ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

హైదరాబాద్‌లో శోభయాత్ర: ట్రాఫిక్ ఆంక్షలు

ABN, Publish Date - Apr 17 , 2024 | 07:29 PM

శ్రీరామనవమి శోభయాత్ర నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ బుధవారం వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.

Hyderabad Traffic diversions

హైదరాబాద్, ఏప్రిల్ 17: శ్రీరామనవమి శోభయాత్ర ( Rama Navami Shoba Yatra) నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ (Hyderabad city police) బుధవారం వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఆ క్రమంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని చెప్పారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. సీతారాంబాగ్ ఆలయం నుంచి ఊరేగింపు ప్రారంభమవుతుంది.

ఆసిఫ్ నగర్ నుండి వచ్చే ట్రాఫిక్‌ను భోయిగూడ కమాన్ మీదుగా కాకుండా.. మల్లేపల్లి క్రాస్ రోడ్సు మీదగా విజయనగర్ కాలనీ లేదా మెహిదీపట్నం మీదగా మళ్లీస్తారు. అఘాపురా మరియు బోయిగూడ కమాన్ బైలేన్ల నుండి వచ్చే ట్రాఫిక్ సీతారామ్ బాగ్ వైపు అనుమతించరు.. అది అఘాపురా లేదా హబీబ్ నగర్ వైపు మళ్లీస్తారు. ఇక ఊరేగింపు భోయిగూడ కమాన్‌కు చేరుకున్నప్పుడు, దారుస్సలాం నుండి వచ్చే ట్రాఫిక్‌ను అగాపురా వద్ద ఘోడే-కీ-ఖబర్ లేదా న్యూ అఘపురా, చర్‌ఖండిల్ క్రాస్ రోడ్, నాంపల్లి అఘాపురా క్రాస్ రోడ్ఘోడే-కి-ఖబర్ వైపు మళ్లిస్తారు.

AP Election 2024: సీఎం జగన్ దంపతులపై బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది నారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఊరేగింపు బోయిగూడ కమాన్ వద్ద మంగళ్‌హాట్ మార్కెట్ వైపు ప్రవేశించినప్పుడు, ట్రాఫిక్ ఘోడే-కీ-ఖబర్ వద్ద టక్కర్‌వాడి జంక్షన్ లేదా న్యూ అఘపురా చర్కండిల్ క్రాస్ రోడ్ వైపు మళ్లించబడుతుంది. ఊరేగింపు జాలి హనుమాన్ వద్దకు చేరుకునే సమయంలో, పురానాపూల్ గాంధీ విగ్రహం నుండి వచ్చే ట్రాఫిక్‌ను పురానాపూల్ వంతెన వైపు లేదా పురానాపూల్ దర్వాజా, కార్వాన్, కుల్సుంపురా, 100 అడుగుల రోడ్డు వైపు మళ్లిస్తారు.


ఊరేగింపు గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నప్పుడు, అఫ్జల్‌గంజ్ లేదా సిటీ కాలేజీ నుండి జుమెరాత్ బజార్ రోడ్డు వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ అనుమతించబడదు. ఆ ట్రాఫిక్ ఎంజే బ్రిడ్జి వద్ద సిటీ కాలేజీ, అఫ్జల్‌గంజ్ వైపు మళ్లించబడుతుంది. ఊరేగింపు రాణి అవంతీ బాయి విగ్రహం, జుమ్మెరత్ బజార్‌కు చేరుకున్నప్పుడు, బేగమ్ బజార్ చార్త్రి బైలేన్‌ల నుండి వచ్చే ట్రాఫిక్‌ను లేబర్ అడ్డా వద్ద అలస్కా వైపు దారుస్సలాం లేదా మలకుంట లేబర్ అడ్డా అలాస్కా టి జంక్షన్ వైపు మళ్లిస్తారు.

Lok Sabha elections: గుళ్లను చుట్టేస్తున్న కంగనా

ఊరేగింపు బేగంబజార్ చత్రికి చేరుకున్నప్పుడు, మాలకుంట నుండి వచ్చే ట్రాఫిక్‌ను ఎంజే బ్రిడ్జి వైపు అనుమతించరు, అలాస్కా వద్ద దారుస్సలాం లేదా మలకుంట టి జంక్షన్ వైపు మళ్లిస్తారు. ఇక ఊరేగింపు బర్తన్ బజార్ చేరుకున్నప్పుడు, అఫ్జల్‌గంజ్ నుండి ఎస్ఏ బజార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను అఫ్జల్‌గంజ్ వైపు మళ్లిస్తారు. ఊరేగింపు ఎస్ఏ బజార్‌కు చేరుకున్నప్పుడు.. అజంతా గేట్, జాంబాగ్ నుండి వచ్చే ట్రాఫిక్ ఎడమవైపు ఎంజే మార్కెట్ వద్ద జీపీఓ, మాలకుంట వైపు మళ్లించబడుతుంది.


ఇక తూర్పు జోన్‌లో ట్రాఫిక్ ఆంక్షలు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు అమల్లో ఉంటాయి.

