ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: రవాణా శాఖలో స్క్రాప్‌ దందా.. స్క్రాప్‌ చేయకుండానే చేసినట్లు సర్టిఫికెట్‌

ABN, Publish Date - Jul 25 , 2024 | 10:29 AM

గ్రేటర్‌ రవాణా విభాగం(ఆర్టీఏ)లో కొత్తరకం దందా సాగుతోంది. మామూళ్లకు అలవాటుపడిన కొందరు అధికారులు నిబంధనలకు నీళ్లొదులుతూ ఆటోలను స్ర్కాప్‌ చేయకుండానే చేసినట్లు సర్టిఫికేట్‌(Certificate) జారీ చేస్తున్నారు.

- డబ్బులకు ఆశపడి అడ్డగోలుగా అనుమతులు

- దర్జాగా గ్రేటర్‌ రోడ్లపై కాలం చెల్లిన వాహనాలు

- ఫిర్యాదు చేసినా పట్టింపులేమిపై అనుమానాలు

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌ రవాణా విభాగం(ఆర్టీఏ)లో కొత్తరకం దందా సాగుతోంది. మామూళ్లకు అలవాటుపడిన కొందరు అధికారులు నిబంధనలకు నీళ్లొదులుతూ ఆటోలను స్క్రాప్‌ చేయకుండానే చేసినట్లు సర్టిఫికేట్‌(Certificate) జారీ చేస్తున్నారు. ఇందుకు ప్రతిఫలంగా ఒక్కో ఆటోకు రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు దండుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఒక ఆటోకు రిజిస్ట్రేషన్‌ చేయాలంటే స్క్రాప్‌ చేసిన ఆటో స్థానంలోనే రిజిస్టర్‌ చేయాలనే నిబంధన ఉంది. కానీ, కొత్త ఆటో కొనేందుకు ఆసక్తి లేని డ్రైవర్లు స్క్రాప్‌ చేయకుండానే చేసినట్లు రవాణా శాఖాధికారులతో కుమ్మక్కై సర్టిఫికెట్లు పొందుతున్నారని ఆటో యూనియన్‌ నేతలు అంటున్నారు. ఈ విషయంపై గత ప్రభుత్వంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని చెబుతున్నారు.

ఇదికూడా చదవండి: TGSRTC: లాంగ్‌ రూట్లపై ఆర్టీసీ దృష్టి.. ఐటీ కారిడార్‌కు సర్వీసులు


లెక్కకు మించి రోడ్లపైకి..

జీహెచ్‌ఎంసీ పరిధిలో అధికారికంగా తిరగాల్సిన ఆటోల సంఖ్య 2.25 లక్షలు. ప్రస్తుతం ఇంతకుమించి తిరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి వాస్తవ లెక్కలు వెలికి తీయాల్సిన రవాణా అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఆమ్యంమ్యాలే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాలం చెల్లిన ఆటోల వల్ల ట్రాఫిక్‌ పెరగడంతోపాటు కాలుష్యం అధికమవుతోంది. ఇప్పటికైనా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి కాలం చెల్లిన ఆటోలను స్క్రాప్‌ చేయకుండా అనుమతులిచ్చిన అధికారులు, వారికి సహాయ సహకారాలు అందిస్తున్న ఉన్నతాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆటో యూనియన్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. స్క్రాప్‌ ఆటోలు ఈస్ట్‌, సౌత్‌, వెస్ట్‌ జోన్‌లనే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.


ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 25 , 2024 | 10:29 AM

Advertising
Advertising
<