ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఆ ఏరియాల్లో.. నిత్యం ట్రాఫిక్‌జామే..

ABN, Publish Date - Oct 17 , 2024 | 10:49 AM

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్‌, గచ్చిబౌలి, మాదాపూర్‌, రాయదుర్గం, హఫీజ్‌పేట(Kondapur, Gachibowli, Madapur, Rayadurgam, Hafizpet) ప్రాంతాల్లో నిత్యం ట్రాఫిక్‌ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

- ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

హైదరాబాద్: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్‌, గచ్చిబౌలి, మాదాపూర్‌, రాయదుర్గం, హఫీజ్‌పేట(Kondapur, Gachibowli, Madapur, Rayadurgam, Hafizpet) ప్రాంతాల్లో నిత్యం ట్రాఫిక్‌ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉద యం 8 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఈ ప్రాంతం గుండా ప్రయాణించాలంటే వాహనదారు లు భయపడుతున్నారు. ఈ ప్రాంతంలో జనాభాకు తగిన విధంగా రోడ్ల విస్తరణ జరగకపోవడం, అభివృద్ధి పనుల పేరుతో నెలల తరబడి తవ్వకాలు చేయడం కారణమని స్థానికులు వాపోతున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: 10 బస్‌డిపోలు..1000 కోట్లు.. ఎలక్ట్రిక్‌ బస్‌డిపోల ఏర్పాటుకు ఆర్టీసీ కసరత్తు


మరికొన్ని చోట్ల పనులు ప్రారంభించి మధ్యలో వదిలివేడంతో ఈ సమస్య మరింత జఠిలంగా మారిందన్నారు. కొండాపూర్‌ బొటానికల్‌ గార్డెన్‌మీదుగా మసీద్‌బండ, పాత ముంబై రహదారిని వంద అడుగుల రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. అయితే మసీద్‌బండ గ్రామంలో ఎక్కువశాతం ఇళ్లు కోల్పోతున్న దృష్ట్యా ఈ పనులు 8 ఏళ్లుగా నిలిచిపోయాయి. ఫలితంగా ఈ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్‌ సమస్య తలెత్తుంది.


- గచ్చిబౌలి చౌరస్తా నుంచి లింగంపల్లి వరకు ఉన్న పాత ముంబై రహదారి రోడ్డు విస్తరణ కోసం పనులు ప్రారంభించారు. రాయదుర్గం, గచ్చిబౌలి(Rayadurgam, Gachibowli) మీదుగా పనులు పూర్తి చేసి జీహెచ్‌ఎంసీ జోనల్‌ కార్యాలయం వరకు రోడ్డును విస్తరించి వదిలేశారు. జోనల్‌ కార్యాలయం నుంచి లింగంపల్లి బీహెచ్‌ఈఎల్‌ చౌరస్తా వరకు పనులు నిలిచిపోయాయి. ఇలా మియాపూర్‌ నుంచి గచ్చిబౌలి వరకు, మాదాపూర్‌ హైటెక్‌సిటీ తదితర ప్రాంంతాల్లో కూడా ఇదే సమస్యలున్నాయి. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు.


అదే విధంగా ఇటీవల శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని అన్ని ప్రధాన కూడళ్లను ఆధునీకరిస్తామని చెబుతున్న అధికారులు ఆదిశగా ఎక్కడ పనులు ప్రారంభించిన దాఖలాలు లేవు. అనేకసార్లు జడ్సీ ఉపేందర్‌రెడ్డి అధికారులతో కూడళ్లను పరిశీలించారు. ప్రధాన కూడళ్లలో రోడ్డు విస్తర్ణ జరిగితే ఈ సమస్య కొంత వరకు తీర్చవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా రోడ్డు విస్తరణ పనులు, చౌరస్తాల ఆధునికీకరణ పనులు వేగంగా పూర్తిచేసి ట్రాఫిక్‌ సమస్యకు కొంత ఉపశమనం లభిస్తుందని కాలనీవాసులు అభిప్రాయపడుతున్నారు.


.............................................................

ఈ వార్తను కూడా చదవండి:

............................................................

Hyderabad: నగరంలో విభిన్న వాతావరణం..ఓపక్క ఎండ, మరోపక్క వాన

హైదరాబాద్‌ సిటీ: గత రెండు రోజులుగా ఎండ, వానతో నగరంలో భిన్నవాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో వర్షం పడితే.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండగా ఉంది. మరోవైపు వర్షం కారణంగా రాత్రి సమయంలో చలిగాలుల తీవ్రత పెరిగింది. బుధవారం ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం కురవడంతో గచ్చిబౌలి, మాదాపూర్‌, బంజారాహిల్స్‌(Gachibowli, Madapur, Banjara Hills), జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, అమీర్‌పేట, కుత్బుల్లాపూర్‌, లక్డీకాపూల్‌, నాంపల్లి, కోఠి ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి. గ్రేటర్‌లో మరో రెండురోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని బేగంపేట వాతావరణ అధికారులు తెలిపారు.


పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం (మి.మీలలో)

కుత్బుల్లాపూర్‌ మహదేవపురం- 11.0, కూకట్‌పల్లి శంషీగూడ- 10.0, ముషీరాబాద్‌- 9.8, మియాపూర్‌- 9.5, రాజీవ్‌గృహకల్ప- 8.5, ఈఎ్‌సఎస్‌ గాజులరామారం- 7.5, హైదర్‌నగర్‌- 7.3, బంజారాహిల్స్‌- 7.0, జీడిమెట్ల- 6.8, షాపూర్‌నగర్‌- 6.0, పటాన్‌చెరు- 5.5, కేపీహెచ్‌బీ- 5.5, ఆర్సీపురం- 5.5, యూసు్‌ఫగూడ- 5.3, పాటిగడ్డ- 5.0


ఇదికూడా చదవండి: పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత సుజాత...

ఇదికూడా చదవండి: హైడ్రాకు జీహెచ్‌ఎంసీ, మునిసిపల్‌ అధికారాల బదిలీ

ఇదికూడా చదవండి: Revenue System: మళ్లీ గ్రామ రెవెన్యూ వ్యవస్థ!

ఇదికూడా చదవండి: బతుకమ్మరోజు ఆడబిడ్డలకు ఒక్కచీరా ఇవ్వలేదు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 17 , 2024 | 10:49 AM