ఊరేగింపు బర్తాన్ బజార్ చేరుకున్నప్పుడు, అఫ్జల్‌గంజ్ నుండి వచ్చే ట్రాఫిక్‌ను ఎస్ఏ బజార్ వైపు అనుమతించరు.. దానిని సెంట్రల్ లైబ్రరీ వైపు మళ్లిస్తారు. ఊరేగింపు గౌలిగూడ చమన్‌కు చేరుకున్నప్పుడు, రంగమహల్ మరియు ఆంధ్రాబ్యాంక్ నుండి వచ్చే ట్రాఫిక్‌ను శంకర్ షేర్ హోటల్ వైపు అనుమతించరు,

పుత్లిబౌలి క్రాస్ రోడ్స్ వద్ద జాంబాగ్ వైపు మళ్లిస్తారు. ఊరేగింపు రామమందిర్ కమాన్, గౌలిగూడకు చేరుకున్నప్పుడు, చాదర్‌ఘాట్ నుండి వచ్చే ట్రాఫిక్‌ను పుత్లీబౌలి వైపు అనుమతించరు.. ఆ ట్రాఫిక్‌ను రంగమహల్ వద్ద సీబీఎస్, అఫ్జల్‌గంజ్ వైపు మళ్లిస్తారు. జీపీఓ అబిడ్స్ - బ్యాంక్ స్ట్రీట్ నుండి వచ్చే ట్రాఫిక్ ఆంధ్రాబ్యాంక్ క్రాస్ రోడ్డు వద్ద డీఎం అండ్ హెచ్ఎస్, చాదర్‌ఘాట్ ఆంధ్రా బ్యాంక్ వైపు మళ్లించబడుతుంది.

AP Election: ఆంధ్రా ఓటరు ఎటు వైపు..?

ఊరేగింపు రామమందిర్ కమాన్, గౌలిగూడకు చేరుకున్నప్పుడు, జీపీఓ నుంచి బ్యాంక్ స్ట్రీట్ వైపు ట్రాఫిక్ అనుమతించబడదు. దీంతో అబిడ్స్ జీపీవో వద్ద ట్రాఫిక్ నాంపల్లి స్టేషన్ రోడ్డు, ఎంజే మార్కెట్ వైపు మళ్లించబడుతుంది. శోభయాత్ర పుత్ బౌల్లీ ఆంధ్రబ్యాంక్ క్రాస్ రోడ్డుకు చేరుకుంటుంది.

దీంతో చాదర్‌ఘాట్, రంగమహాల్ నుంచి వచ్చే ట్రాఫిక్ డీఎంహెచ్ఎస్ వైపు మళ్లించకుండా.. చాదర్ ఘాట్ క్రాస్ రోడ్డు మీదగా నింబోలి అడ్డా, కాచిగూడ క్రాస్ రోడ్డు మీద మళ్లిస్తారు. యూసఫేయన్ అండ్ కంపెనీ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్.. ట్రూప్ బజార్, బ్యాంక్ స్ట్రీట్ వైపు మళ్లించకుండా. అబిడ్స్ జీపీవో వైపు మళ్లిస్తారు.


ఊరేగింపు డీఎం అండ్ హెచ్‌ఎస్ క్రాస్ రోడ్డుకు చేరుకున్నప్పుడు.. చాదర్‌ఘాట్ వైపు నుంచి డీఎంహెచ్ఎస్ వైపునకు వచ్చే ట్రాఫిక్‌ను అనుమతించబడదు.. ఆ ట్రిఫిక్‌ను పుత్‌బౌలి, రంగమహాల్ వైపు మళ్లించబడుతుంది. ఈ శోభయాత్ర ఊరేగింపు.. సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్డు చేరుకుంటుంది. దీంతో బడిచౌడీ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను రాయల్ టీ ప్లాజా టి జంక్షన్ వైపు అనుమతించరు.

Shakeel: నా కొడుకును చంపేస్తామంటున్నారు.. బోధన్ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

రామకోటి, సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్స్ వద్ద డీఎం అండ్ హెచ్ఎస్ వైపు మళ్లించబడుతుంది. ఊరేగింపు సుల్తాన్ బజార్ ఎక్స్ రోడ్ (బాటా) చేరుకున్నప్పుడు, బడిచౌడి నుండి వచ్చే ట్రాఫిక్... రాయల్ ప్లాజా టి జంక్షన్ వైపునకు అనుమతించబడదు. ఈ ఊరేగింపు హనుమాన్ టెడ్కి లైన్ చేరుకున్నప్పుడు.. నారాయణగూడ, కాచిగూడ స్టేషన్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను సుల్తాన్ బజార్ వైపు అనుమతించరు.

కాచిగూడ క్రాస్ రోడ్సు మీదగా కాచిగూడ స్టేషన్ రోడ్డు వైపు ఆ ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. ఊరేగింపు రాయల్ ప్లాజా టి జంక్షన్ రాంకోటికి చేరుకున్నప్పుడు తిలక్ రోడ్ మరియు కింగ్ కోటి నుండి వచ్చే ట్రాఫిక్‌ను అనుమతించరు. హనుమాన్ టేకిడి - హనుమాన్ వ్యాయమశాల రహదారి మీదుగా బొగ్గులకుంట క్రాస్ రోడ్ వద్ద రాంకోటి వైపు మళ్లిస్తారు.

తెలంగాణ వార్తలు కోసం..

Updated Date - Apr 17 , 2024 | 07:29 PM

Advertising
Advertising