Hyderabad: ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
ABN, Publish Date - Oct 10 , 2024 | 09:45 AM
సద్దుల బతుకమ్మ వేడుకల నేపథ్యంలో గురువారం ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్(City Traffic Additional CP Vishwaprasad) తెలిపారు.
హైదరాబాద్ సిటీ: సద్దుల బతుకమ్మ వేడుకల నేపథ్యంలో గురువారం ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్(City Traffic Additional CP Vishwaprasad) తెలిపారు. నాంపల్లి అమరవీరుల స్మారక స్తూపం నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్‌లోని చిల్డ్రన్ పార్కు వరకు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ట్యాంక్‌బండ్ మీదుగా ఎంజీబీఎస్ వైపు జిల్లా ఆర్టీసీ బస్సులను ట్యాంక్‌బండ్‌పైకి అనుమతించరు.
ఈ వార్తను కూడా చదవండి: KCR: రతన్ టాటా మృతిపట్ల కేసీఆర్ సంతాపం
ఓల్డ్ సైఫాబాద్ పోలీసుస్టేషన్ (ద్వారక హోటల్), ఇక్బాల్ మినార్, తెలుగుతల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ, లిబర్టీ, పాత అంబేడ్కర్ విగ్రహం, కవాడిగూడ క్రాస్‌రోడ్స్, కట్టమైసమ్మ గుడి, కర్బలా మైదానం, రాణిగంజ్, నల్లగుట్ట, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి వాహనాలను దారి మళ్లిస్తామని తెలిపారు. ఆంక్షలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని వాహనదారులకు అదనపు సీపీ సూచించారు.
...........................................................
ఈ వార్తను కూడా చదవండి:
..........................................................
Hyderabad: ‘స్పెషల్’ బాదుడు.. దసరా ప్రత్యేక బస్సుల్లో చార్జీల మోత
- 25 శాతం పెంచిన టీజీఎస్ఆర్టీసీ
హైదరాబాద్ సిటీ: బతుకమ్మ, దసరా(Bathukamma, Dussehra) పండుగలకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ చార్జీల షాక్ ఇచ్చింది. పండుగ సందర్భంగా నడుపుతున్న స్పెషల్ బస్సుల్లో అదనంగా 25 శాతం చార్జీలు పెంచింది. నగరం నుంచి తెలంగాణ, ఏపీలోని జిల్లాలకు వెళ్లే స్పెషల్ సర్వీసులకు ఈ చార్జీలు వర్తిస్తాయని పేర్కొంది. ఈనెల 14 వరకు 6,300 స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని, పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఆధార్‌కార్డు చూపించి మహిళలు ఉచిత ప్రయాణాలు చేయవచ్చని అధికారులు తెలిపారు. పండుగ వేళ ఆర్టీసీ చార్జీలు పెంచడంపై సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గురు, శుక్రవారాల్లో ఏపీ, తెలంగాణ జిల్లాలకు 3 వేలకు పైగా స్పెషల్ బస్సులు నడిపేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. బుధవారం రాత్రి 9 గంటల వరకు 700 స్పెషల్ సర్వీసులు జిల్లాలకు తరలివెళ్లగా, గురువారం 900 ప్రత్యేక బస్సులు సిద్ధంగా ఉంచారు.
సొంతూళ్లకు చలోచలో..
సద్దుల బతుకమ్మ, దసరా నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ప్రజలు స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు. జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో మూడు, నాలుగు రోజులుగా ఎంజీబీఎస్, జేబీఎస్‌లలో రద్దీ నెలకొంది. మరోవైపు దసరా పండుగ రద్దీని అధిగమించేందుకు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఈనెల 10న మచిలీపట్నం-సికింద్రాబాద్ (07073), 11న సికింద్రాబాద్-తిరుపతి (07074), 12న తిరుపతి-కాకినాడ టౌన్ (07075), 13న కాకినాడ టౌన్ -సికింద్రాబాద్ (07076) రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. కాగా, ఈ నెల 14 వరకు విద్యాసంస్థలకు పండగ సెలవులు ఉండటంతో ఏపీవాసులు సైతం సొంతూళ్లకు వెళ్తున్నారు.
ఇదికూడా చదవండి: Revanth Reddy: దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది..
ఇదికూడా చదవండి: KTR: మూసీ పేరిట లక్ష కోట్ల దోపిడీకి యత్నం
ఇదికూడా చదవండి: Ponnam: సున్నాకే పరిమితమైనా బుద్ధి మారలేదు
ఇదికూడా చదవండి: Sangareddy: సంగారెడ్డిలో నవజాత శిశువు కిడ్నాప్
Read Latest Telangana News and National News
Updated Date - Oct 10 , 2024 | 09:45 AM