ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hydra: సంగారెడ్డి జిల్లాపైౖ హైడ్రా నజర్‌!

ABN, Publish Date - Sep 22 , 2024 | 04:18 AM

హైడ్రా.. సంగారెడ్డి జిల్లాపై దృష్టి సారించింది. జిల్లాలోని అమీన్‌పూర్‌ మండలంలో పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో నిర్మించిన భవనాలు, ఆక్రమణలను హైడ్రా బృందం శనివారం పరిశీలించింది.

  • ప్రభుత్వ భూముల్లో .. ఆక్రమణల పరిశీలన

పటాన్‌చెరు, సెప్టెంబరు 21: హైడ్రా.. సంగారెడ్డి జిల్లాపై దృష్టి సారించింది. జిల్లాలోని అమీన్‌పూర్‌ మండలంలో పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో నిర్మించిన భవనాలు, ఆక్రమణలను హైడ్రా బృందం శనివారం పరిశీలించింది. కిష్టారెడ్డిపేటలో దర్గా పక్కన ప్రభుత్వ స్థలంలో నిర్మించిన 3 భవనాలను పరిశీలించారు. పూర్తి సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని రెవెన్యూ సిబ్బందికి సూచించారు.


అనంతరం పటేల్‌గూడలోని సర్వే నం.12లో ఇళ్లను, ఐలాపూర్‌ గ్రామ పరిధిలోకి వచ్చే కోర్టు పరిధిలోని భూముల్లో అక్రమ నిర్మాణాలు జరిగినట్లు ఆరోపణలున్న భారీ అపార్ట్‌మెంట్లను, బీరంగూడ సంత పరిసరాల్లోని శంభునికుంటలోనూ ఆక్రమణలను పరిశీలించారు. చెరువు విస్తీర్ణం, ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్ల హద్దులను గుర్తించారు.

Updated Date - Sep 22 , 2024 | 04:18 AM