ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: ట్యాంక్‌బండ్‌, పరేడ్‌ గ్రౌండ్‌ పరిసరాల్లో.. ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN, Publish Date - Jun 01 , 2024 | 12:06 PM

రాష్ట్రావతరణ వేడుకల సందర్భంగా ట్యాంక్‌బండ్‌, పరేడ్‌గ్రౌండ్‌(Tankbund, Paradeground) ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని సీపీ కె.శ్రీనివాస్ రెడ్డి(CP K. Srinivas Reddy) ఒక ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్‌ సిటీ: రాష్ట్రావతరణ వేడుకల సందర్భంగా ట్యాంక్‌బండ్‌, పరేడ్‌గ్రౌండ్‌(Tankbund, Paradeground) ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని సీపీ కె.శ్రీనివాస్ రెడ్డి(CP K. Srinivas Reddy) ఒక ప్రకటనలో తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై శనివారం ఉదయం నుంచి ఆదివారం రాత్రి 12 గంటల వరకు, గన్‌పార్క్‌ వద్ద ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 10గంటల వరకు, పరేడ్‌గ్రౌండ్‌ పరిసరాల్లో ఆదివారం ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలుంటాయని తెలిపారు.

ఇదికూడా చదవండి: Hyderabad: సినిమా షూటింగ్‌లు లేక.. మద్యం తాగేందుకు డబ్బుల కోసం ఏం చేశాడో తెలిస్తే..


- ట్యాంక్‌ బండ్‌ పరిసరాల్లో..

అప్పర్‌ ట్యాంక్‌బండ్‌పై శనివారం ఉదయం 6 గంటల నుంచి జూన్‌ 2 రాత్రి 12 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలుంటాయి. నల్లగుట్ట జంక్షన్‌ నుంచి నెక్లెస్‌ రోటరీ వైపునకు వచ్చేవాహనాలను రాణిగంజ్‌ వైపునకు మళ్లిస్తారు. రాణిగంజ్‌ నుంచి నెక్లెస్‌ రోటరీ వైపునకు వచ్చే వాహనాలను మినిస్టర్‌ రోడ్‌ వైపునకు మళ్లిస్తారు. వీవీ స్టాచ్యూ వైపు నుంచి నెక్లెస్‌ రోటరీ వైపునకు వచ్చే వాహనాలను నల్లగుట్ట వైపు నకు పంపుతారు. పాత సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ వైపునుంచి వచ్చేవాహనాలను రవీంద్రభారతి వైపునకు మళ్లిస్తారు. ఇక్బాల్‌ మినార్‌ వైపునుంచి వచ్చే వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ మీదుగా స్టీల్‌బ్రిడ్జి వైపున కు పంపుతారు. లిబర్టీ, బషీర్‌బాగ్‌ వైపునుంచి వచ్చేవాహనాలను అంబేడ్కర్‌ విగ్రహం నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ వైపునకు మళ్లిస్తారు. బండమైసమ్మ క్రాస్‌రోడ్‌ నుంచి వచ్చేవాహనాలను ఇందిరాపార్క్‌ వైపునకు పంపుతారు. కవాడిగూడ వైపునుంచి వచ్చేవాహనాలను బైబిల్‌ హౌస్‌, డీబీఆర్‌ మిల్స్‌ వైపునకు పంపుతారు.

ఇదికూడా చదవండి: Hyderabad: ఇంజనీరింగ్‌ పూర్తి చేసి.. ఉద్యోగ వేటలో నగరానికి వచ్చి.. చివరకు ఏమయ్యారో తెలిస్తే..


- గన్‌పార్క్‌ పరిసరాల్లో..

సైఫాబాద్‌ పాత పోలీస్‌స్టేషన్‌, రవీంద్రభారతి జంక్షన్‌ నుంచి వచ్చే వాహనాలను నాంపల్లి టి జంక్షన్‌ వైపు అనుమతించరు. నాంపల్లి టి జంక్షన్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌ మీదుగా బీజేఆర్‌ విగ్రహం వైపునకు పంపుతారు. రవీంద్రభారతి, ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌ జంక్షన్‌ల వద్ద భారీగా ట్రాఫిక్‌ ఉండే అవకాశముంది.


- పరేడ్‌ గ్రౌండ్స్‌ పరిసరాల్లో..

బేగంపేట వైపునుంచి సికింద్రాబాద్‌ వైపునకు వచ్చేవాహనాలను సీటీఓ, తివోలీ, వైఎంసీఏ, సంగీత్‌ క్రాస్‌రోడ్స్‌ వైపునకు పంపుతారు. బేగంపేట నుంచి కార్ఖానా వైపునకు వెళ్లే వాహనాలను పాట్నీ, వైఎంసీఏ వైపునకు మళ్లిస్తారు. ఆర్‌పీ రోడ్‌ వైపునుంచి తిరుమలగిరి వైపు వెళ్లే వాహనాలను ప్యాట్నీ, క్లాక్‌ టవర్‌, వైఎంసీఏ వైపు పంపుతారు. సంగీత్‌ నుంచి బేగంపేట వైపునకు వచ్చేవాహనాలను క్లాక్‌ టవర్‌, ప్యారడైజ్‌ మీదుగా రసూల్‌పురా దారికి పంపుతారు. ఆలుగడ్డబావి వైపు నుంచి తాడ్‌బండ్‌, బోయినపల్లి వైపు వెళ్లేవాహనాలను సీటీఓ, రాణిగంజ్‌ వైపునకు పంపుతారు. బోయిపల్లి వైపు నుంచి తివోలీ వైపు వచ్చే వాహనాలను సీటీఓ వైపునకు పంపుతారు. కార్ఖానా, జేబీఎస్‌, తిరుమలగిరి వైపు నుంచి ప్యాట్నీ వైపునకు వెళ్లే వాహనాలను స్వీకార్‌ ఉపకార్‌, వైఎంసీఏ, క్లాక్‌టవర్‌ వైపునకు పంపుతారు. తివోలి క్రాస్‌రోడ్స్‌, ప్లాజా క్రాస్‌రోడ్స్‌ నుంచి పరేడ్‌ గ్రౌండ్‌కు వెళ్లే దారిని మూసివేస్తారు. ఆయా రూట్లలో ప్రయాణించే వాహనదారు లు ఈ ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని, ప్రత్యామ్నాయ మార్గా ల్లో ప్రయాణించి రద్దీని నివారించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 01 , 2024 | 12:06 PM

Advertising
Advertising