే అవకాశాలుంటాయని డిస్కం భావిస్తోంది.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి:Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి:Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read LatestTelangana NewsandNational News

Updated Date - Sep 11 , 2024 | 10:00 AM

Advertising
Advertising