Hyderabad: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి..
ABN, Publish Date - Dec 11 , 2024 | 07:42 AM
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం డిమాండ్ చేసింది.
- విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం డిమాండ్
హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం డిమాండ్ చేసింది. యూజీసీ పేస్కేల్‌ను అమలు చేసిన తర్వాతే యూనివర్సిటీల్లో అధ్యాపక నియామకాలు చేపట్టాలని సంఘం కన్వీనర్ డాక్టర్ ధర్మతేజ, సమన్వయకర్త డాక్టర్ ఉపేందర్ కోరారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాల యాల ప్రతినిధులతో కలిసి వారు మాట్లాడారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: తండ్రి మందలించాడని.. ఇంటి నుంచి వెళ్లిపోయాడు
గత ప్రభుత్వం రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాలలో పనిచేస్తున్న 1400 మంది అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేసి యూజీసీ పే స్కేల్ అమలు చేస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి ఏడాదైనా హామీని నెరవేర్చలేదని ధర్మతేజ, ఉపేందర్‌లు పేర్కొన్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, బేసిక్, డీఏ,హెచ్‌ఆర్‌ఏ, మూడు శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి వారు విజ్ఞప్తి చేశారు.
తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తే త్వరలో జరిగే పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓట్లను గంపగుత్తగా కాంగ్రెస్ అభ్యర్థులకు వేసి గెలిపిస్తామని, ప్రభుత్వం స్పందించకపోతే త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. సమావేశంలో వివిధ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు శ్రీధర్‌రెడ్డి, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ దత్తు, రవీందర్, నారాయణ,రాజు, రాంచంద్రుడు, డాక్టర్ సునీత, విజయేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా?
ఈవార్తను కూడా చదవండి: తినే మాంసంలో.. యాంటీబయాటిక్స్
ఈవార్తను కూడా చదవండి: సింగరేణి సీఎండీ రేసులో శైలజా రామయ్యర్!
ఈవార్తను కూడా చదవండి: ఆన్‌లైన్‌లో భద్రాద్రి ముక్కోటి దర్శన టికెట్లు
Read Latest Telangana News and National News
Updated Date - Dec 11 , 2024 | 07:46 AM