ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

LB Stadium: మైదానంలో దందా

ABN, Publish Date - Dec 12 , 2024 | 03:13 AM

దాదాపు హైదరాబాద్‌లోనూ ఇలానే జరుగుతోంది. కానీ, ప్రభుత్వ వర్గాలనుంచి స్పందన కొరవడుతోంది.

  • రాజకీయ ఒత్తిళ్లతో అనుమతి

  • క్రీడాకారుల సాధనకు అడ్డంకి

  • ప్రభుత్వంమారినా అదే తంతు

  • నిరుడు హైదరాబాద్‌ టాకీస్‌ అనే సంస్థ గచ్చిబౌలి స్టేడియంలో సంగీత విభావరి నిర్వహించింది. తర్వాత వారం పాటు ఈ మైదానాన్ని క్రీడాకారులు వాడుకోలేకపోయారు.

  • అక్టోబరు 19న గచ్చిబౌలిలో ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత విభావరి నిర్వహించాక మైదానం చిందరవందరైంది.

  • నవంబరు 30న ఎల్బీ స్టేడియంలో గాయని శ్రేయాఘోషల్‌ సంగీత విభావరి నిర్వహించారు. ఇప్పటికే ఎల్బీ స్టేడియం నిర్వహణపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయినా, ఇవేమీ పట్టనట్లు ప్రైవేటు కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చేస్తున్నారు.

  • అక్టోబరులో ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో పంజాబీ ప్రసిద్ధ గాయకుడు దిల్జిత్‌ దొసాంజె నిర్వహించిన సంగీత విభావరితో ఆ మైదానం ఆగమాగమైంది. దీంతో క్రీడాకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. సోషల్‌ మీడియాలో ఫొటోలు పోస్ట్‌ చేశారు.

(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): దాదాపు హైదరాబాద్‌లోనూ ఇలానే జరుగుతోంది. కానీ, ప్రభుత్వ వర్గాలనుంచి స్పందన కొరవడుతోంది.

..హైదరాబాద్‌లో ప్రస్తుతం ప్రముఖ స్టేడియాలు సంగీత విభావరులు, సినిమాల వేడుకలు, బహిరంగ సభలు, ప్రభుత్వ సమావేశాలకు వేదికలుగా మారి దెబ్బతింటున్నాయి. జాతీయ క్రీడలు, ఆఫ్రో ఏషియన్‌ క్రీడలు, ప్రపంచ మిలటరీ క్రీడలకు ఆతిథ్యమిచ్చిన గచ్చిబౌలి స్టేడియం మొదలు.. సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌ వంటి దిగ్గజ క్రికెటర్లు మ్యాచ్‌లు ఆడిన ఎల్బీ స్టేడియం వరకు హైదరాబాద్‌లోని ఏ క్రీడా సముదాయమైనా ఈవెంట్స్‌ నిర్వాహకులు, ప్రభుత్వ అధికారులకు ఆట వస్తువులుగా మారిపోయాయి. క్రీడాకారులు మైదానాన్ని తమ రెండో ఇల్లుగా భావిస్తారు. అక్కడి మట్టికి నమస్కరించి కానీ లోపలకు అడుగుపెట్టరు. అలాంటి స్టేడియాలు ప్రైవేటు, ప్రభుత్వ కార్యక్రమాలు, పండుగ సంబరాలు, విందులతో దెబ్బతింటున్నాయి. గత ప్రభుత్వంలో క్రీడలను పట్టించుకునే నాఽథుడే లేకపోవడంతో ఈవెంట్‌ నిర్వాహకులు ఆడిందే ఆటగా సాగింది. ఇప్పుడైనా మార్పు వస్తుందని భావిస్తే అది అత్యాశే అయింది. ఆటలపై అభిలాష ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా క్రీడా మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తున్నాక కూడా అడ్డుకట్ట పడకపోవడంపై క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


అనుమతి ఇచ్చేది లేదంటూనే..

