ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: ఎండ @ 43 డిగ్రీలు

ABN, Publish Date - Apr 20 , 2024 | 12:29 PM

గ్రేటర్‌లో ఎండలు మంట పుట్టిస్తున్నాయి. శుక్రవారం మూసాపేట, కేపీహెచ్‌బీ(Moosapet, KPHB)లో 43, యాకుత్‌పురా-42.9, నాచారం- 42.8, బన్సీలాల్‌పేట-42.7, షేక్‌పేట-42.7, కూకట్‌పల్లి-42.7, అల్కాపురి-42.6, మలక్‌పేట-42.5, మియాపూర్‌లో 42.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

- అధిక ఉష్ణోగ్రతలతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌లో ఎండలు మంట పుట్టిస్తున్నాయి. శుక్రవారం మూసాపేట, కేపీహెచ్‌బీ(Moosapet, KPHB)లో 43, యాకుత్‌పురా-42.9, నాచారం- 42.8, బన్సీలాల్‌పేట-42.7, షేక్‌పేట-42.7, కూకట్‌పల్లి-42.7(Kukatpally-42.7), అల్కాపురి-42.6, మలక్‌పేట-42.5, మియాపూర్‌లో 42.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండతోపాటు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండడంతో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రధానరహదారులపై వెళ్లే వాహనదారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలతో పాటు కనిష్ఠ ఉష్ణోగత్రలు 30 డిగ్రీల వరకు నమోదవుతుండడంతో రాత్రిపూట ఉక్కపోత పెరిగింది. మూడురోజులుగా నగరంలో మధ్యాహ్నం ఎండతో ఉక్కిరిబిక్కిరైన నగరవాసులు, సాయంత్రానికి కురుస్తున్న జల్లులతో ఒకింత ఆహ్లాదాన్ని పొందుతున్నారు. ఒకే రోజులో ఎండ, వర్షంతో రెండు రకాల భిన్న వాతావరణం నెలకొంటున్నది.

ఇదికూడా చదవండి: BJP: ‘నన్ను పండబెట్టి తొక్కుతారా రండి చూద్దాం’.. రేవంత్‌కు డీకే అరుణ సవాల్

ఉరుములు, మెరుపులతో వర్షం..

శని, ఆదివారాల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం, జల్లులు కురిసే అవకాశముందని బేగంపేట వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

ఇదికూడా చదవండి: రాధాకిషన్‌ రావు బెదిరించి ప్లాటు రాయుంచుకున్నాడు

Updated Date - Apr 20 , 2024 | 12:29 PM

Advertising
Advertising