Hyderabad: వామ్మో.. చికెన్ కంటే చింత చిగురే ఎక్కువ రేటు..!
ABN, Publish Date - Apr 23 , 2024 | 10:40 AM
చింత చిగురు ధర వింటేనే నగరవాసుల గుండె గుభేలుమంటోంది. సాధారణంగా కిలో రూ.100-200 మధ్యలో లభ్యమయ్యే ఈ చిగురు ఏకంగా...
హైదరాబాద్ సిటీ: చింత చిగురు ధర వింటేనే నగరవాసుల గుండె గుభేలుమంటోంది. సాధారణంగా కిలో రూ.100-200 మధ్యలో లభ్యమయ్యే ఈ చిగురు ఏకంగా రూ.500 వరకు ధర పలుకుతుండడంతో నగరవాసులు బెంబేలెత్తుతున్నారు. రూ.300లోపు లభిస్తున్న కిలో చికెన్(Chicken) ధరను మించి చిగురు ధర పలుకుతుండడం నగరవాసులను కలవర పెడుతున్నది. గ్రామాల్లో విరివిగా లభించే ఈ చిగురుకు నగరంలో ఈసారి కొరత ఏర్పడింది.
ఇదికూడా చదవండి: Hyderabad: క్యాబ్ డ్రైవర్‌కు రూ.లక్ష జరిమానా.. పరిహారం చెల్లించాలని ఆదేశించిన జిల్లా ఫోరం 3
రైతుబజార్, ఇతర మార్కెట్లలోనే వీటి ధర మండిపోతున్నది. నాణ్యతను బట్టి కిలో చిగురును రూ.300నుంచి రూ.500వరకు విక్రయిస్తున్నారు. ధరల మోత మోగుతుండడంతో వినియోగదారులు 50 గ్రాముల నుంచి 100 గ్రాముల లోపు కొనుగోలు చేస్తున్నారు. కేపీహెచ్‌బీ రైతు బజార్‌లో 100 గ్రాములకు రూ. 30 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: హనుమాన్ విజయయాత్ర.. నేడు ట్రాఫిక్ ఆంక్షలు
Read Latest Telangana News and Telugu News
Updated Date - Apr 23 , 2024 | 11:40 AM