ఎల్బీ స్టేడియంతో పాటు క్రీడా మైదానాల్లో ఇకపై ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించమని సీఎం రేవంత్‌ చెప్పాక కూడా స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ (శాట్‌) అనుమతులు ఇస్తోంది. క్రీడేతర కార్యక్రమాలకు మైదానాలను అద్బెకు ఇవ్వబోమని కచ్చితంగా చెప్పిన శాట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఆ తర్వాత వేరే పోస్ట్‌కు వెళ్లిపోయారు. కాగా, గచ్చిబౌలి ఫుట్‌బాల్‌ స్టేడియాన్ని రూ.20 కోట్లతో ఆధునికీకరించారు. అయినా, దేవిశ్రీ కార్యక్రమం కోసం ఇచ్చేశారు. మొదట వెనుకాడినా.. అప్పుడు సీఎంవోలో ఉన్న ఓ ఉన్నతాధికారితో పాటు ప్రభుత్వంలోని ముఖ్య నేత ఒత్తిడితో ఓకే చెప్పేశారు. ఇక హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న ఎల్బీ స్టేడియంలో పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలు క్రికెట్‌, ఫుట్‌బాల్‌ కోచింగ్‌ తీసుకుంటారు. నెలకు లేదా సెషన్‌కు ఇంత అని చెల్లిస్తారు. పిల్లల ఉత్సాహాన్ని చూసి తల్లిదండ్రులు కాస్త ఖర్చయినా ఫర్వాలేదని భావిస్తారు. అలాంటి ఎల్బీ స్టేడియంలో కోచింగ్‌ను నిలిపివేసి మరీ శ్రేయాఘోషల్‌ ఈవెంట్‌కు కేటాయించారు.


ముందుగా టికెట్లు అమ్మేద్దాం..

మనం ఏదైనా కార్యక్రమం చేపడితే ముందుగా తేదీని నిర్ధారణ చేసుకుంటాం.. వేదికను చూసుకుం టాం.. తగిన ఏర్పాట్లు చేసుకుంటాం..! కానీ, ఈవెంట్‌ నిర్వాహకుల దందా వేరే విధంగా ఉంటోంది. కనీసం స్టేడియం బుక్‌ చేయకుండా, శాట్‌ అనుమతి కూడా లేకుండానే ఎల్బీ స్టేడియంలో సంగీత కార్యక్రమానికి టికెట్లు అమ్మేశారు. ఇంతలో తాపీగా.. కార్యక్రమాన్ని నవంబరు 8 నుంచి30కి మార్చారు. ఈ సంగతి తెలిసి శాట్‌ యంత్రాంగం నిర్వాహకులను మందలించినట్టు సమాచారం. కానీ, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సిఫా ర్సు మేరకు ఈ అడ్డంకులన్నీ తొలగిపోయాయి. కాగా, హైదరాబాద్‌లోనే జీఎంఆర్‌ ఎరీనా, హైటెక్స్‌ వంటి పలు ప్రదేశాలున్నాయి. అక్కడ కార్యక్రమాలు చేపట్టడం బాగా ఖర్చుతో కూడుకున్నది కావడంతో నిర్వాహకులు ప్రభుత్వ స్టేడియాలను ఎంచుకుంటున్నారు.


ఆదాయానికి మరో మార్గం లేదా?

మైదానాల నుంచి ఆదాయం రాబట్టాలనే ఉద్దేశం ఉంటే క్రీడా సంఘాల కార్యక్రమాలకు వాటిని కేటాయించవచ్చు. లేదా చుట్టూ వాణిజ్య సముదాయాలు నిర్మించి క్రీడా అనుబంధ విపణిని అభివృద్ధి చేయొ చ్చు. ఒడిశా ప్రభుత్వం ఈ విధంగానే కొన్ని చర్యలు చేపట్టింది. మన రాష్ట్రంలో మాత్రం సంగీత విభావరులు, సినిమా ఫంక్షన్లు, సభల నిర్వహణకు అనుమతిస్తే ఎలాగని పలువురు సీనియర్‌ క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు. ఒడిశా సర్కారును ఆదర్శంగా తీసుకోవాలని క్రీడా నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - Dec 12 , 2024 | 03:13 AM